Rocking Star Yash
-
యష్ టాక్సిక్ మూవీ స్టోరీలో బిగ్ ట్విస్ట్..!
-
ఏప్రిల్ 14న రాఖీభాయ్ తో షాహిద్ బాక్సాఫీస్ ఫైట్
-
కేజీఎఫ్.. నిజంగా అద్భుతం: రాజమౌళి
లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్’.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తుండగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా పరిచయం అవుతోంది. డిసెంబర్ 21న పలు భాషల్లో భారీగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారాహి చలనచిత్ర’ బ్యానర్‌పై నిర్మాత సాయికొర్రపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కైకాల సత్యనారాయణతో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్ కన్నడ సినిమాలాగా కాకుండా పాన్ ఇండియన్ సినిమాలా రిలీజ్ అవుతోంది. చాలా సంతోషంగా ఉంది. అంత మంచి విజువల్స్ రావాలంటే డబ్బులు పెడితేనో, హీరో డేట్స్ ఇస్తేనో రావు. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉండాలి. అలాంటి టీమ్ వీళ్లకు దొరికింది కాబట్టే ఇలాంటి సినిమా తీయగలిగారు. ఇండియాలో ఏ భాషలోనూ లేని గొప్పతనం మన తెలుగువాళ్లకు ఉంది. ఒక సినిమా నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. కేజీఎఫ్ చాలా పెద్ద విజయం సాధించాల’ని రాజమౌళి కోరుకున్నారు. ‘రాజమౌళి ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి మా అందరికీ బాట వేశారు. విజన్ ముందు బడ్జెట్ అనేది చాలా చిన్న విషయం అని నిరూపించారు. మీ అడుగుల్లోనే మేము ధైర్యంగా ఈ చిత్రన్ని పాన్ ఇండియాన్ సినిమాగా తీసుకొస్తున్నాం. హ్యాట్సాఫ్ సర్. నా టీమ్‌లోని ప్రతి టెక్నీషియన్ ఎంతో కష్టపడి పని చేయడం వల్లే ఇలాంటి సినిమా సాధ్యమైంది. చాలా ఎఫర్ట్ పెట్టి ఈ చిత్రాన్ని రూపొందించాం. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తార’ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆకాంక్షించారు. -
అట్టహాసంగా యశ్, రాధిక వివాహం
బొమ్మనహళ్లి (బెంగళూరు) : శాండిల్ ఉడ్‌లో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన రాకింగ్ స్టార్ యశ్, నటి రాధిక పండిత్ శుక్రవారం కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో జరిగిన వివాహ వేడుకలు నభూతో నభవిష్యతి అన్న చందంగా సాగాయి. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో కళాదర్శకుడు అరుణ్ సాగర్ నేతృత్వంలో చూడచక్కని కల్యాణ వేదికను నిర్మించారు. వేదిక ముందు శివపార్వతుల విగ్రహం సాక్షిగా యశ్ మధ్యాహ్నం 12.35 గంటలకు రాధిక మెడలో మూడు ముళ్లు వేశారు. యువ జోడిని ఆశీర్వదించడానికి ఆది చుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడు నిర్మలానంద స్వామిజీ, మాజీ సీఎం ఎ.ఎం. కృష్ణ, మాజీ మంత్రులు వీ.సోమన్న, చెలువరాయస్వామి, జమీర్ ఆహ్మద్‌ఖాన్, కన్నడ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటులు రవిచంద్రన్, శివరాజ్ కుమార్, రాఘవేంద్ర, రాజ్‌కుమార్, సుదీప్తో పాటు శాండిల్ ఉడ్ తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. శ్రీనాథ్ దంపతులు, దొడ్డణ్ణ, సీనియర్ నటి భారతి విష్ణువర్ధన్, దర్శకుడు పవన్ ఒడెయార్, ఏ.పి. అర్జున్, మహేష్‌రావు, నిర్మాత జయణ్ణ, మంజు, జయ కర్ణాటక అధ్యక్షుడు ముత్తప్ప రైతో పాటు పలువురు పెద్దలు కొత్త దంపతులను ఆశీర్వదించారు. అంతకు ముందు రాధిక పండిత్ తండ్రి కృష్ణకుమార్ పండిత్ యశ్‌ను కల్యాణ మంటపానికి తీసుకువచ్చారు. అక్కడ వినాయకుడికి ప్రత్యేక పూజలు అనంతరం ఆదిచుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడు నిర్మలానంద స్వామి వద్ద యశ్ ఆశీర్వాదం పొందారు. అనంతరం రాధిక పండిత్‌ను కూడా తండ్రి కృష్ణకుమార్ పండిత్ కల్యాణ మండపానికి తీసుకు వచ్చారు. అంతకు ముందు గౌరీపూజ నిర్వహించారు.