చైనాలో చిరు సందడి | South Indian Stars Of 80s Get Together Party in china | Sakshi
Sakshi News home page

చైనాలో చిరు సందడి

Jun 8 2017 12:53 PM | Updated on Sep 5 2017 1:07 PM

80లలో టాప్ స్టార్లుగా వెలిగిన సీనియర్లు ప్రతీ ఏడాది ఓ గెట్టు గెదర్ పార్టీలో కలుస్తుంటారు. ఇప్పటి వరకు చెన్నై, హైదరాబాద్

80లలో టాప్ స్టార్లుగా వెలిగిన సీనియర్లు ప్రతీ ఏడాది ఓ గెట్టు గెదర్ పార్టీలో కలుస్తుంటారు. ఇప్పటి వరకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ తొలిసారిగా విదేశాల్లో సీనియర్లందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్టీ కోసం ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్స్ ఖుష్బూ, సుహాసినీ, రాధికా, దర్శకుడు భాగ్యరాజ చైనా చేరుకున్నారు.

ఇక్కడ తమ ఫాలోయింగ్ కారణంగా బయట ప్రశాంతంగా తిరగలేని మన తారలు చైనా వీదుల్లో చక్కర కొడుతున్నారు. అక్కడి పర్యాటక ప్రదేశాల్లో ఫోటోలు, సెల్పీలు దిగుతూ సందడి చేస్తున్నారు. తాజాగా బీజింగ్ లో మెగాస్టార్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. రైల్వే స్టేషన్ తో పాట, బీజింగ్ నేషనల్ స్టేడియం ముందు మన సీనియర్ స్టార్స్ దిగిన ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement