జవహర్‌నగర్, న్యూస్‌లైన్: జవహర్‌నగర్ పరిధిలోని నార్నె రంగారావు ఎస్టేట్స్‌కు గ్రామపంచాయతీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి జయరాం మాట్లాడుతూ.. ఫైరింగ్‌రేంజ్ పరిసర ప్రాంతాల్లో వర్షపునీరు దిగువప్రాంతాలకు వెళ్లకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టారని ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీ, శ్రీసాయి వెల్ఫేర్ సొసైటీల ఫిర్యాదు మేరకు ఎన్నోసార్లు ఎస్టేట్ వారికి నోటీసులు జారీ చేశామని అన్నారు. అయినా స్పందించలేదని, తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. వారం రోజుల గడువు అనంతరం ప్రహరీ నిర్మాణాన్ని కూల్చివేసి నాలాను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
‘నార్నె ఎస్టేట్స్’కు పంచాయతీ నోటీసులు
Published Tue, Jan 28 2014 11:56 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement