అనిల్ కుంబ్లేతో జయరామన్
కేరళ మాజీ కెప్టెన్, కెసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు కె జయరామన్(67) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన శనివారం రాత్రి తిరువనంతపురంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1980లలో కేరళ రంజీ జట్టు తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో జయరామన్ ఒకరు.
1986-87 రంజీల సీజన్‌లో ఆయన వరుసగా నాలుగు సెంచరీలు సాధించి, భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యే స్థాయికి చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ అతడికి భారత జట్టులో చోటుదక్కలేదు. జయరామన్ కేరళ సీనియర్, జూనియర్ జట్లకు కెప్టెన్‌గా కూడా పనిచేశారు. తన కెరీర్‌లో 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జయరామ్ 5 సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 2,358 పరుగులు చేశారు.
దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ తరఫున కూడా ఆడారు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలా కాలం పాటు కేరళ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశారు. అదే విధంగా అండర్-22, అండర్-25 జట్లకు చీఫ్ సెలెక్టర్‌గా కూడా పనిచేశారు. 2010లో బీసీసీఐ మ్యాచ్ రిఫరీగా కూడా జయరామన్ పనిచేశారు. ఇక జయరామ్ మృతిపట్ల బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: WTC Cycle 2023-25: వెస్టిండీస్‌పై ఘన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment