Kerala Cricket Association
-
‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్(Sanju Samson) తండ్రి శాంసన్ విశ్వనాథ్ మరోసారి తీవ్ర ఆరోపణలతో తెరమీదకు వచ్చారు. తన కుమారుడి ఎదుగులను ఓర్వలేక.. కావాలనే తొక్కేస్తున్నారంటూ కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)పై మండిపడ్డారు. అసోసియేషన్‌లోని ‘పెద్ద తలకాయల’పై తనకేమీ కోపం లేదని.. సమస్యంతా అబద్దాలను కూడా నిజంలా ప్రచారం చేసే ‘చిన్నవాళ్ల’ గురించేనని పేర్కొన్నారు.కాగా ఇటీవల అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలతో చెలరేగాడు కేరళ స్టార్ సంజూ శాంసన్. ఈ క్రమంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) జట్టులో చోటు దక్కడం ఖాయమని సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం అభిప్రాయపడ్డారు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో సంజూ సత్తా చాటగలడని మద్దతు పలికారు.సంజూ శాంసన్‌కు మొండిచేయిఅయితే, ఈ మెగా టోర్నీలో సంజూ శాంసన్‌కు టీమిండియా సెలక్టర్లు మొండిచేయి చూపారు. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్(KL Rahul)తో పాటు రిషభ్ పంత్(Rishabh Pant)ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కాగా దేశీ క్రికెట్ టోర్నీల్లో కేరళ జట్టుకు సంజూ కెప్టెన్‌గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈసారి మాత్రం కేసీఏ అతడి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించింది. తాము నిర్వహించిన మూడు రోజుల శిక్షణా శిబిరానికి హాజరుకానుందున సంజూకు విజయ్ హజారే ట్రోఫీ ఆడే జట్టులో చోటివ్వలేదని తెలిపింది.అదే విధంగా.. సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడో.. లేదో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని సంజూపై ఆరోపణలు చేసింది. తనకు నచ్చినపుడు వచ్చి ఆడతామంటే కుదరదని.. అందరి ఆటగాళ్లలాగే అతడు కూడా అని స్పష్టం చేసింది.నా కుమారుడిపై పగబట్టారునిజానికి విజయ్ హజారే ట్రోఫీలో గనుక తనను తాను నిరూపించుకుంటే సంజూ కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీ రేసులో ఉండేవాడే! ఈ పరిణామాల నేపథ్యంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ స్పందించారు. ‘‘కేసీఏలో ఉన్న కొద్ది మంది వ్యక్తులు నా కుమారుడికి వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పగ సాధిస్తున్నారు.ఇంతవరకు మేము అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి వారి చేష్టలు శ్రుతిమించాయి. సంజూ ఒక్కడే క్యాంపునకు హాజరు కాలేదన్నట్లు మాట్లాడుతున్నారు. చాలా మంది శిక్షణా శిబిరంలో పాల్గొనకపోయినా వాళ్లను ఎంపిక చేశారు.వారి ప్రమేయం లేదుకేసీఏ అధ్యక్షుడు జయేశ్ జార్జ్, కార్యదర్శి వినోద్‌కు ఈ విషయంలో ప్రమేయం లేదని అనుకుంటున్నా. అయితే, కొంతమంది కిందిస్థాయి వ్యక్తులు సంజూ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ వారి మనసులలో విషాన్ని నింపుతున్నారు’’ అని విశ్వనాథ్ మాతృభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు ఆరోపణలు చేశారు.కాగా గతంలోనూ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్ల తన కుమారుడి కెరీర్ నాశనం అయిందని.. పదేళ్ల పాటు అతడి సమయం వృథా అయిందని పేర్కొన్నారు. ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన కొడుకుకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కాగా సంజూ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
సంజూ శాంసన్‌కు భారీ షాక్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు భారీ షాక్ తగిలింది. కేరళ క్రికెట్ అసోసియేషన్ అతడి విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. కాగా దేశవాళీ క్రికెట్లో సొంత రాష్ట్రం కేరళకు సంజూ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.అప్పుడు కెప్టెన్గాఇటీవల దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ జట్టుకు సంజూ శాంసన్(Sanju Samsom) కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సారథ్యంలో కేరళ కనీసం నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక ఈ టోర్నమెంట్లో సంజూ ఆరు మ్యాచ్‌లు ఆడి 135 పరుగుల చేయగలిగాడు.ఈ క్రమంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25) నేపథ్యంలో సంజూ శాంసన్‌కు మొండిచేయి ఎదురైంది. కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) తాము ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో సంజూకు చోటివ్వలేదు. అందుకే అతడిని ఎంపిక చేయలేదుఈ విషయం గురించి కేసీఏ కార్యదర్శి వినోద్ ఎస్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘డిసెంబరు 13- 17 వరకు విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ కోసం నిర్వహించే సన్నాహక శిబిరానికి హాజరు కాలేనని సంజూ మాకు ఇ- మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడు.అయితే, సెలక్షన్ ప్రక్రియ ప్రకారం.. ఈ శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్ల పేర్లనే జట్టు ఎంపిక సమయంలో మేము పరిగణనలోకి తీసుకుంటాం’’ అని పేర్కొన్నాడు. అందుకే సంజూ శాంసన్‌ను తాము పక్కనపెట్టినట్లు వినోద్ ఎస్ కుమార్ స్పష్టం చేశాడు.ఇక తాజా సమాచారం ప్రకారం.. తాను దేశీ వన్డే టోర్నీకి అందుబాటులో ఉంటానని సంజూ శాంసన్ కేసీఏకు తెలిపాడు. కానీ.. సెలక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి వినోద్ ఎస్ కుమార్ తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడాడు.సంజూ వస్తానన్నాడు.. కానీ మా జట్టు నిండుగా ఉంది‘‘తాను జట్టుకు అందుబాటులో ఉంటానని సంజూ శాంసన్ రెండు రోజుల క్రితమే మాకు సమాచారం ఇచ్చాడు. అయితే, ఇప్పటి వరకు ఈ విషయమై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ టోర్నీ ఆడేందుకు కేరళకు చెందిన పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉంది’’ అని వినోద్ కుమార్ పేర్కొన్నాడు. తద్వారా సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకునే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.అదే జరిగితే.. సంజూకి కష్టమే!కాగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ(వన్డే)-2025 మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ టోర్నీకి ఎంపికయ్యే భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలంటే సంజూకు విజయ్ హజారే ట్రోఫీ రూపంలో అవకాశం వచ్చింది. అయితే, కారణాలేవైనా అతడు.. ఈ దేశీ వన్డే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండటం.. కేసీఏకు రుచించలేదు. దీంతో ఇప్పుడు స్వయంగా అందుబాటులోకి వచ్చినా.. అతడి పట్ల విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టోర్నీ మొత్తంలో ఆడే అవకాశం రాకపోతే సంజూకు చాంపియన్స్ ట్రోఫీ ఆడే మార్గం దాదాపుగా మూసుకుపోయినట్లే! ఇక విజయ్ హజారే ట్రోఫీలో కేరళకు శుభారంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో బరోడా చేతిలో చిత్తుగా ఓడిన కేరళ.. రెండో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడింది. అయితే, వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. ప్రొటిస్ గడ్డపై శతకాల మోతకాగా సంజూ శాంసన్ చివరగా టీమిండియా తరఫున సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. నవంబరులో ముగిసిన ఈ సిరీస్‌లో సంజూ రెండు శతకాలు బాది.. టీమిండియా ప్రొటిస్ జట్టుపై నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. కేరళ తరఫున ఇప్పటి వరకు 119 లిస్ట్-‘ఎ’(వన్డే ఫార్మాట్)మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్.. 3487 పరుగులు సాధించాడు.చదవండి: నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం -
కేరళ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా సంజూ శాంసన్
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తొలి రెండు మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కేరళ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. మొదటి రెండు మ్యాచ్‌లకు కేరళ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. డైనమిక్ ఓపెనర్ రోహన్ కునుమ్మల్ సంజూకు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సిజోమన్ జోసెఫ్‌కు సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. అదే విధంగా యువ వికెట్ కీపర్ విష్ణు రాజ్‌కు తొలిసారి కేరళ రంజీ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టులో శ్రేయాస్ గోపాల్, జలజ్ సక్సేనా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వచ్చే రంజీ సీజన్లో కేరళ తమ తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 5 నుంచి అలప్పుజా వేదికగా ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సంజూ తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. 114 బంతుల్లో 6 ఫోర్ల, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను శాంసన్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. రంజీ ట్రోఫీకి కేరళ జట్టు: సంజు శాంసన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), కృష్ణ ప్రసాద్, ఆనంద్ కృష్ణన్, రోహన్ ప్రేమ్, సచిన్ బేబీ, విష్ణు వినోద్, అక్షయ్ చంద్రన్, శ్రేయాస్ గోపాల్, జలజ్ సక్సేనా, వైశాక్ చంద్రన్, బాసిల్ థంపి, విశ్వేశ్వర్ ఎ సురేష్, ఎం డి నిధీష్, బాసిల్, విష్ణు రాజ్ -
భారత క్రికెట్లో విషాదం.. మాజీ కెప్టెన్ మృతి!
కేరళ మాజీ కెప్టెన్, కెసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు కె జయరామన్(67) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన శనివారం రాత్రి తిరువనంతపురంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1980లలో కేరళ రంజీ జట్టు తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో జయరామన్ ఒకరు. 1986-87 రంజీల సీజన్లో ఆయన వరుసగా నాలుగు సెంచరీలు సాధించి, భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యే స్థాయికి చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ అతడికి భారత జట్టులో చోటుదక్కలేదు. జయరామన్ కేరళ సీనియర్, జూనియర్ జట్లకు కెప్టెన్‌గా కూడా పనిచేశారు. తన కెరీర్లో 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జయరామ్ 5 సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 2,358 పరుగులు చేశారు. దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ తరఫున కూడా ఆడారు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలా కాలం పాటు కేరళ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశారు. అదే విధంగా అండర్-22, అండర్-25 జట్లకు చీఫ్ సెలెక్టర్‌గా కూడా పనిచేశారు. 2010లో బీసీసీఐ మ్యాచ్ రిఫరీగా కూడా జయరామన్ పనిచేశారు. ఇక జయరామ్ మృతిపట్ల బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: WTC Cycle 2023-25: వెస్టిండీస్‌పై ఘన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన టీమిండియా -
రిటైర్మెంట్ అనంతరం శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
Sreesanth Retirement: క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్టు రెండ్రోజుల (మార్చి 9న) కిందట ప్రకటించిన టీమిండియా వివాదాస్పద బౌలర్ శాంతకుమరన్ శ్రీశాంత్.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. రిటైర్మెంట్ గురించి తన రంజీ జట్టు కేరళకు ముందే సమాచారమందించినా పట్టించుకోలేదని, ఆరేళ్లపాటు టీమిండియాకు ఆడిన ఆటగాడికి కనీస మర్యాదగా వీడ్కోలు ఉంటుందని ఆశించానని, అయితే కొన్ని శక్తుల వల్ల తాను అందుకు కూడా నోచుకోలేకపోయానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ గురించి కేరళ జట్టు యాజమాన్యానికి ముందే సమాచారమిచ్చినా, గుజరాత్‌తో మ్యాచ్‌లో నన్ను ఆడించలేదని వాపోయాడు. ఈ మేరకు ఓ స్థానిక టీవీ ఛానెల్లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. కాగా, ప్రస్తుత రంజీ సీజన్లో భాగంగా మార్చి 9న కేరళ-గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆడి, ఆటకు వీడ్కోలు పలకాలని శ్రీశాంత్ భావించాడు. అయితే శ్రీ ప్రకటనను ఏమాత్రం పట్టించుకోని కేరళ జట్టు యాజమాన్యం అతన్ని బెంచ్‌కే పరిమితం చేసింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇటీవలే బంతిని అందుకున్న శ్రీశాంత్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఓ మ్యాచ్ ఆడాడు. మేఘాలయాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన శ్రీశాంత్.. భారత్ తరఫున 27 టెస్ట్‌ల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. చదవండి: బీసీసీఐ ద్వంద్వ వైఖరి.. కోహ్లి విషయంలో అలా, రోహిత్ కోసం ఇలా..! -
కేరళలో స్టేడియానికి సచిన్ పేరు
త్రివేండ్రం : తమ రాష్ట్రంలోని ఓ క్రికెట్ స్టేడియానికి భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును పెట్టాలని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) నిర్ణయించింది. కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ఓ పెవిలియన్‌కు ఇప్పటికే సచిన్ పేరు ఉండగా.. కొత్తగా స్టేడియానికి మాస్టర్ పేరును పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కేసీఏ అధ్యక్షుడు టీసీ మాథ్యూ తెలిపారు. ‘ఏ స్టేడియానికి సచిన్ పేరును పెట్టాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే వాయనాడ్‌లో మైదానం పూర్తయ్యింది. ఇంకా కొన్ని ముగింపు దశలో ఉన్నాయి. త్వరలోనే ఏ విషయమూ తేల్చేస్తాం. సచిన్‌ను కూడా సంప్రదించాం. మరోవైపు త్వరలో అందుబాటులోకి రాబోయే ప్రతీ క్రికెట్ స్టేడియంను అన్ని క్రీడలకు అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్నాం’ అని మాథ్యూ తెలిపారు. ఈ ఏడాది కేరళలో జరిగిన జాతీయ క్రీడలకు సచిన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అలాగే ఐఎస్ఎల్లో కేరళ బ్లాస్టర్‌కు సహ యజమానిగా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఓ సొంతిల్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.