రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కేరళ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. మొదటి రెండు మ్యాచ్‌లకు కేరళ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. డైనమిక్ ఓపెనర్ రోహన్ కునుమ్మల్ సంజూకు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సిజోమన్ జోసెఫ్‌కు సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు.
అదే విధంగా యువ వికెట్ కీపర్ విష్ణు రాజ్‌కు తొలిసారి కేరళ రంజీ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టులో శ్రేయాస్ గోపాల్, జలజ్ సక్సేనా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వచ్చే రంజీ సీజన్‌లో కేరళ తమ తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 5 నుంచి అలప్పుజా వేదికగా ప్రారంభం కానుంది.
ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సంజూ తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. 114 బంతుల్లో 6 ఫోర్ల, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను శాంసన్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
రంజీ ట్రోఫీకి కేరళ జట్టు: సంజు శాంసన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), కృష్ణ ప్రసాద్, ఆనంద్ కృష్ణన్, రోహన్ ప్రేమ్, సచిన్ బేబీ, విష్ణు వినోద్, అక్షయ్ చంద్రన్, శ్రేయాస్ గోపాల్, జలజ్ సక్సేనా, వైశాక్ చంద్రన్, బాసిల్ థంపి, విశ్వేశ్వర్ ఎ సురేష్, ఎం డి నిధీష్, బాసిల్, విష్ణు రాజ్
Comments
Please login to add a commentAdd a comment