ఐపీఎల్ 2025 (IPL) సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌కు (Rajasthan Royals) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ (Sanju Samson) శాంసన్ గాయపడినట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా సంజూ చూపుడు వేలికి గాయమైనట్లు తెలుస్తుంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జోఫ్రా ఆర్చర్ సంధించిన బంతి సంజూ చూపుడు వేలుపై బలంగా తాకింది. ఈ సందర్భంగా సంజూ చాలా అసౌకర్యంగా కనిపించాడు.
ఆతర్వాత సంజూ బ్యాటింగ్‌ను కొనసాగించినప్పటికీ.. కొద్ది సేపటికే ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సంజూ బరిలోకి దిగలేదు. అతని స్థానంలో ద్రువ్ జురెల్ వికెట్‌కీపింగ్ చేశాడు. పలు నివేదికల ప్రకారం.. సంజూ రానున్న ఆరు వారాలు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది.
దీంతో సంజూ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా సంజూ రంజీ బరిలో ఉండడని సమాచారం. రంజీలో సంజూ ప్రాతినిథ్యం వహించే కేరళ, క్వార్టర్ ఫైనల్లో జమ్మూ అండ్ కశ్మీర్‌తో తలపడాల్సి ఉంది.
డగౌట్‌లో సంజూ
ఇంగ్లండ్‌తో చివరి టీ20లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన సంజూ.. ఆతర్వాత స్కానింగ్‌కు వెళ్లలేదు. డగౌట్‌లో ఎక్స్‌ట్రా ప్లేయర్ జెర్సీ వేసుకుని కనిపించాడు. దీన్ని చూసి అభిమానులు సంజూకు ఏమీ కాలేదని ఊపిరి పీల్చుకున్నారు. అయితే మ్యాచ్ అనంతరం సంజూ చూపుడు వేలుకు బాగా వాపు వచ్చినట్లు తెలుస్తుంది. అప్పుడు స్కానింగ్‌కు వెళ్లగా డాక్టర్లు ఫ్రాక్చర్‌ను గుర్తించినట్లు సమాచారం.
ఘోర వైఫల్యం
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో అతను కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో సంజూ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రతి మ్యాచ్‌లో ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో సంజూ వీక్‌నెస్‌ను గుర్తించిన ఇంగ్లండ్ పేసర్లు పదేపదే ఒకే తరహా బంతులు వేసి అతన్ని ఔట్ చేశారు.
4-1 సిరీస్ కైవసం చేసుకున్న భారత్
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సంజూ విఫలమైనప్పటికీ భారత్ 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో సంజూ సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి టీ20లో విధ్వంసకర శతకం బాదిన అభిషేక్.. ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 219.69 స్ట్రయిక్‌రేట్‌తో 276 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
మార్చి 21 నుంచి ప్రారంభం
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో రాజస్థాన్ ఆరంభ ఎడిషన్‌లో మాత్రమే టైటిల్ సాధించింది. గత సీజన్‌లో సంజూ శాంసన్ నేతృత్వంలోని ఈ జట్టు రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment