
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో వ్యాపారవేత్త రామచంద్రగా తండ్రి పాత్ర పోషించారు మలయాళ నటుడు జయరామ్. తాజాగా మరోసారి ఆయన తండ్రి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారిపాట’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయరామ్ నటిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్ర చేస్తున్నారనేది బయటకు రాలేదు.
తాజా సమాచారం ప్రకారం మహేశ్‌బాబు తండ్రి పాత్రను జయరామ్ చేస్తున్నారట. జయరామ్ బ్యాంక్ మేనేజర్ అని టాక్. ఈ సినిమా బ్యాంకు మోసాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో మహేశ్ సరసన కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక జయరామ్ విషయానికొస్తే.. అనుష్క టైటిల్ రోల్ చేసిన ‘భాగమతి’ చిత్రంలో ఆయన నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి కాకుండా మలయాళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment