హో చీ మిన్ (వియత్నాం): భారత షట్లర్లు అజయ్ జయరామ్, రితూపర్ణ దాస్ వియత్నాం ఓపెన్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో జయరామ్ 21–17, 21–16తో పిలియాంగ్ ఫిఖీలా (ఇండోనేసియా)పై... మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ 21–13, 21–14తో షియోరి సైటో (జపాన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మరో భారత ఆటగాడు కార్తీక్ జిందాల్ 9–21, 21–16, 21–16తో జూలియన్ పాల్ (మారిషస్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరాడు. ఇతర మ్యాచ్‌ల్లో సిరిల్ వర్మ తొలి రౌండ్‌లో 21–17, 21–16తో శ్రేయాన్‡్ష జైస్వాల్ (భారత్)పై గెలిచి... రెండో రౌండ్‌లో 20–22, 21–17, 17–21తో టాప్ సీడ్ యగోర్ కొలెహో (బ్రెజిల్) చేతిలో ఓడాడు.
శివాని ఓటమి: తెలంగాణ యువ క్రీడాకారిణి రుత్విక శివాని మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 19–21, 17–21తో యిన్ ఫన్ లిమ్ (మలేసియా) చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్‌ల్లో రసిక రాజే, ముగ్ధ, వైదేహి కూడా పరాజయం పాలయ్యారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో ధ్రువ్ కపిల–జక్కంపూడి మేఘన జంట 17–21, 21–18, 21–23తో జియాంగ్ జెన్‌బాంగ్–చెన్ యింగెక్సూ(చైనా) జోడీ చేతిలో, శివమ్ శర్మ– పూర్విషా ద్వయం 15–21, 16–21తో తడయూకీ ఉరాయి– మియౌర (జపాన్) జంట చేతిలో ఓడింది.
ప్రిక్వార్టర్స్‌లో జయరామ్, రితూపర్ణ
Published Thu, Aug 9 2018 1:31 AM | Last Updated on Thu, Aug 9 2018 1:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment