rituparna
-
ప్రిక్వార్టర్స్‌లో జయరామ్, రితూపర్ణ
హో చీ మిన్ (వియత్నాం): భారత షట్లర్లు అజయ్ జయరామ్, రితూపర్ణ దాస్ వియత్నాం ఓపెన్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జయరామ్ 21–17, 21–16తో పిలియాంగ్ ఫిఖీలా (ఇండోనేసియా)పై... మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ 21–13, 21–14తో షియోరి సైటో (జపాన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మరో భారత ఆటగాడు కార్తీక్ జిందాల్ 9–21, 21–16, 21–16తో జూలియన్ పాల్ (మారిషస్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరాడు. ఇతర మ్యాచ్‌ల్లో సిరిల్ వర్మ తొలి రౌండ్లో 21–17, 21–16తో శ్రేయాన్‡్ష జైస్వాల్ (భారత్)పై గెలిచి... రెండో రౌండ్లో 20–22, 21–17, 17–21తో టాప్ సీడ్ యగోర్ కొలెహో (బ్రెజిల్) చేతిలో ఓడాడు. శివాని ఓటమి: తెలంగాణ యువ క్రీడాకారిణి రుత్విక శివాని మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 19–21, 17–21తో యిన్ ఫన్ లిమ్ (మలేసియా) చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్‌ల్లో రసిక రాజే, ముగ్ధ, వైదేహి కూడా పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో ధ్రువ్ కపిల–జక్కంపూడి మేఘన జంట 17–21, 21–18, 21–23తో జియాంగ్ జెన్‌బాంగ్–చెన్ యింగెక్సూ(చైనా) జోడీ చేతిలో, శివమ్ శర్మ– పూర్విషా ద్వయం 15–21, 16–21తో తడయూకీ ఉరాయి– మియౌర (జపాన్) జంట చేతిలో ఓడింది. -
పోలిష్ ఓపెన్ చాంప్ రితూపర్ణ
బీరన్ (పోలాండ్): పోలీష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ దాస్ విజేతగా నిలువగా... మహిళల డబుల్స్‌లో సంజన సంతోష్-ఆరతి సారా సునీల్ జంట టైటిల్ దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రితూపర్ణ దాస్ 11-21, 21-7, 21-17తో భారత్‌కే చెందిన రసిక రాజెను ఓడించింది. డబుల్స్ ఫైనల్లో సంజన-ఆరతి సారా ద్వయం 19-21, 21-19, 21-14తో టాప్ సీడ్ నటాల్యా వొట్సెక్-ఝెలిజవెటా జర్కా (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ 27-29, 13-21తో విక్టర్ స్వెండ్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
సెమీస్‌లో కృష్ణప్రియ, రితుపర్ణదాస్
ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండర్-19 బాలికల సింగిల్స్‌లో కృష్ణ ప్రియ, రితుపర్ణదాస్(హైదరాబాద్)లు సెమీస్‌లోకి అడుగు పెట్టారు. అండర్-19 బాలుర సింగిల్స్‌లో ఎం.కిరణ్ కుమార్, ఆర్.అనీత్ కుమార్(రంగారెడ్డి) సెమీఫైనల్లోకి చేరారు. అలాగే డి.బి.ఎస్.చంద్రకుమార్ (తూర్పు గోదావరి), ఎస్.బాలు మహేంద్ర (విశాఖపట్నం) సెమీస్‌కు చేరారు. తణుకులో జరుగుతున్న ఈపోటీల్లో మూడో రోజు మంగళవారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రితుపర్ణదాస్ 21-9, 21-14స్కోరుతో సంతోషి (విశాఖ)పై ఘన విజయం సాధించింది. మరో క్వార్టర్ ఫైనల్లో కృష్ణ ప్రియ 21-17, 21-14తో పి.సోనిక సాయి(కర్నూలు)పై, జి.వృశాలి(రంగారెడ్డి) 21-23, 21-16, 24-22తో డి.పూజ(చిత్తూరు)పై, జి.రుత్విక శివాని (ఖమ్మం) 21-15, 21-6తో సి.హెచ్.ఉత్తేజిత రావు (విశాఖపట్నం)పై నెగ్గారు. బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎం.కిరణ్ కుమార్ 20-22, 21-18, 21-18 స్కోరుతో మూడో సీడ్ ఎం.కనిష్క్(గుంటూరు)పై సంచలన విజయం సాధించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్లో ఆర్.అనీత్ కుమార్ 21-6, 21-13తో కె.జగదీష్ కుమార్(విశాఖ)పై, చంద్ర కుమార్ 19-21, 21-14, 23-21తో డి.ఆర్.రఘునాథ్ (గుంటూరు)పై, బాలుమహేంద్ర 21-19, 21-15తో సి.ఉపేందర్(కర్నూలు)పై గెలిచారు.