పోలిష్ ఓపెన్ చాంప్ రితూపర్ణ | Indian shuttler Rituparna Das wins Polish Open | Sakshi
Sakshi News home page

పోలిష్ ఓపెన్ చాంప్ రితూపర్ణ

Published Mon, Sep 26 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

పోలిష్ ఓపెన్ చాంప్ రితూపర్ణ

పోలిష్ ఓపెన్ చాంప్ రితూపర్ణ

 బీరన్ (పోలాండ్): పోలీష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ దాస్ విజేతగా నిలువగా... మహిళల డబుల్స్‌లో సంజన సంతోష్-ఆరతి సారా సునీల్ జంట టైటిల్ దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రితూపర్ణ దాస్ 11-21, 21-7, 21-17తో భారత్‌కే చెందిన రసిక రాజెను ఓడించింది. డబుల్స్ ఫైనల్లో సంజన-ఆరతి సారా ద్వయం 19-21, 21-19, 21-14తో టాప్ సీడ్ నటాల్యా వొట్సెక్-ఝెలిజవెటా జర్కా (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ 27-29, 13-21తో విక్టర్ స్వెండ్‌సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement