Polish Open
-
సింగిల్స్ రన్నరప్ వృశాలి
సాక్షి, హైదరాబాద్: పోలిష్ ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి గుమ్మడి వృశాలి రన్నరప్‌గా నిలిచింది. పోలాండ్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి 11–21, 14–21తో భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్స్‌లో వృశాలి 23–21, 21–9తో ప్రిస్కిలా(జర్మనీ)పై, రితూపర్ణ 21–19, 21–11తో జోర్డాన్ హార్ట్ (వేల్స్)పై గెలుపొందారు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ హర్షీల్ డాని విజేతగా నిలిచాడు. ఫైనల్లో హర్షీల్ 21–19, 21–13తో నాలుగో సీడ్ లూ చియా హంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. -
పోలిష్ ఓపెన్ చాంప్ రితూపర్ణ
బీరన్ (పోలాండ్): పోలీష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ దాస్ విజేతగా నిలువగా... మహిళల డబుల్స్‌లో సంజన సంతోష్-ఆరతి సారా సునీల్ జంట టైటిల్ దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రితూపర్ణ దాస్ 11-21, 21-7, 21-17తో భారత్‌కే చెందిన రసిక రాజెను ఓడించింది. డబుల్స్ ఫైనల్లో సంజన-ఆరతి సారా ద్వయం 19-21, 21-19, 21-14తో టాప్ సీడ్ నటాల్యా వొట్సెక్-ఝెలిజవెటా జర్కా (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ 27-29, 13-21తో విక్టర్ స్వెండ్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
సిక్కిరెడ్డి జోడీకి ‘పోలిష్’టైటిల్
అర్లామౌ (పోలండ్): పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ అమ్మాయి సిక్కిరెడ్డి జోడి గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సిక్కిరెడ్డి, ప్రద్య్నా గాద్రె (భారత్) జంట 21-16, 21-18 తేడాతో అలెక్స్ బ్రూస్, ఫిల్లిస్ చాన్ (కెనడా)ను ఓడించింది. ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించిన భారత జోడి ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. -
సెమీస్‌లో సిక్కి రెడ్డి జంట
అర్లామౌ (పోలండ్): పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సిక్కి రెడ్డి తన భాగస్వామి ప్రద్న్యా గాద్రె (భారత్)తో కలిసి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె ద్వయం 21-19, 11-21, 21-14తో సెయి పె చెన్-వూ తి జంగ్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది.