సెమీస్‌లో కృష్ణప్రియ, రితుపర్ణదాస్ | state junnior badminton tournment krishnapriya,rituparna das reached in semifinals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో కృష్ణప్రియ, రితుపర్ణదాస్

Published Wed, Sep 25 2013 12:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM

state junnior badminton tournment krishnapriya,rituparna das reached in semifinals

ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండర్-19 బాలికల సింగిల్స్‌లో కృష్ణ ప్రియ, రితుపర్ణదాస్(హైదరాబాద్)లు సెమీస్‌లోకి అడుగు పెట్టారు. అండర్-19 బాలుర సింగిల్స్‌లో ఎం.కిరణ్ కుమార్, ఆర్.అనీత్ కుమార్(రంగారెడ్డి) సెమీఫైనల్లోకి చేరారు.
 
 అలాగే డి.బి.ఎస్.చంద్రకుమార్ (తూర్పు గోదావరి), ఎస్.బాలు మహేంద్ర (విశాఖపట్నం)  సెమీస్‌కు చేరారు. తణుకులో జరుగుతున్న ఈపోటీల్లో మూడో రోజు మంగళవారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రితుపర్ణదాస్ 21-9, 21-14స్కోరుతో సంతోషి (విశాఖ)పై ఘన విజయం సాధించింది. మరో క్వార్టర్ ఫైనల్లో కృష్ణ ప్రియ 21-17, 21-14తో పి.సోనిక సాయి(కర్నూలు)పై, జి.వృశాలి(రంగారెడ్డి) 21-23, 21-16, 24-22తో డి.పూజ(చిత్తూరు)పై, జి.రుత్విక శివాని (ఖమ్మం) 21-15, 21-6తో సి.హెచ్.ఉత్తేజిత రావు (విశాఖపట్నం)పై నెగ్గారు.

 

బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎం.కిరణ్ కుమార్ 20-22, 21-18, 21-18 స్కోరుతో మూడో సీడ్ ఎం.కనిష్క్(గుంటూరు)పై సంచలన విజయం సాధించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్లో ఆర్.అనీత్ కుమార్ 21-6, 21-13తో కె.జగదీష్ కుమార్(విశాఖ)పై, చంద్ర కుమార్ 19-21, 21-14, 23-21తో డి.ఆర్.రఘునాథ్ (గుంటూరు)పై, బాలుమహేంద్ర 21-19, 21-15తో సి.ఉపేందర్(కర్నూలు)పై గెలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement