ఆత్మగా మారి... | 'Mantrikan' Releasing In The First Week Of December | Sakshi
Sakshi News home page

ఆత్మగా మారి...

Published Sat, Nov 30 2013 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

ఆత్మగా మారి...

ఆత్మగా మారి...

 అతి కిరాతకంగా హత్యకు గురయ్యే ఓ యువతి ఆత్మగా మారి, తనను చంపినవారిపై ఎలా పగ తీర్చుకుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మాంత్రికన్’. పూనమ్ బజ్వా, జయరామ్, దివ్య ముఖ్య తారలు. తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని అదే పేరుతో శ్రీమతి లక్ష్మీ సమర్పణలో బి. సత్యం తెలుగులోకి విడుదల చేస్తున్నారు. వచ్చే నెల మొదటివారంలో రిలీజ్ కానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘ఓ జమిందారీ కుటుంబంలోని నలుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడు పేదింటి పిల్లను ప్రేమిస్తాడు. 
 
 అది సహించని అతని అన్నలు ఆ అమ్మాయిని కాల్చి చంపేస్తారు. అదే మంటల్లో ఆ యువకుడు దూకి, చనిపోతాడు. ఆ అమ్మాయి ఆత్మగా మారి, ఓ అన్నను చంపేస్తుంది. ఇది తెలుసుకున్న మిగతా ఇద్దరు సోదరులు ఓ మాంత్రికుని సహాయం తీసుకుంటారు. అనంతరం ఏం జరిగింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యస్. బాలకృష్ణన్ స్వరపరచిన పాటలు వీనుల విందుగా ఉంటాయి. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, చిత్రనిర్వహణ: అడ్డాల వెంకటరావు, రమణ, దర్శకత్వం: అనిల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement