
డచ్ ఓపెన్ ఫైనల్లో జయరామ్
అల్మీరె (నెదర్లాండ్స్): తన విజయపరంపర కొనసాగిస్తూ భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అజయ్ జయరామ్ డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 66వ ర్యాంకర్ జయరామ్ 11-8, 11-7, 11-5తో టాప్ సీడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌ప్రి స్థాయి టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.