గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలైన సంఘటన మండలంలోని శెట్టిపల్లి గుండవాగు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వెల్దుర్తి ఎస్సై పెంటయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చిన్నశంకరంపేట మండలం జంగరాయి శివారులోని నాగులమ్మ గిరిజన తాండాకు చెందిన దర్మ, జయరాం, చందర్‌లు మెదక్ మండలం బొల్లారంలో ఓ శుభకార్యానికి వెల్లి బైక్‌పై తిరిగి వస్తుండగా శెట్టిపల్లి గుండవాగు దగ్గర గుర్తు తెలియని వాహ నం ఢీ కొట్టిందన్నారు. దీంతో జయరాంకు(55) తీవ్ర గాయాలు కాగా గాంధీ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. దర్మ, చందర్‌లకు గాయాలయ్యాయన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.