
ప్రముఖ నటుడు జయరామ్ కొడుకు కాళిదాస్ పెళ్లి చేసుకున్నాడు.

కేరళలోని గురవాయుర్ ఆలయంలో మోడల్ తరిణితో ఇతడి వివాహం జరిగింది.

గత కొన్నాళ్లుగా కాళిదాస్-తరిణి ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు ఒక్కటయ్యారు.

'అల వైకుంఠపురములో', 'గుంటూరు కారం' తదితర సినిమాలతో జయరామ్ కాస్త పరిచయమే.

జయరామ్ కొడుకు కాళిదాస్ కూడా నటుడే. తమిళంలో హీరోగా కాస్త ఫేమస్.

రీసెంట్‌గా ధనుష్ 'రాయన్' మూవీలో కీలక పాత్ర చేశాడు. అంతకుముందు 'విక్రమ్'లోనూ నటించాడు.












