జయ ప్రస్థానమిదీ...
► 1948 :ఫిబ్రవరి 24: అప్పటి మైసూరు రాష్ట్రంలోనే మేల్కొటేలో జయలలిత జననం.
► 1950: తండ్రి జయరామ్ మరణం. మాతామహుల ఇంటికి బెంగళూరు చేరిన తల్లి వేదవల్లి.
► 1950-58: తల్లి చెన్నై వెళ్లిపోవడంతో మాతామహుల ఇంటివద్దే పెరిగిన జయలలిత.
► 1958: తిరిగి చెన్నైలోని తల్లి వద్దకు చేరిక
► 1961: కన్నడ సినిమా ‘శ్రీశైల మహాత్మే’తో బాలనటిగా వెండితెరపై అరంగేట్రం
► 1964: హీరోయిన్‌గా నటించిన తొలి కన్నడ సినిమా ‘చిన్నాడ గోంబే’ బ్లాక్‌బస్టర్.
► 1965: తెలుగు, తమిళ భాషల్లో కథనాయికగా అరంగేట్రం
► 1974: నటిగా 100 సినిమాలు పూర్తి.
► 1980: సినిమాలకు స్వస్తి. కథానాయికగా ఆఖరి సినిమా విడుదల.
► 1982: అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్ ఆహ్వానం మేరకు పార్టీ సభ్యురాలిగా రాజకీయ రంగ ప్రవేశం.
► 1983: అన్నా డీఎంకే పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ.
► 1984: రాజ్యసభ సభ్యత్వం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం, పార్టీ విజయం.
► 1987: ఎంజీఆర్ మరణంతో పార్టీలో చీలిక. జయలలిత మద్దతుదారులపై అనర్హత వేటు. రాష్ట్రపతి పాలన.
► 1987: అన్నాడీఎంకే రెండు వర్గాల పునరైక్యం. తొలి మహిళా ప్రతిపక్ష నేతగా ఎంపిక.
► 1989: శాసనసభలో దుశ్శాసన పర్వం. డీఎంకే సభ్యుడు దురై మురుగన్ జయలలిత చీర లాగారన్న ఆరోపణలు. ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని జయ శపథం.
► 1991: అన్నాడీఎంకే ఘన విజయం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం.
► 1995: గిన్నిస్ రికార్డు స్థాయిలో దత్తపుత్రుడు సుధాకరన్ వివాహం. అవినీతి ఆరోపణలు.
► 1996: అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, పార్టీ ఘోర పరాజయం. అవినీతి ఆరోపణలపై అరెస్టు, 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.
► 2001: అన్నాడీఎంకే ఘనవిజయం. కేసుల కారణంగా ఎన్నికల్లో పోటీకి అనర్హత. అయినా రెండోసారి సీఎంగా ప్రమాణం. చెల్లదని సుప్రీం తీర్పు. పన్నీరుసెల్వానికి బాధ్యతల అప్పగింత.
► 2003: టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల కొట్టివేతను సమర్థించిన సుప్రీంకోర్డు. ముఖ్యమంత్రిగా జయలలిత పగ్గాలు. ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి.
► 2006: శాసనసభ ఎన్నికల్లో ఓటమి.
► 2011: శాసనసభ ఎన్నికల్లో గెలుపు, ముఖ్యమంత్రిగా పగ్గాలు.
► 2014: ఆస్తుల కేసులో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు. నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా. మళ్లీ జైలుకు జయలలిత. సీఎంగా పన్నీరుసెల్వం.
► 2015: జయలలితపై ఆరోపణలను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం. మళ్లీ ముఖ్యమంత్రిగా జయ పగ్గాలు.
► 2016 మే: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయదుందుభి. ఎంజీఆర్ అనంతరం వరుసగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు. ఐదు నెలలు గడవక ముందే అనారోగ్యం.
► 2016 డిసెంబర్ 5: మరణం