కరోనా మహమ్మారి తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నింపుతోంది. కోవిడ్ బారిన పడి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మృతి చెందారు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.
తెలుగు,మలయాళ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. టాలీవుడ్‌లో నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేశారు. అలాగే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచుకున్నారు. ‘పెళ్లి సందడి’, ‘మేజర్ చంద్రకాంత్’లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. .జయరామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
చదవండి:
కరోనాతో యు. విశ్వేశ్వరరావు కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment