k.balachander
-
'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు'
చెన్నై : విలక్షణ నటుడు, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఈ మధ్యన వివాదాల్లో నిలుస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ సీనియర్ హీరోయిన్ రేఖకు కమల్ క్షమాపణ చెప్పాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొనడం ఆసక్తిని రేకెత్తించింది. వివరాలు.. కె. బాల చందర్ దర్శకత్వంలో 1986లో 'పున్నగై మన్నన్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కమల్ హాసన్, రేఖల హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా సినిమాలో కమల్, రేఖల మధ్య ఒక ముద్దుసన్నివేశం ఉంటుంది. అయితే రేఖ16 ఏళ్ల వయసులో ఆమె అనుమతి లేకుండానే సినిమాలో ఈ సన్నివేశం చిత్రీకరించినట్లు తెలిసింది. (కమల్ హాసన్, దర్శకుడు శంకర్లకు పోలీసు నోటీసులు) ఇదే విషయమై సీనియర్ నటి రేఖ స్పందిస్తూ.. ' నేను ఈ విషయాన్ని ఇప్పటికే వంద సార్లు చెప్పాను. డైరెక్టర్ బాలచందర్ నాకు తెలియకుండానే సన్నివేశాన్ని చిత్రీకరించారు. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతుంటే నాకు సమాధానం చెప్పడానికి విసుగు అనిపిస్తుంది. కథలో బావోద్వేగం నింపడం కోసం ముద్దు సన్నివేశం పెట్టినట్లు ఆ షాట్ చిత్రీకరణ తర్వాత నాకు చెప్పారు. కాగా షూటింగ్ ముగిసిన తర్వాత అప్పటి అసోసియేట్ డైరెక్టర్లుగా ఉన్న సురేశ్ కృష్ణ, వసంత్‌ల దగ్గర ముద్దు విషయం తన అనుమతి లేకుండా ఎందుకు చిత్రీకరించారని అడిగాను. దానికి వారు ఒక చిన్న పిల్లను ముద్దు పెట్టుకుంటే తప్పేం కాదు.. అయినా ఈ సీన్‌కు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలుపుతుందని వారంటే.. సెన్సార్ అంటే ఏమిటని అడిగినట్లు నాకు గుర్తుంది. కాగా ఆ షాట్ ముగిసిన తర్వాత డైరెక్టర్ బాలచందర్, కమల్ హాసన్‌లు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. అయితే సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నాకు మంచి అవకాశాలు రావడంతో ఈ విషయాన్ని అందరూ మరిచిపోయారు' అంటూ వెల్లడించారు. (కోటి రూపాయలు ప్రకటించిన కమల్‌హాసన్) తాజాగా సోషల్ మీడియాలో మరోసారి ఈ విషయం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ' ఇప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ కె.బాలచందర్ మన మధ్య లేరు. కమల్ హాసన్‌తో పాటు సినిమా యూనిట్ మాత్రమే ఉన్నారు. అయినా వారికి క్షమాపణ చెప్పాలనిపిస్తే చెప్పొచ్చు.. లేదంటే లేదు. ఎందుకంటే ఇదంతా ఎప్పుడో జరిగిపోయిన విషయం. మళ్లీ ఇప్పుడు ఈ అంశం లేవనెత్తడం నాకు ఇష్టం లేదు' అని రేఖ చెప్పుకొచ్చారు. -
బాలచందర్ అంత్యక్రియలు పూర్తి
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు కే బాలచందర్ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం చెన్నైలో బిసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. తమిళ, తెలుగు, కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు తరలివచ్చి బాలచందర్‌కు తుదిసారి వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా బాలచందర్ ప్రియ శిష్యుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా చివరి చూపునకు నోచుకోలేకపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచందర్ మంగళవారం చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు బాలచందర్ మృతికి సంతాపం తెలియజేశారు. -
బాలచందర్ అంతిమయాత్ర ప్రారంభం
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు కే బాలచందర్ అంతిమయాత్ర బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ప్రారంభమైంది. బీసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు తరలివచ్చి బాలచందర్‌కు నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచందర్ మంగళవారం చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు బాలచందర్ మృతికి సంతాపం తెలియజేశారు. -
దర్శక దిగ్గజం సినీ ప్రస్థానం
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ మంగళవారం రాత్రి 7.05 నిమిషాలకు చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అభిమానుల సందర్శనార్థం బాలచందర్ బౌతికకాయాన్ని రేపు ఆయన నివాసంలో ఉంచుతారు. గురువారం బీసెంట్ నగర్‌లోని శశ్మానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని బాలచందర్ కుమారుడు ప్రసన్న వెల్లడించారు. 1930, జులై 9న తమిళనాడులోని తంజావూర్లో బాలచందర్ జన్మించారు. 1964లో రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్ర రంగంలో దాదాపు 101 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే పలు టీవీ సీరియళ్లకు రచన, దర్శకత్వం వహించారు. తెలుగులో భలే కోడళ్లు చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఆకలిరాజ్యం, అంతులేని కథ, రుద్రవీణ, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, భలే కోడళ్లు, సత్తెకాలపు సత్తయ్య, బొమ్మా బొరుసా, జీవితరంగం, తొలికోడి కూసింది, కోకిలమ్మ, చిలకమ్మ చెప్పింది తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. రజనీకాంత్, కమల్ హాసన్, ముమ్ముటీ, ప్రకాశ్ రాజ్‌లను చిత్ర రంగానికి పరిచయం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో హిందీలో తొలి సారిగా పాటలు పాడించిన ఘనత బాలచందర్కే దక్కుతుంది. అబద్ధం, రెట్టసుళి, ఉత్తమ విలన్ చిత్రాలలో బాలచందర్ నటించారు. పురస్కారాలు: 1973 లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు 1987లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో బాలచందర్‌ను సత్కరించింది. 2010లో దాదాసాహెబ్ పాల్కె అవార్డును అందుకున్నారు. 9 జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులు, పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 1982లో ఏక్ దూజే కేలియే చిత్రానికి కథ స్క్రీన్ ప్లే ఉత్తమ అవార్డు అందుకున్నారు. 2010లో ఏఎన్ఆర్ అవార్డులను అందుకున్నారు. -
ప్రముఖ దర్శకుడు బాలచందర్ కన్నుమూత
-
ప్రముఖ దర్శకుడు బాలచందర్ కన్నుమూత
చెన్నై : కె.బాలచందర్గా సుప్రసిద్ధుడైన దర్శక ప్రముఖుడు కైలాసం బాలచందర్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొద్ది రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఎక్కువ కావడంతో డయాలసిస్ చేశారు. చివరకు వెంటిలేటర్ మీద ఉంచి కూడా వైద్యం అందించారు. కానీ, వార్ధక్యం కారణంగా ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. బాలచందర్‌కు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే సినిమాలపై ఆసక్తి కలిగింది. ఆ క్రమంలో 12వ ఏటే థియేటర్ ఆర్టిస్ట్ సంఘంలో సభ్యులయ్యారు. ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయన తొలుత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. చెన్నై మహానగరంలోకి అకౌంట్ క్లర్క్‌గా అడుగుపెట్టారు. ఆ తరువాత యునెటెడ్ అమెరికన్ ఆర్టిస్టు నటన కంపెనీలో చేరారు. అనంతరం అతి త్వరలోనే తన కంటూ సొంతంగా డ్రామా గ్రూప్‌ను తయారు చేసుకుని మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని రూపొందించి దర్శకత్వం వహించారు. ఆ తరువాత అదే నాటకంతో వెండితెరపై దర్శకుడిగా అవతరించారు. రజనీకాంత్, కమలహాసన్, ప్రకాష్‌రాజ్, సరిత, వివేక్ వంటి ప్రముఖ నటీనటులను పరిచయం చేసిన ఘనత కె.బాలచందర్దే. ఈయన తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో 100 చిత్రాలకుపైగా చేసి భారతీయ సినీ కళామతల్లి గర్వించదగ్గ దర్శకుడిగా పేరొందారు. ఎంజీఆర్ హీరోగా చేసిన దైవతాయ్ చిత్రానికి సంభాషణల రచయితగా సినీరంగంలో ప్రవేశించారు. భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘అక్కినేని అంతర్జాతీయ పురస్కారం’ అందుకున్నారు. ఇది కథ కాదు, అంతులేని కథ, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, రుద్రవీణ.. ఇలాంటి అద్భుత చిత్రరాజాలన్నీ బాలచందర్ దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునకలు. మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి -
బాలచందర్ పరిస్థితి ఇంకా విషమమే
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ విషయాన్ని ఆయనకు చికిత్సలు అందిస్తున్న చెన్నైలోని కావేరి ఆస్పత్రి డైరెక్టర్ వెంకటాచలం తెలిపారు. బాలచందర్ మూత్రపిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని, అందుకు సంబంధించి డయాలసిస్ లాంటి చికిత్సలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం బాలచందర్ స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి డైరెక్టర్ వెంకటాచలం తెలిపారు. -
ఉత్తమవిలన్‌లో కమల్‌హాసన్, జయరాం
పంచతంత్రం సినిమాలో విజయవంతంగా కామెడీని పండించిన కమల్‌హాసన్, జయరాం ఇప్పుడు కొత్తగా రూపొందుతున్న ఉత్తమవిలన్ చిత్రంలోనూ కలిసి కనిపించబోతున్నారు. ఉళగనాయకన్ (అంతర్జాతీయ హీరో) కమల్‌హాసన్‌తో కలిసి ఉత్తమవిలన్ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు జయరాం తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశాడు. పంచతంత్రం సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించిన పలు సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. వయసు మీరిపోతున్న సూపర్‌స్టార్ పాత్రను ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ పోషిస్తున్నాడు. కమల్ స్వయంగా కథ అందించిన ఈ సినిమాకు కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. By mistake my previous tweets got deleted.. Posting again my snap from Kamal Haasan's @Uttama_Villain :) :) pic.twitter.com/ykbRROE66x — Jayaram (@UrsJayaramActor) March 12, 2014