
బాలచందర్ అంత్యక్రియలు పూర్తి
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు కే బాలచందర్ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం చెన్నైలో బిసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.
తమిళ, తెలుగు, కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు తరలివచ్చి బాలచందర్కు తుదిసారి వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా బాలచందర్ ప్రియ శిష్యుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా చివరి చూపునకు నోచుకోలేకపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచందర్ మంగళవారం చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు బాలచందర్ మృతికి సంతాపం తెలియజేశారు.