censor issues
-
సెన్సార్ సమస్యల్లో కాజల్ ‘క్వీన్’!
బాలీవుడ్లో ఘన విజయం సాధించిన క్వీన్ సినిమాను సౌత్ లో నాలుగు భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళ్లో కాజల్, కన్నడలో పరూల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ పూర్తయినా రిలీజ్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ ఆలస్యం చేస్తున్నారు. తాజాగా తమిళ వర్షనకు సంబంధించిన అప్డేట్ ఒకటి మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పారిస్ పారిస్ పేరుతో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా కావటంతో చాలా డైలాగ్స్‌ను తొలగించాల్సిందిగా సెన్సార్ సభ్యులు సూచించారు. అంతేకాదు సీన్స్‌ను బ్లర్ చేయాలని చెప్పటంతో చిత్రయూనిట్ రివైజ్ కమిటీని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి రివైజింగ్ కమిటీ తమిళ క్వీన్‌కు క్లియరెన్స్ ఇస్తుందేమో చూడాలి. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మను కుమరన్ నిర్మిస్తున్నారు. -
పద్మావతిపై మధ్యప్రదేశ్ సంచలన నిర్ణయం
సాక్షి,భోపాల్: వివాదాస్పద పద్మావతి మూవీపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మావతి చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.చరిత్రను వక్రీకరించిన పద్మావతి చిత్రంపై నిషేధం విధించాలని రాజ్పుట్ సంఘాలు వినతి పత్రం ఇచ్చిన మీదట సీఎం చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెన్సార్ సమస్యల నేపథ్యంలో డిసెంబర్ 1న విడుదల కావాల్సిన పద్మావతి మూవీని వాయిదా వేస్తున్నట్టు చిత్ర మేకర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సెన్సార్ సర్టిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలను ఇవ్వలేదని సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి పేర్కొన్నారు. మరోవైపు బోర్డు సర్టిఫికెట్ పొందకుండానే పలు మీడియా ఛానెళ్లకు చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ కోసం చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ చిత్రాన్ని సీబీఎఫ్సీ నిర్మాతకు తిప్పిపంపింది. -
మీ పని సెన్సార్ చేయడం కాదు: హైకోర్టు
ఉడ్తా పంజాబ్ సినిమా వివాదంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)పై బాంబే హైకోర్టు తీవ్రంగా మండిపడింది. బోర్డు పని సినిమాలను సర్టిఫై చేయడమే తప్ప సెన్సార్ చేయడం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ సినిమాలో డ్రగ్స్ గురించి మరీ ఎక్కువగా చూపించారనుకుంటే సినిమా మొత్తాన్ని ఎందుకు నిషేధించడం లేదని ప్రశ్నించింది. టీవీ గానీ, సినిమా గానీ.. ఏదైనా ఒక రాష్ట్రాన్ని అవమానించేలా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని, ఆ స్వేచ్ఛను ప్రజలకు ఇవ్వాలని బోర్డుకు సూచించింది. ఉడ్తా పంజాబ్ సినిమాకు 90కి పైగా కట్లు పెట్టడంతోపాటు సినిమా పేరు కూడా మార్చాలని సీబీఎఫ్సీ చెప్పడంతో చిత్ర దర్శక నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే సినిమాలో వాడిన కొన్ని పదాలు, సీన్లు చాలా అసభ్యంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని సీబీఎఫ్సీ వాదించింది. సినిమాలో ఒక కుక్క పేరు జాకీచాన్ అని పెట్టారని.. అది అభ్యంతరకరమని చెప్పింది. ఈ కేసులో వాదనలు ముగిశాయి. తుది తీర్పును ఈనెల 13వ తేదీన వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది. సీబీఎఫ్సీ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ కావలనే తన సినిమాను సర్టిఫై చేయడం లేదని నిర్మాత అనురాగ్ కశ్యప్ ఆరోపించారు. షాహిద్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, దిల్జీత్ దోసంజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో.. ప్రధానంగా పంజాబ్‌లో పెరుగుతున్న డ్రగ్ కల్చర్ గురించి చర్చించారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 17న విడుదల కావాల్సి ఉంది.