'క్వీన్' ఆత్మకథ | kangana ranauth Wants To Write Book On Her Struggles | Sakshi
Sakshi News home page

'క్వీన్' ఆత్మకథ

Published Sat, Jan 16 2016 10:42 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

'క్వీన్' ఆత్మకథ - Sakshi

'క్వీన్' ఆత్మకథ

వరుస బ్లాక్ బస్టర్స్తో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా సవాల్ చేసిన హాట్ బ్యూటీ కంగనా రనౌత్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా బాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ ఫ్యాషన్ గాళ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా నిరూపించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాతో కూడా 100 కోట్ల వసూళ్లు సాధ్యమే అని నిరూపించిన కంగనా మరో సంచలనానికి రెడీ అవుతోంది.

కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కంగనా, తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావటానికి ప్రయత్నిస్తుందట. బర్తాదత్ రాసిన 'ద అన్క్వయిట్ ఇండియా' బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్, ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు కెరీర్ స్టార్టింగ్లో తనను ఇబ్బంది పెట్టిన కొన్ని విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement