Barkha Dutt
-
సుప్రీమ్ కదిపిన తేనెతుట్టె
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతికే పని పెట్టుకోవద్దని స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయినా సంభల్ మసీదు, అజ్మీర్ దర్గాలను భౌతిక సర్వే చేయాలంటూ కేసులు నమోదయ్యాయి. అంటే, ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? ఇది కాగితాలకే పరిమితమైన చట్టమా? 1947 ఆగస్ట్ 15 నాటికి ఉన్నవి ఉన్నట్టుగా ప్రార్థనాలయాల స్వభావాన్ని కాపాడటం కోసం తెచ్చిన ఈ చట్టంలో, కేవలం అయోధ్యనే మినహాయించారు. అయినప్పటికీ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు పూర్తి మిశ్రమ సందేశం పంపింది. నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ వచ్చే కాపీ కేసులతో ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది.ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడాన్ని వ్యతిరేకించినవారు ఎవరో కాదు, సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్. అయినా మనం ఈ పరిస్థితికి చేరుకున్నాం.సంభల్‌లోని మసీదు సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతించిన తర్వాత పోలీసులకూ, నిరసనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు ఎలా మరణించారు అనే దానిపై ఉత్తరప్రదేశ్‌లోని జ్యుడీషియల్ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. రాజస్థాన్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయంగా ఉండేదని వాదిస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్ ను స్వీకరించిన తర్వాత స్థానిక కోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్గాను భౌతిక సర్వే చేయాలని పిటిషనర్ కోరారు. అయోధ్యకే మినహాయింపుఇది ఎక్కడ ముగుస్తుంది? ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు నిరర్థకంగా మారిందా? ఇది కేవలం కాగితాలకే పరిమితమైన చట్టమా? దిగువ కోర్టులకు ఇలా పరస్పర విరుద్ధమైన సందేశం పంపడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందా? అసలు నేటి రాజకీయ–మత చర్చకు కేంద్రంగా ఉన్న ఈ చట్టం ఏమిటి? 1991 సెప్టెంబరులో, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ‘1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలంలోనైనా యథాతథ మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం కోసం’ పార్లమెంటు చట్టం చేసింది.అయోధ్య కోసం మాత్రం చట్టంలోనే దీనికి మినహాయింపు ప్రత్యేకంగా ఇచ్చారు. ‘ఈ చట్టంలో ఉన్న ఏదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా సాధారణంగా పిలవబడే ప్రార్థనా స్థలానికి వర్తించదు. ఇక్కడ పేర్కొన్న స్థలం లేదా ప్రార్థనా స్థలానికి సంబంధించిన దావా, అప్పీల్ లేదా ఇతర విచారణ వర్తించబడదు’ అని అందులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య తీర్పును ప్రకటించినప్పుడు బెంచ్‌లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ’రాజ్యాంగ ప్రాథమిక విలువలను రక్షించడం, భద్ర పరచడం’ అని నొక్కిచెప్పడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని అమలు చేసినట్లు వీరు చెప్పారు. కీలకమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టాన్ని, అది రక్షించే విలువలను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఉంచింది. ఇది కేవలం విద్యా పరమైన లేదా రహస్య వివరాలకు చెందినది మాత్రమే కాదు. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే, కేశవానంద భారతి కేసు తీర్పులో, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారరాదు అని స్పష్టం చేసింది. ఏదైనా చట్టాన్ని రూపొందించడానికి/సవరించడానికి మాత్రమే పార్లమెంటుకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధ్యతాయుత చట్టంపార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అయోధ్య తీర్పు ఈ చట్టం గురించి ఇలా పేర్కొంది: ‘భారత రాజ్యాంగం ప్రకారం లౌకికవాదం పట్ల మన నిబద్ధతను అమలు చేసే దిశగా ప్రార్థనా స్థలాల చట్టం ఒక కించపరచని బాధ్యతను విధిస్తుంది.అందువల్ల చట్టం రూపొందించిన శాసన సాధనం రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రక్షించడానికే ఉంది. తిరోగమించకపోవడం అనేది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాల మౌలిక లక్షణం. దీనిలో లౌకికవాదం ప్రధాన అంశం. ఆ విధంగా ప్రార్థనా స్థలాల చట్టం అనేది మనలౌకిక విలువల నుంచి తిరోగమించకుండా కాపాడే శాసనపరమైన జోక్యం’.అయితే, అయోధ్య తీర్పు రచయితలలో ఒకరైన జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ 2023 ఆగస్ట్‌లో జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దపు నిర్మాణాన్ని ముందుగా ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని నిర్ధారించడానికి సర్వేను అనుమతించారు. సర్వేను అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై ఏదైనా స్టే విధించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే నన్న వాదనను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించారు. ‘మేము నిర్మా ణాన్ని పరిరక్షిస్తాం. మేము మీ ప్రయోజనాలను కాపాడుతాం’ అని పేర్కొన్నారు.వెనక్కి వెళ్లగలమా?ఇప్పుడు నేను జ్ఞానవాపిపై చారిత్రక, మతపరమైన చర్చకు చెందిన యోగ్యత లేదా లోపాల జోలికి వెళ్లడం లేదు. ఫైజాన్ ముస్తఫా వంటి పండితులు జ్ఞానవాపి కేసు ముస్లిం సమాజానికి అయోధ్య కంటే బలహీనమైన కేసు అని పేర్కొన్నారు. ఇదే మసీదు ఆవరణలో హిందూ భక్తులకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించాలని గతంలో ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరారు. ప్రతీ వివాదంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంలోని పరిమితులను ఆయన ఎత్తిచూపారు. అయితే ఇవన్నీ మత పెద్దలు, పౌర సమాజంలోని సభ్యుల నేతృత్వంలో జరగాల్సిన చర్చలు.నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ పేరుతో వచ్చే కాపీ కేసులతోనే ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది. అయితే, సంభల్ మసీదు కమిటీ వేసిన పిటిషన్ విషయంలో, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యా తీసుకోకుండా నిలుపుదల చేసింది. ఆ సర్వేను అను మతించిన స్థానిక కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పై కోర్టును సంప్ర దించాలని పిటిషనర్లకు సూచించింది. సర్వేకు సంబంధించిన కమి షనర్ నివేదికను గోప్యంగా ఉంచాలని కూడా ఆదేశించింది.ఏమైనా, తేనె తుట్టెను ఇప్పటికే సుప్రీంకోర్టు కదిపి ఉండొచ్చు. ఇప్పుడు, మళ్లీ యథాతథ స్థితిని నెలకొల్పడం అనుకున్నదానికంటే కష్టం కావచ్చు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఇది రాజకీయ ఎత్తుగడల వైఫల్యం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గుండ్రంగా వేసిన ఖాళీ తెల్లని కుర్చీల ముందు కూర్చుని, వైద్యులతో భేటీ కోసం ‘వేచి వేచి వేచి’ చూసిన చిత్రం చాలా ఆసక్తిని పుట్టించింది. ప్రత్యేకించి దాని తర్వాత ముఖ్యమంత్రి చేతులు జోడించి, నిరసన తెలుపుతున్న వైద్యు లతో చర్చించే విషయమై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడంలో జరిగిన వైఫల్యానికి క్షమాప ణలు చెప్పడం... నాటకీయంగా ఉద్వేగభరితంగా తాను ‘రాజీ నామాకు సిద్ధంగా ఉన్నాను’ అనే ఎత్తుగడను వేయడం మరీ విశేషం.వాస్తవానికి, ఆ క్షణమాత్రపు దృశ్యంలో ప్రదర్శితమైన ప్రహసనం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి చేసిన ఈ వ్యాఖ్యలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. విశేషం ఏమంటే, ఇదే ప్రత్యక్ష ప్రసారం విషయంలోనే ఆ చర్చలు ప్రారంభం కావడానికి ముందే విఫలమయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారంపైనా... దాని వెంబడే చోటు చేసుకున్న తప్పుడు చర్యలు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాల పైనా గత నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న వైద్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో తమ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని ముందస్తు షరతు పెట్టారు. సుప్రీంకోర్టు ఈ కేసును ప్రత్యక్ష ప్రసారం చేయగలిగినప్పుడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం దానిపై విభేదించడానికి ఎటువంటి కారణం లేదని వాదిస్తూ, వారు ఈ డిమాండ్‌పై ఇప్పటికీ మొండిగా ఉన్నారు. అదే సమయంలో చర్చలను రికార్డ్ చేసి, సుప్రీంకోర్టు అను మతితో తర్వాత విడుదల చేయాలనే ప్రతిపాదనను వైద్యులు అంగీకరించలేదు.మమతా బెనర్జీ ఈ పనిని నిరసనల ప్రారంభంలోనే ఎందుకు చేయలేదని ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ముడిచిన చేతులు, మధురమైన స్వరం, ప్రతిష్టంభనను ఛేదించలేక పోయినందుకు క్షమాపణ చెప్పడం, వైద్యుల కోసం రెండు గంటలకు పైగా వేచి ఉండటాన్ని నొక్కి చెప్పడం... బహుశా నేరం జరిగిన కొన్ని గంటలు లేక రోజులలో ఇదే విధానం పాటించి ఉంటే, ఇంత సంక్షోభం ఏర్పడేది కాదు. ఉద్య మాలలో పుట్టి, రూపుదిద్దుకున్న ఈ రాజకీయ నాయకురాలు ఇలా సహజ ప్రవృత్తి రాహిత్యాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కోల్‌కతా పోలీసు చీఫ్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించినప్పటికీ రాబోయే పండుగ సీజన్ కారణంగా తాను దానిని తిరస్కరించినట్లు ఆమె వెల్లడించడం మరింత అయోమయం కలిగించింది. ఆమె ప్రకటనపై స్పందిస్తూ ఒక యువ వైద్యుడు ఇలా అన్నాడు: ‘ప్రస్తుతం పండుగల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు?’ (ప్రభుత్వం అనంతరం కోల్‌కతా నగర కమిషనర్‌ను మార్చింది.) ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శించడంలో భార తీయ జనతా పార్టీ రాష్ట్రంలో అందరికంటే ముందు ఉండ వచ్చు; కానీ, మణిపుర్ విషయానికి వస్తే, అక్కడ బీజేపీ ఏ సహజ ప్రవృత్తినీ ప్రదర్శించకపోవడం గురించి ఇలాంటి ప్రశ్న లనే ఆ పార్టీ నాయకత్వంపై సంధించవలసి ఉంటుంది.మళ్ళీ, స్పష్టంగా చెప్పాలంటే, 2023 మే నుండి హింసా త్మక జాతి ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించిన మణి పుర్ రాష్ట్రానికీ, పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జి కర్ హాస్పిటల్ కేసుకూ మధ్య నేను వాచ్యార్థంగా కూడా ఎలాంటి పోలికలను చూపడం లేదు. చిన్న, పెద్ద సంక్షోభ సమయాల్లో రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారనే దానికే ఈ సారూప్యత పరి మితం. ఇంగితజ్ఞానం చాలా అవసరమైనప్పుడే అది వారికి లేకుండా పోయినట్లు కనిపిస్తుంది.మణిపుర్లో ఎన్. బీరేన్ సింగ్‌ను ముఖ్యమంత్రి స్థానం నుండి తొలగించడానికి బీజేపీ మొండిగా నిరాకరించడం ఏ రకంగానూ వివరించలేనిది. రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఆందో ళనకరంగా ఉందంటే, చాలామంది దీనిని అంతర్యుద్ధంతో పోల్చారు. అక్కడ మైతేయి, కుకీ సమాజాల మనుషులు ఒకరు ఆధిపత్యం వహించే భౌగోళిక ప్రాంతాలలోకి మరొకరు ప్రవేశించలేరు. జాతి సమూహాలను స్పష్టంగా వేరు చేసే ‘బఫర్ జోన్’ను ప్రమాదవశాత్తూ దాటిన కారణంగా సైన్యా నికి చెందిన ఒక మాజీ సైనికుడు వారం క్రితం హత్యకు గుర య్యాడు. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చని పోయిన 11 మందిలో మహిళలు కూడా ఉన్నారు. రెండు వర్గాల ప్రజలు, రైతులు, విద్యార్థుల చేతుల్లో వేల సంఖ్యలో ఆయుధాలు ఉన్నాయి.ప్రతి ఒక్కరికి దేశభక్తి పరీక్షలను నిర్వహించే కీ–బోర్డ్ జాతీయవాదులు, స్వల్పంగా అసమ్మతి వ్యక్తం చేసే ప్రజలను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి వెనుకాడరు. అలాంటిది ఒక మాజీ సైనికుడు అయిన హవల్దార్ లిమ్ఖోలాల్ మాతే భార్య ‘నా భర్త భారతదేశం కోసం పోరాడాడు, కానీ తనను ఒక జంతువులా చంపేశారు’ అని ఏడుస్తూ చెప్పిన ప్పుడు, జాతీయవాదానికి స్వీయ నియమిత మధ్యవర్తులందరూ ఎక్కడ ఉన్నారు? మణిపుర్లో రాజకీయ పార్టీలు పతనమయ్యాయి. ఈ గొడవలో ముఖ్యమంత్రి పాత్రపై విచారణ జరిపించాలని కోరిన పది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు బీజేపీకి చెందిన వారే. హింస బయటినుంచి ఉన్నప్పుడు, ఉదాహరణకు తిరుగుబాట్లు లేదా యుద్ధ సమయంలో రాజకీయ నాయ కత్వం కొనసాగింపును నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది తనపై తాను యుద్ధంలో ఉన్న రాష్ట్రం. ఇది శాంతి భద్రతల వైఫల్యం. కానీ ఇది అన్నింటికంటే, రాజకీయాల వైఫల్యం. ముఖ్యమంత్రిని తొలగించడం అనేది స్పష్టంగా సరైన పని కావడమే కాకుండా, ఘర్షణ పడుతున్న పార్టీలను చర్చల బల్ల వద్దకు తీసుకురావడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. పశ్చిమ బెంగాల్ నుండి మణిపుర్ వరకు, తప్పక చేయ వలసిన చర్యే చాలాసార్లు సరైనది అవుతుంది. కానీ అలా చేయకపోగా దాన్ని ప్రతిఘటించడమే ఇక బాగు చేయలేని పరిస్థితికి నెట్టినట్టు అవుతోంది.బర్ఖా దత్‌వ్యాసకర్త ప్రముఖ జర్నలిస్టు, రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఇది భారతీయ మహిళల గురించి...
ఒక రిపోర్టర్‌గా, నేను దశాబ్దాలుగా లెక్కలేనన్ని భయంకర ఘటనలను చూశాను. కానీ ఆ వీడియోలో ఉన్నది వేరే – ఇద్దరు మహిళల దుస్తుల్ని విప్పి, నగ్నంగా ఊరేగించారు. వారిలో ఒకరిని తర్వాత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. ఇది చూసిన ప్రతి భారతీయ మహిళ హృదయం బద్దలైపోయింది. ఈ భయంకరమైన కేసు గురించి తనకు (వీడియో బయటికి రాకముందు) తెలియదని మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అంటున్నారా? లేక తనకు తెలిసిందనీ, కానీ చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాననీ ఒప్పుకుంటున్నారా? ఎలాగైనా సరే, ఇది ఆయన అసమర్థతను లేదా నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుంది. బీరేన్ సింగ్ రాజీనామా చేయాలి లేదా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి! ‘‘ఆ వీడియోలో ఉన్న స్త్రీలకు జరిగింది అనుభవించడం కంటే నేను మరణాన్ని ఎంచు కుంటాను,’’ అని మణిపుర్ కుకీ సమాజానికి చెందిన హక్కుల కార్యకర్త గ్లాడీ హుంజన్ నాతో అన్నారు. కన్నీళ్లు ధారాపాతంగా కారు తున్నందున ఆమె పదాలను కూడా కూడగట్టుకోలేక పోయారు. నిరాశ, నిస్సహాయత, కోపం, వేదనతో ఆమె ఏడ్చినప్పుడు, నేను కూడా ఏడ్చాను. ఒక రిపోర్టర్‌గా, నేను దశాబ్దాలుగా లెక్కలేనన్ని భయంకర ఘటనలను చూశాను. కానీ ఆ వీడియోలో ఉన్నది వేరే – ఇద్దరు మహిళల దుస్తుల్ని విప్పి, నగ్నంగా ఊరేగించారు. ఒక మూక వాళ్లను తోసుకుంటూ, నెట్టుకుంటూ వచ్చింది. వారిలో ఒకరిని తర్వాత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. ఇది చూసిన ప్రతి భారతీయ మహిళ హృదయం బద్దలైపోయింది. గుమికూడినవాళ్లు చూస్తుండగానే మూక ద్వారా లైంగిక వేధింపు లకు గురైన 21 ఏళ్ల మహిళ గురించీ, ఆమెను రక్షించడానికి ప్రయత్నించినందుకు అక్కడికక్కడే మూక చంపేసిన ఆమె సోదరుడి గురించీ నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అతడి వయస్సు కేవలం 19 సంవ త్సరాలు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మందలింపులు రెండు నెల లుగా జడత్వంలో ఉండిపోయిన ఒక ముఖ్యమంత్రిని నిద్ర లేపాయి. అకస్మాత్తుగా, కొన్ని గంటల వ్యవధిలో, ప్రధాన నింది తుడిని అరెస్టు చేశారు. కాబట్టి, ఇన్ని రోజులు ఎన్. బీరేన్ సింగ్ ఈ ఘటనపై ఉద్దేశ పూర్వకంగా వేరే దృష్టితో చూస్తున్నారా లేక ఏం జరిగిందో ఆయనకు నిజంగానే తెలియదా? ఎలా భావించినా ఆయన (ఇప్పటికే తగ్గి పోయిన) విశ్వసనీయత గురించి సానుకూల మాట రాదు. నన్ను వివరించనివ్వండి ఈ సామూహిక అత్యాచారం, హత్యా ఘటన మే 4న జరిగినట్లు మనకు తెలుసు. జీరో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ (జీరో–ఎఫ్ఐఆర్)గా పిలిచే మొదటి పోలీసు ఫిర్యాదును మే 18న దాఖలు చేశారు. 2012లో జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత, జస్టిస్ జేఎస్ వర్మ ప్యానెల్ ప్రవేశపెట్టిన విధానం ఇది. లైంగిక వేధింపుల బాధితురాలు భారత దేశంలో ఎక్కడైనా, అధికార పరిధితో సంబంధం లేకుండా పోలీసు కేసును దాఖలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపుతారు. ఈ కేసులో జూన్ 21న సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఎఫ్ఐఆర్ను పంపారు. 60 రోజులకు పైగా, అత్యాచారం–హత్య ఘటనపై ఎఫ్ఐఆర్ను ఎవరూ పట్టించుకోలేదు. ఈ వీడియో బయటపడి, దేశం మొత్తాన్ని ఆగ్రహానికి గురి చేసి ఉండకపోతే, రేపిస్టులు, హంతకులు ఇంకా బయటే ఉండేవారు. కాబట్టి, లైంగిక వేధింపులకు సంబంధించిన ఈ భయంకరమైన కేసు గురించి తనకు తెలియదని సింగ్ అంగీకరి స్తున్నారా? లేక తనకు తెలిసిందనీ, కానీ చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాననీ ఒప్పుకుంటున్నారా? ఎలాగైనా సరే, ఇది ఆయన అసమర్థతను లేదా నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుంది. బీరేన్ సింగ్ రాజీనామా చేయాలి లేదా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ ఒక్క అతి భయానక సంఘటన వల్ల మాత్రమే కాదు, గత రెండు నెలలుగా ఆయన దారుణ వైఫల్యాల కారణంగా ఆయన్ని తొలగించాలి. ఇంకా జాతీయ పతాక శీర్షికలకు ఎక్కని ఇతర అత్యాచారాలు, హత్యా ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అవును, వాస్తవానికి, జాతి విభజనకు సంబంధించి రెండు వైపులా బాధితులు, నేరస్థులు ఉన్నారు. నిజమేమిటంటే, బీరేన్ సింగ్ ఆఖరికి తన సొంత శాసన సభ్యులను కూడా రక్షించడంలో విఫలమయ్యారు. ఉదాహరణకు వుంగ్జగిన్ వాల్తే గురించి ఆలోచించండి. ఆయన సింగ్ సహచరుడు, భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు, ముఖ్యమంత్రి సలహాదారు. ఆయనపై దాడి జరిగింది. ఆయన మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఢిల్లీలోని ఆసుపత్రి బెడ్లో కట్లతో పడి ఉన్నారు. తమ కుటుంబం ఎప్పటికీ మణిçపుర్‌కు తిరిగి వెళ్లదని ఆయన భార్య అన్నారు. నిజమేమిటంటే, స్థానిక పరిపాలనలోని అన్ని విభాగాలు జాతుల పరంగా చీలిపోయినప్పటికీ, ఇప్పటికీ విశ్వసనీయతను కలిగి ఉన్న ఏకైక వ్యవస్థ సైన్యం మాత్రమే. మైతేయిలు, కుకీల మధ్య బఫర్ జోన్లను ఏర్పాటు చేస్తున్నది సైన్యమే; ఇరువైపులా కమ్యూనిటీ నాయకులతో చర్చలను ప్రారంభించిందీ సైన్యమే. పైగా ఇటీవలి ఒక వీడియోలో చెప్పినట్లుగా, ‘మానవీయంగా ఉండటం బలహీనతకు సంకేతం కాదు’ అని సైన్యం భారతీయులకు గుర్తు చేస్తోంది. ఇంకా గుర్తుంచుకోండి, మణిపుర్‌లోని అనేక ప్రాంతాలలో సైన్యం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి చెందిన చట్టపరమైన రక్షణ లేకుండా పనిచేస్తోంది. ఆ వీడియో కీలకమైన సాక్ష్యాలను అందించిందనీ, వ్యక్తులను గుర్తించడంలో పోలీసులకు సహాయపడిందనీ బీరేన్ సింగ్ పేర్కొ న్నారు. అలా అయినప్పుడు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ లోని కొందరు అధికారులు మణిపుర్‌పై నివేదికలను, ప్రదర్శనలను (వీటిలో నావి కూడా ఉన్నాయి) ఆపమని కోరడం విడ్డూరం కాదా? ఆ మహిళలను గుర్తించేలా ఉన్నవీ, లేదా దాడికి సంబంధించిన క్రూర త్వాన్ని తెలిపేవీ చూపడానికి ఏ మీడియా హౌస్‌ను కూడా అనుమతించకూడదు. అలాంటి వీడియోలను బ్లాక్ చేయాలి. అయితే, నిర్దిష్టమైన సంపాదకీయ రక్షణతో ఆ వీడియోను ప్రస్తావిస్తున్నప్పుడు కూడా దాని చుట్టూ ఉన్న మీడియా కవరేజీని తొలగించడం అంటే, మణిపుర్ భయానక స్థితిని వివరంగా చెప్పడాన్ని తీవ్రంగా అడ్డుకోవడమే అవుతుంది. ‘‘ఇది కుకీలు లేదా మెయితీల గురించి కాదు... ఇది భారతీయ మహిళల గురించి. మొత్తం భారతీయ మహిళల గురించి’’ అని గ్లాడీ హుంజన్ చిన్నపిల్లలా ఏడుస్తూ నాతో చెప్పారు. ఈ వీడియో చూసి భారతీయ మహిళలమైన మనం వణికిపోయిన సమయంలోనే,లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ పార్లమెంటేరియన్ కు ఢిల్లీ పోలీసుల నుంచి అనూహ్యంగా బెయిల్ వచ్చింది. పైగా అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పెరోల్ వచ్చింది. మణిపుర్ గురించి, ఆ వైరల్ వీడియో గురించి మనందరం పట్టించుకోవాలి. మణిపుర్ ప్రజలలో విశ్వాసాన్ని పునరుద్ధరించ డానికి రాష్ట్ర పతి పాలన విధించడమే ప్రారంభ చర్య అవుతుంది. బర్ఖా దత్ వ్యాసకర్త ప్రముఖ పాత్రికేయురాలు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Period Leave: లోలోపల మెలిపెట్టే బాధ.. సెలవు బలహీనతేనా.. కానేకాదు!
శరీరమంతా ఒక చోటే గడ్డకట్టినప్పుడు ఒక వైయక్తిక పర్వతం విస్ఫోటం చెందినప్పుడు నేను బాధని అరచేతిలో పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంటాను అంటూ కె. గీత అనే కవయిత్రి మహిళల రుతుక్రమ బాధను వర్ణించారు. స్త్రీలకు మాత్రమే అర్థమయ్యే ఈ బాధ, ఇబ్బందికి కాస్త విశ్రాంతితో ఎంతోకొంత ఉపశమనం పొందవచ్చు. గృహిణులకు కొంచెం ఆ వెసులుబాటు ఉండొచ్చేమో కానీ కుటుంబం కోసం ఆర్థిక బాధ్యతలనూ పంచుకుంటున్న మహిళలకు ఆ విశ్రాంతి ఎలా దొరకుతుంది? సెలవు పెట్టాలంటే జీతం (ఆ రోజులకు) నష్టపోవాలి. పోనీ దానికీ సిద్ధపడి.. ‘నెలసరి వచ్చింది.. సెలవు కావాలి’ అని అడగడానికి ఏదో జంకు.. బిడియం.. భయం.. అర్థం చేసుకుంటారా? వెకిలిగా చూస్తే? కామెంట్ విసిరితే? ఇన్ని సంకోచాల మధ్య సెలవు అడిగే బదులు ఎలాగోలా కొలువుకు రావడమే నయమనే నిస్సహాయ సర్దుబాటు. సగటు మహిళా ఉద్యోగి ప్రతినెలా ఎదుర్కొనే సున్నితమైన సమస్య ఇది. ఇలాంటి స్థితిలో ఆఫీస్ యాజమాన్యాలే అర్థం చేసుకొని నెలసరిలో విశ్రాంతి తీసుకోమని అధికారికంగా ఒక రూల్ పాస్ చేస్తే ఎంత హ్యాపీ! బహిష్టు సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటోంది సమాజం. ఆ క్రమంలోనే పీరియడ్ లీవును మంజూరు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.. సిక్ లీవ్, మెటర్నిటీ లీవ్ తరహాలో! అయితే ఈ సెలవు మహిళల అవకాశాలను గండికొట్టడానికే తప్ప ఆమె సామర్థ్యానికి విలువనిచ్చేది కాదు అనే వాదన.. దీని వల్ల మహిళలు తాము శారీరకంగా బలహీనుమలని ఒప్పుకుంటున్నట్టే అనే అసంతృప్తి ఓ చర్చగా మారింది సర్వత్రా! ఆ చర్చనీయాంశాన్ని ఫన్డే కవర్ స్టొరీగా మీముందుకు తెచ్చాం! జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కాలు బెణికింది, బ్యాక్ పెయిన్ ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు లేదనకుండా లీవ్ ఇస్తారు. ఇంట్లో పెద్దలు, పిల్లల అనారోగ్యాలు, పుట్టిన రోజులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పిక్నిక్లు, వ్రతాలు, యాత్రలు ఇలా సెలవు ఇవ్వడానికి అన్నీ సకారణాలే. కానీ పీరియడ్స్‌ను మాత్రం ‘సెలవు తీసుకోవడానికి ఓ వంకలా వాడుకుంటున్నారు మహిళలు’ అన్నట్టుగా చూస్తారు.. ‘అదేమైనా రోగమా రొష్టా సెలవు తీసుకోవడానికి’ అనీ అనుకుంటారు కొందరు మగబాసులు. దీనికి ప్రధాన కారణం శారీరకంగా స్త్రీ, పురుషుల్లో భేదమే. ఇది ప్రతి నెల స్త్రీలకి తప్పనిసరి వ్యవహారం. సృష్టికి ప్రతిసృష్టిని అందించే అమ్మతనానికి ఇదే మూలం. ఒకప్పుడు నెలసరి వచ్చిందంటే అమ్మాయిలు ఓ మూల కూర్చోవాలి. ఎవరినీ ముట్టుకోకూడదు. ఎటూ తిరగకూడదు. నలుగురిలో కలవకూడదు. గుళ్లు, గోపురాలకు వెళ్లకూడదు. ప్రకృతి సహజంగా స్త్రీకి వచ్చే శారీరక మార్పులకు ఇన్ని ఆంక్షలు విధించడం కచ్చితంగా ఆమెపై చూపించే వివక్షే. కానీ అందులో అంతర్లీనంగా బహిష్టు సమయంలో మహిళ శరీరం విశ్రాంతి కోరుకుంటుందని, అందుకే ఈ సంప్రదాయాలు వచ్చాయని వాదించే వారు ఉన్నారు. రోజూ ఇంట్లో గొడ్డు చాకిరి చేసే మహిళకి ఆ మూడు రోజులే విశ్రాంతి దొరికేది. అలా ఎవరికీ కనిపించకుండా మూల కూర్చొనే స్థాయి నుంచి మహిళలు మగవారితో దీటుగా పనిచేయగల సమర్థతను సాధించడం వెనుక ఎంతో పోరాటం ఉంది. మహిళల పట్ల సానుభూతితో కాకుండా ఆ సమయంలో వారిలో కలిగే నొప్పిని, బాధను, మానసికంగా పడే ఆవేదనను కొందరైనా అర్థం చేసుకుంటున్నారు. అయినా మన దేశంలో కేవలం 15 కంపెనీలు మాత్రమే పీరియడ్ లీవ్ మంజూరు చేస్తున్నాయి. ఆ బాధ వర్ణనాతీతం కౌమరంలోకి అడుగు పెట్టి రజస్వల అనే దశను మొదలు కొని అయిదు పదుల వయసులో ఏర్పడే మెనోపాజ్ వరకూ ప్రతి అమ్మాయి, ప్రతి మహిళా నెల నెల క్రమం తప్పకుండా ఎదుర్కోవలసిన స్థితి నెలసరి. కొంత మంది మహిళల్లో నెలసరి అనేది వారి శరీర తత్వాన్ని బట్టి ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా గడిచిపోతుంది. కానీ ఎక్కువ మంది మహిళల్లో పొత్తి కడుపులో తెరలు తెరలుగా నొప్పి వస్తుంది. మరికొందరిలో అధిక రక్తస్రావం జరుగుతుంది. కొందరిలో నరాల్లో రక్తమంతా ఆవిరైపోతున్నట్టు శరీరం వశం తప్పుతూ ఉంటుంది. కాళ్లల్లో సత్తువ ఉండదు. నిల్చోలేరు. కూర్చోలేరు. పడుకోలేరు. ఏమీ తినాలనిపించదు, తాగాలనిపించదు. ఆలోచనలు కుదురుగా ఉండవు. మూడ్ స్వింగ్స్ అసాధారణంగా ఉంటాయి. లోలోపల మెలిపెట్టే బాధని దాచుకునే పరిస్థితులతో అసహనం కట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, మూడీగా ఉండడం చూస్తుంటాం. ఆ సమయంలో ఆఫీసుకి వెళ్లాలంటే ప్రాణం పోతున్నంత పని అవుతుంది. అధిక రక్త స్రావంతో మరకలు అంటుకుంటే ఎలాగన్న భయం, పదే పదే శానిటరీ ప్యాడ్ మార్చుకోవడానికి వాష్ రూమ్‌కు పరిగెత్తాలంటే ఓ జంకు, నొప్పులు వేధిస్తున్నా పని మీద దృష్టి నిలపలేని నిస్సహాయత ఇవన్నీ మహిళల్ని కుంగదీస్తున్నాయి. దీనికీ వెస్టే ఫస్ట్ పీరియడ్స్ టైమ్‌లో మహిళలకు సెలవు ఇవ్వాలన్న ఆలోచన పాశ్చాత్య దేశాల్లోనే ముందు మొదలైంది. సంప్రదాయాలకు, హిందూ జీవన విధానాలకు నెలవైన మన దేశంలో ఇలాంటి ఆలోచన చేయడం ఆలస్యంగా మొదలైంది. వందేళ్ల క్రితం 1920–30ల్లో మొట్టమొదటిసారి సోవియట్ రష్యా మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడడం కోసం ఈ సెలవు ఇవ్వాలన్న ఆలోచన చేసింది. మహిళలకు బహిష్టు సెలవు ఇవ్వాలని కార్మిక సంస్థలకు సిఫారసు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్.. మహిళల పీరియడ్ లీవ్‌కి ప్రాచుర్యాన్ని కల్పించింది. 1947లో దీనిపై చట్టం చేసింది. దక్షిణ కొరియా 1953లో ఒక్క రోజు పీరియడ్ లీవ్ ఇస్తూ చట్టం చేసింది. ఇండోనేసియాలో రెండు రోజులు, జాంబియాలో ఒక్క రోజు, తైవాన్‌లో ఏడాదికి మూడు రోజుల సెలవుతోపాటు ఆ సమయంలో అధికంగా మరో అరగంట బ్రేక్ ఇస్తోంది. ఇటీవల స్పెయిన్ కూడా మూడు రోజుల పాటు సెలవు ఇవ్వడానికి ఆమోదించింది. భారత్‌లో ఇలా.. మన దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బిహార్. కానీ మహిళల అంశంలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడింది. మహిళలకి ప్రతినెల రెండు రోజుల పీరియడ్ లీవ్ మంజూరు చేస్తూ 1992లోనే చట్టం చేసింది. కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. అయితే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు నినోంగ్ ఎరింగ్ మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వాలంటూ 2017 నవంబర్‌లో ఒక ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. స్కూలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు, ఆఫీసుల్లో పని చేసే మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు సరిగా లేవని, అవసరమైతే కాసేపు విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదని, అందుకే వారికి సెలవు మంజూరు చేస్తూ ఒక చట్టం చేయాలని ఆ బిల్లులో కోరారు. అయిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఆ బిల్లుపై కనీసం చర్చ కూడా జరగలేదు. సెలవు తీసుకుంటే వెనుకబడిపోతారా ? సమానత్వం కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్న మహిళలు ఇప్పుడిప్పుడే ఆర్థికవృద్ధిలోనూ తమ వాటా ఉందని నినదిస్తున్నారు. మన దేశంలో దాదాపుగా 43.2 కోట్ల మంది స్త్రీలు ఎంతో ఉత్సాహంతో, అంకితభావంతో పని చేస్తూ ఆర్థిక వ్యవస్థకి వెనుదన్నుగా నిలుస్తున్నారు. దేశ జీడీపీలో 18% వాటాను మహిళలే అందిస్తున్నారు. మగవారితో సమానంగా మహిళలకూ అవకాశాలు లభిస్తే 2025 నాటికి దేశ జీడీపీలో 58 లక్షల కోట్ల రూపాయలు మహిళల వాటాయే అవుతుందని మెకిన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. ఇలా మహిళలు ఎదుగుతున్న వేళ పీరియడ్స్‌లో మహిళలు విశ్రాంతి కోరుకొని సెలవు తీసుకున్నా ఇంట్లో విశ్రాంతి లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఇంటి పనుల భారం, బాధ్యత మహిళలే తీసుకోవాలి కాబట్టి అక్కడ పని చేయడం ఎలాగూ తప్పదు. ఇప్పటికే రకరకాల కారణాలతో ఆఫీసుల్లోకి మహిళా ఉద్యోగుల్ని తీసుకోవడం లేదు. తీసుకున్నా ఆడవారిపై వివక్ష కొనసాగు తూనే ఉంది. ఈ మధ్య విడుదలైన జాతీయ కుటుంబ సర్వే ప్రకారం గత అయిదేళ్లలోనే రెండు కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు వదులుకున్నారు. ఇప్పుడు పీరియడ్ లీవ్ ఇస్తే కంపెనీలు మహిళా ఉద్యోగులను వద్దనుకోవడానికి ఇదీ ఓ కారణం అవుతుందని వాదించేవారూ ఉన్నారు. ఆ వాతావరణమే లేదు 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇంకా మహిళలు స్వేచ్ఛగా ఈ అంశంపై మాట్లాడే వాతావరణమే మన దగ్గర లేదు. ఇదే అంశంపై ప్రజాభిప్రాయం కోరినప్పుడు సామాన్య మహిళలే కాదు, చదువుకుని ఉద్యోగాలు చేసే మహిళలు కూడా మాట్లాడేందుకు కాస్త తటపటాయించడం, మొహమాటపడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రతినెల అవసరమయ్యే శానిటరీ నాప్కిన్స్ కొనుగోలు చేసినప్పుడు ఎవరికీ కనిపించకుండా నల్ల క్యారీబ్యాగ్‌లలో ఇస్తూ అదేదో ఎవ్వరికీ తెలియకూడని బ్రహ్మపదార్థంలా దాచేస్తున్నారు. స్త్రీలు తమ శరీరంలో సహజసిద్ధంగా జరిగే మార్పులపై చర్చించడం, మనసు విప్పి మాట్లాడ్డంలో తప్పులేదు. ఇది స్త్రీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి దీనిని బలాలు, బలహీనతలు, సమర్థత, అసమర్థత అన్న కోణంలోంచి చూడలేం. మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మగౌరవంతో ఉంటేనే సమాజ పురోగతి సాధ్యమవుతుంది లేదంటే అభివృద్ధి గతి తప్పుతుంది. అమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మహిళ బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇది అక్షర సత్యం. నెలసరి సమయాల్లో మహిళలకి విశ్రాంతి కల్పించడానికి ఇంటా, బయటా వారి చుట్టూ ఉండే మగవాళ్లు సహకారం అందివ్వాలి. ఇలా చేయడం మహిళలకి చేసే అదనపు సాయం కానేకాదు. ఇది అందరి బాగుకోసమే అన్న అవగాహన పెరగాలి. మహిళలు బహిరంగంగా డిమాండ్ చేసినా చేయకపోయినా పీరియడ్ లీవ్ ఇస్తే లాభమే తప్ప నష్టం లేదు. ఆఫీసుకు వచ్చి కూడా సిగరెట్ బ్రేక్ అని, కాఫీ బ్రేక్ అని, ఇతరులతో పిచ్చాపాటి పేరు చెప్పుకొని మగవారు పని గంటల్ని వృథా చేస్తూనే ఉంటారు. వారు చేసే వృథాతో పోల్చి చూస్తే మహిళలకు ఇచ్చే సెలవు ఏమంత విషయం కాదు. బాధ్యత కలిగిన ప్రజా నాయకులందరూ ఈ దిశగా ఆలోచించాలి. ఎన్నో దేశాలు పీరియడ్ లీవ్ ఇస్తూ ఉంటే మన దేశంలో అది ప్రైవేటు బిల్లు స్థాయిలోనే ఉండడం, దానిపై చర్చ జరగకుండా డర్టీ థింగ్ అంటూ కొందరు పురుష ఎంపీలు అడ్డుతగలడం అత్యంత విషాదం. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగినప్పుడే వారి సమస్యలను అర్థం చేసుకుని తదనుగుణంగా చట్టాలు రూపొందించుకోగలుగుతాం. ఇక పీరియడ్ సెలవు వినియోగించుకోవాలా, వద్దా అనేది పూర్తిగా ఆమె ఇష్టం. ఆ స్వేచ్ఛ ఆమెకి అవసరం. మహిళల పడే రుతుక్రమం బాధలపై తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, తోడబుట్టిన సోదరుడు కావొచ్చు. కన్న కొడుకే కావచ్చు.. ఆ మహిళతో కలిసి జీవన ప్రయాణం సాగించే ప్రతీ మగవాడు అర్థం చేసుకొని, వారికి అండగా ఉన్నప్పుడే మనందరం కలలు కనే జెండర్ సెన్సిటివిటీ సాకారం కావడానికి ఒక అడుగైనా ముందుకు పడుతుంది. ఎందుకీ నొప్పి వస్తుంది ? డిస్మెనోరియా అంటే తీవ్రమైన నొప్పితో కూడిన రుతుక్రమం. మనలో 30 శాతం మంది మహిళలను సాధారణ స్థాయి నుంచి తీవ్రమైన నొప్పి వేధిస్తూనే ఉంటుంది. 10 నుంచి 15 శాతం మందిని అధిక రక్తస్రావం బాధిస్తుంది. చాలామంది మహిళలు రుతుక్రమానికి ముందు శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతుంటారు. 5 నుంచి 10 శాతం మందిలో కుంగుబాటు, మూడ్ స్వింగ్స్, కడుపులో సూదులతో గుచ్చుతున్నట్టుగా, కండరాలు మెలిపెడుతున్నట్లు విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు. వీటిలో కొన్ని వంశపారంపర్యంగా వచ్చేవి, ఇంకొన్ని జీవన శైలిలో మార్పుల కారణంగా వచ్చేవి. మరికొన్ని పర్యావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలు. అధిక బరువు (ఒబేసిటీ) కారణంగా హార్మోన్ల అసమతుల్యత, హైపో థైరాయిడిజం, అనీమియా (రక్త హీనత), తీవ్రమైన ఒత్తిడి కారణంగా పీరియడ్స్‌లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. పై లక్షణాలన్నింటికీ ఫలానా కారణమని చెప్పలేం. కొందరికే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయన్నదానికీ సమాధానం దొరకదు. వారి వారి శారీరక ధర్మాలను అనుసరించి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మన శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల అసమతుల్యత కూడా రుతుక్రమంలో నొప్పికి కారణం కావచ్చు. చాలా మంది మహిళల్లో తొలి ప్రసవం తర్వాత ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయి. ఎండోమెట్రియాసిస్ లేదా ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా బహిష్టు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య తగ్గుతుంది. అధిక రక్త స్రావంతో బాధపడేవారు, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (నెలసరికి ముందు వచ్చే ఇబ్బందులు)తో బాధ పడేవారు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. ఆధునిక జీవన శైలిలో భాగమైన రాత్రివేళ ఎక్కువ సమయాలు మేల్కొని ఉండటం, చదువు వల్ల ఒత్తిడి, ఆఫీస్ పని భారం వంటి సమస్యలు నెలసరిలో ఇబ్బందులకి కారణాలుగా చెప్పవచ్చు. – డాక్టర్ వాణి చెరుకూరి, గైనకాలజిస్ట్, ఇవా వుమెన్ కేర్ క్లినిక్ పీరియడ్స్‌తో యుద్ధం కవరేజీ : బర్ఖాదత్ 2020లో జొమాటో సంస్థ పీరియడ్ లీవ్ ప్రకటించినప్పుడు ప్రముఖ మహిళా జర్నలిస్టు బర్ఖాదత్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సంస్థ సదుద్దేశంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ మహిళలు శారీరకంగా బలహీనులనే వాదనకు బలం చేకూరుతందని ఆమె అభిప్రాయడ్డారు. సైన్యంలో చేరాలని, కదనరంగం కవరేజీ ఇవ్వాలని, యుద్ధ విమానాలు నడపాలని, అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకుంటూ ఇంకోవైపు పీరియడ్ లీవ్ అడగడం ఎంతవరకు సమర్థనీయమని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు తాను కార్గిల్ యుద్ధం కవరేజీకి వెళ్లినప్పుడు పీరియడ్స్‌లో ఉన్నానని , నొప్పికి మాత్రలు వేసుకుంటూ, శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో లేకపోతే టాయిలెట్ పేపర్లు వాడుతూ యుద్ధ వార్తల్ని ప్రపంచానికి వెల్లడించానన్నారు. బర్ఖా అప్పట్లో చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మద్దతు పలికిన వారి కంటే వ్యతిరేకించినవారే అధికంగా ఉన్నారు. ఆడవాళ్లకే ఆ బాధ తెలుస్తుంది ఉరుకుల పరుగుల జీవితంలో మగవారితో సమానంగా పోటీపడి పనిచేస్తున్న మహిళలకు సహజసిద్ధమైన ప్రకృతి నియమం పీరియడ్స్. వృత్తి రీత్యా మహిళా కానిస్టేబుల్స్, కండక్టర్లు మొదలు ఇలా ఎక్కువ సమయం విధుల్లో గడిపేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ ఆ సమయంలో కూడా వారికి పని చేయక తప్పనిసరి పరిస్థితి ఇంటా బయటా ఉంటుంది. మెటర్నటీ లీవ్ ఎలా ఇస్తారో అదే విధంగా మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వడంలో తప్పులేదు. అందరిలోనూ ఈ బాధ ఒకే రకంగా ఉండదు కాబట్టి ప్రతినెల కాకుండా, ఏడాదికి కొన్ని రోజులు సెలవు కేటాయించడం మంచి పని. ఇక ఆ సెలవు తీసుకోవాలా, వద్దా అన్నది మహిళల చాయిస్. – సుమతి, తెలంగాణ డీఐజీ ఆహ్వానించాల్సిన అంశం నెలసరి వచ్చినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. ఆ సమయంలో విశ్రాంతి అవసరం. ఎన్నో ఆఫీసుల్లో స్త్రీల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు లేవు. కొన్ని స్కూళ్లల్లో టాయిలెట్స్ లేక శానటరీ ప్యాడ్స్ మార్చుకునే వీలు ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడో దూరంగా బాత్రూమ్స్ ఉంటాయి. తలుపులు కూడా సరిగా ఉండవు. అలాంటి చోట్ల మహిళలు చాలా ఇబ్బంది పడాలి. అందుకే పీరియడ్ లీవ్ ఇవ్వాలన్న ఆలోచన ఆహ్వానించాల్సిన అంశం. ఆ సమయంలో సెలవు తీసుకున్నంత మాత్రానా మహిళలు శారీరకంగా బలహీనులమని అంగీకరించినట్లన్న వాదన అర్థరహితం. – కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్త ఇప్పటికీ చాలెంజే! ఇప్పుడంటే ఆఫీసులు.. వాటిల్లో టాయ్‌లెట్స్.. కారవాన్స్ వచ్చాయి కానీ నేను యాంకరింగ్‌కు వచ్చిన కొత్తల్లో అంటే 1991 ఆ టైమ్‌లో ఊళ్లకు వెళ్లి షూటింగ్స్ చేయాల్సి వచ్చినప్పడు టాయ్లెట్కైనా పీరియడ్స్ టైమ్‌లో ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలన్నాæ.. చెట్టు.. పుట్ట.. గట్టే గతి. వాటి చాటుకు వెళ్లి చేంజ్ చేసుకోవడమే. కానీ గంటలు గంటలు నిలబడి చేసే ప్రీరిలీజ్ ఫంక్షన్స్ ఇప్పటికీ చాలెంజే పీరియడ్స్ టైమ్‌లో. ప్యాడ్స్ చేంజ్ చేసుకునే వీలే ఉండదు. కాస్ట్యూమ్స్ కూడా నా సౌకర్యం కోసం డార్క్ కలర్స్‌లో ఇవ్వమని అడగడానికి ఉండదు. ఒక్కోసారి లైట్ కలర్స్‌లో ఇస్తారు. అట్లాంటప్పుడు నేను తీసుకునే జాగ్రత్త ఒక్కటే ఎవ్రీ థింగ్ ఈజ్ ఇన్ ప్రాపర్ ప్లేస్ ఉండేట్టు చూసుకోవడమే. పాడ్ మీద పాడ్ .. పాడ్ మీద పాడ్ పెట్టుకుని వెళ్లిన సందర్భాలు, క్లాట్స్, క్రాంప్స్‌తో విలవిల్లాడిన సందర్భాలూ ఉన్నాయి. – యాంకర్ సుమ ఒక ఇంటర్వ్యూలో బలహీనతగానే పరిగణించాలి పురుషులతో సమానంగా పోటీపడుతున్నప్పుడు మహిళలు పీరియడ్ లీవ్ తీసుకుంటే వారి బలహీనతగానే పరిగణించాలి. ఈ ఆధునిక ప్రపంచంలో నెలసరి బాధల నుంచి బయట పడేందుకు ఎన్నో మార్గాలున్నాయి. మందులు, ప్రాణాయామం, యోగాసనాలు వంటి వాటితో ఈ బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. సెలవు కోసం చట్టం చేయడానికి ముందుకొస్తే అందరితోనూ చర్చించి చేయాలి – సంగీత వర్మ, విద్యావేత్త ఎన్నటికీ బలహీన పరచదు ఈ లీవ్ మహిళల్ని ఎన్నటికీ బలహీన పరచదు. మగవారి కంటే మహిళలే అన్ని పనులు బాధ్యతతో చేస్తారు. ఆ సమయంలో విశ్రాంతి దొరికితే ఆ మర్నాడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. – కవిత రాజేశ్, ఎంట్రప్రెన్యూర్ స్వాగతించాలి తప్ప.. నెలసరి సమయంలో మహిళలకు ఎన్నో ఇబ్బందులుంటాయి. అందరిలోనూ ఒకేలా ఉండవు. ప్రభుత్వం వాటిని గుర్తించి సెలవు మంజూరు చేస్తే స్వాగతించాలి. అంతే తప్ప అది మహిళల అసమర్థతగా చూడకూడదు. అయితే ఈ పీరియడ్ లీవ్‌ను ఐచ్ఛిక సెలవుగా ప్రకటించాలి. – పి. సౌదామిని, డైరెక్టర్, సీఓడబ్ల్యూఈ, ఇండియా స్విగ్గీ నుంచి ఫ్లిప్‌కార్ట్ వరకు ►ఆన్లైన్ ఫుడ్ డెలవరీ సంస్థ స్విగ్గీ తమ సంస్థలోని డెలివరీ గర్ల్స్‌కి నెలకి రెండు రోజులు పీరియడ్ లీవ్ ఇస్తోంది. మహిళల హైజీన్ కోసం ఉత్పత్తుల్ని తయారు చేసే వెట్ అండ్ డ్రై కంపెనీ తమ కంపెనీలో పని చేసే మహిళలకు రెండు రోజులు అదనంగా సెలవు ఇస్తోంది. ►హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఇండస్ట్రీ ఆర్క్ తమ సెలవుల్లో పీరియడ్ లీవ్‌ను కూడా చేర్చింది. ఒకటి, లేదా రెండు రోజులు ఆఫ్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ►మలయాళంలో మాతృభూమి పత్రిక నెలకి ఒక రోజు సెలవు ఇస్తోంది. ►చెన్నైకి చెందిన డిజిటల్ మ్యాగజైన్ మ్యాగ్టర్ నెలకి ఒక రోజు లీవ్ ప్రకటించింది. ►జొమాటో సంస్థ అమ్మాయిలకు ఏడాదికి అదనంగా 10 రోజుల సెలవు కల్పించింది. అవసరమైన వారు ఆ సెలవు వినియోగించుకుంటారని అలా ఇచ్చింది. ►ముంబైకి చెందిన డిజిటల్ మీడియా కంపెనీ కల్చర్ మిషన్ తమ సంస్థలో మహిళా ఉద్యోగులు వేతనంతో కూడిన ఒక్క రోజు సెలవు తీసుకోవడానికి అనుమతించింది. ►బెంగుళూరుకు చెందిన స్టార్టప్ హార్సెస్ స్టేబుల్ న్యూస్ ఉద్యోగుల్లో 60 శాతం మహిళలే. ఈ సంస్థ నెలకు రెండు రోజులు పీరియడ్ లీవ్ మంజూరు చేసింది. ► ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ తమ కంపెనీలోని మహిళా ఉద్యోగుల కోసం నెలకు ఒక్క రోజు పీరియడ్ లీవ్ ఇచ్చింది. ►కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు మహిళలకు నెలసరి సమయంలో ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. చదవండి: Russia- Ukraine: మూడో ముప్పు.. అసలు భయం అదే.. భారీ జనహనన ఆయుధాల వల్ల! -
నిండు ప్రాణాన్ని నిలువునా మింగిన అవ్యవస్థ..!!
ప్రపంచం నలుమూలల్లోని కథనాలను ప్రజలకు చేరవేసే జర్నలిస్టు.. తాను స్వయంగా ఓ కథనానికి వస్తువైతే ఎలా ఉంటుంది? పదిహేను నెలలుగా కరోనా భూతం కథలను చెబుతూ వచ్చిన నేను ఇప్పుడు ఆ భూతం బాధితురాలిగా మిగిలిపోయా. మా నాన్న ‘స్పీడీ దత్’ను కరోనా కాటేసింది. నా ప్రపంచం కుప్పకూలినంత వేదన అనుభవించా. కోపం... ఆందోళన.. ఒంటరితనం అన్నీ ఒక్కసారి నన్ను చుట్టుముట్టాయి. కరోనా కాలంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కుటుంబాల కథలే కదా నేను బోలెడన్ని చెప్పింది? అనిపించింది. ఎయిరిండియా మాజీ అధికారి అయిన మా నాన్న వాస్తవానికి ఓ సృజనశీలి. యంత్రాలను ముక్కలు ముక్కలు చేసి వాటిని మళ్లీ జోడించడంలో ఆనందాన్ని అనుభవించేవాడు. మిలమిల మెరిసే కళ్లు... రేపటిపట్ల నిరంతరం ఆశలు కలిగిన, శాస్త్రీయ దృక్పథం ఉన్న వ్యక్తి. మా నుంచి ఏమీ ఆశించని స్త్రీవాద తండ్రి కూడా. సోదరితోపాటు నాకూ నిర్భయంగా ఎక్కడికైనా ఎగిరిపోగల స్వేచ్ఛనిచ్చారు. మా భావోద్వేగాలను కానీ.. సమయాన్ని కానీ ఆశించకుండా.. బుల్లి విమానాలు, రైళ్లను సిద్ధం చేస్తూ గంటల సమయం గడిపేవారు. తన తరువాత ఆ బొమ్మలన్నింటినీ పిల్లల అనాధాశ్రమానికి ఇచ్చేయాలని మాట కూడా తీసుకున్నారు. కోవిడ్ లాంటి విషాదం... మన బంధుమిత్రుల ఆప్యాయతలను, కాలాన్ని మన నుంచి దూరం చేస్తుంది. మన మెదడు, గుండెల్లో వారి జ్ఞాపకాలు తొలుస్తూంటే.. తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పుల బేరీజు మనలను వెంటాడుతూనే ఉంటాయి. నాన్న చనిపోయి ఐదు రోజులవుతోంది. బుల్లి విమానాలు, రైళ్లు తయారు చేసేందుకు నాన్న సిద్ధం చేసుకున్న యూట్యూబ్ చానల్ ఓపెన్ చేస్తే చాలు... కళ్లల్లోని నీరు అప్రయత్నంగా కిందకు ఒలికిపోతున్నాయి. నాన్నకు మాటిచ్చి బతికుండగా నెరవేర్చేలేకపోయిన పనుల జ్ఞాపకాలు వెంటాడటం మొదలవుతుంది. (హిందుస్థాన్ టైమ్స్‌లో తాను రాసిన కథనాన్ని చూసుకోవాలన్నది వాటిల్లో ఒకటి). కోవిడ్ చుట్టుముట్టినప్పుడు చాలామంది వృద్ధుల మాదిరిగానే ఆయన కూడా ఆసుపత్రిలో చేరేందుకు అంతగా ఇష్టపడలేదు. చివరిరోజుల్లో తన వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని భయపడ్డారేమో. వ్యాధి సోకిన తొలినాళ్లలో వైద్యులు మధ్యమస్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయని, ఆక్సిజన్ మోతాదులుగా స్థిరంగా ఉన్నాయని చెప్పారు. ఇంట్లోనే చికిత్స కల్పించేందుకూ అంగీకరించారు. మెదాంతా ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూం డేది. కానీ.. విపత్తు అంతా అకస్మాత్తుగా ముంచుకొచ్చింది. అనూహ్యంగా జ్వరం రావడం.. ఆక్సిజన్ మోతాదులు పడిపోవడం చకచక జరిగిపోయాయి. మెదాంతా ఆసుపత్రి అంబులెన్స్ కోసం వేచి చూస్తే సమయం వృథా అవుతుందేమో అన్న అందోళనలో అప్పటికప్పుడు ఓ ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. తీరా చూస్తే అది అధ్వానస్థితిలో ఉన్న ఓ మారుతీ వ్యాన్‌గా తేలింది. డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయని, ఆక్సిజన్ సిలిండర్ కూడా పనిచేస్తోందని నమ్మబలకడంతో నేను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నా. నాన్న అతడి సేవకుడు వెనుకన ఎక్కారు. ట్రాఫిక్‌ను దాటుకుని ఆసుపత్రి చేరేందుకు గంటకుపైగా సమయం పట్టింది. అంతసేపూ నాన్న అసౌకర్యంగానే వ్యాన్‌లోని టేబుల్‌పై పడుకుని ఉన్నారు. అంబులెన్స్‌లు సాఫీగా ప్రయాణిం చేందుకు గ్రీన్‌కారిడార్ ఒకటి ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసులను ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా.. కర్ఫ్యూ అమలు కోసం రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్యనే మా ప్రయాణం సాగింది. శ్మశానంలో గందరగోళం... నాన్నను మెదాంతా ఆసుపత్రికి చేర్చే సమయానికి ఆక్సిజన్ మోతాదులు గణనీయంగా పడిపోయాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చాలని వైద్యులు తెలిపారు. అంబులెన్స్ ముసుగేసుకున్న ఆ డొక్కు వాహనంలోని సిలిండర్ పనిచేయలేదని, నాన్నకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ మాస్కు కూడా సరైంది కాదని అర్థమైంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ వైద్యులు మాత్రం తమ శాయశక్తులా ప్రయత్నాలు చేశారు. వారికి నా కృతజ్ఞత మాటల్లో చెప్పలేను. కానీ.. నాన్న కొన్ని రోజుల కంటే ఎక్కువ సమయం బతకలేకపోయారు. రెండు రోజులపాటు వెంటిలేటర్‌పై గడిపి వెళ్లిపోయారు. ఆసుపత్రికి దగ్గరలోనే ఉండే శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లాం. పలుమార్లు వార్తా కథనాల్లో వివరించినట్టుగానే.. అక్కడ కాసింత స్థలం కూడా కరవై ఉంది. కనీసం మూడు కుటుంబాల వారికి ఒకే టోకెన్ నెంబర్ ఒకే సమయానికి ఇవ్వడంతో ఒకపక్క గందరగోళం నడుస్తోంది. కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలై అది కాస్తా గొడవకు దారితీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు చెల్లి పోలీసులకు ఫోన్ చేయాల్సి వచ్చింది. జర్నలిస్టుగా ఈ రకమైన సమస్యలపై.. తరచూ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి ఉంటాను నేను. కానీ.. ఆ ప్రశ్నలన్నీ ఆ సమయంలో నన్నే వెంటాడాయి. ప్రభుత్వం టీకా కార్యక్రమం మరింత ముందుగా మొదలుపెట్టి ఉంటే... మా నాన్న బతికి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉండేదేమో అనిపించింది. ఇంకో రెండు వారాల్లో రెండో డోసు తీసుకోవాల్సి ఉండగా నాన్న మరణించారు. డొక్కు మారుతీవ్యాన్ కోసం కాకుండా మరికొంత సమయం వేచి ఉండి మెదాంతా అంబులెన్స్‌లోనే నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదా? నాన్న ఇప్పటికీ బతికి ఉండేవాడా? అయితే ఒక్క విషయం ఇంతటి కష్టంలోనూ ఒక జర్నలిస్టుగా నాకు లభించే ‘ప్రత్యేక’ సౌకర్యాల గురించి నాకు గుర్తుంది. వీట న్నింటి కారణంగా నాన్నకు కనీసం బతికేందుకు ఒక మంచి అవకాశమైనా లభించింది. ఆసుపత్రి గేట్ల వద్ద కుప్పకూలుతున్న వారు.. బెడ్లు, ఆక్సిజన్ దొరక్కుండా కన్ను మూస్తున్న వారెందరో! నాన్న మరణంతో అనాథను అయిపోయినా భారత ప్రభుత్వం కారణంగా అనాథలుగా మారిన వారికంటే నేను అదృష్టవంతురాలిననే అనుకుంటున్నా!! బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (హిందూస్థాన్ టైమ్స్ సౌజన్యంతో..) -
ఇప్పటికీ అవే అసైన్మెంట్లు!
‘మహానటి’ చిత్రంలో సమంత యువ జర్నలిస్టు. వాళ్ల ఎడిటర్ ఆమెకు ఎప్పుడూ అంతగా శ్రమ అవసరం లేని అసైన్మెంట్లు ఇస్తుంటారు. సమంతకు మాత్రం ఏదైనా డైనమిక్‌గా చేయాలని ఉంటుంది. ‘‘ఆ వెధవ శేఖర్‌కి చీఫ్ మినిస్టర్.. నాకేమో.. కోమా పేషెంట్’’ అని బాధపడుతుంది ఓ సీన్లో. మంగళవారం (ఫిబ్రవరి 4) హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ‘చేంజింగ్ నేచర్ ఆఫ్ ఇండియన్ మీడియా’ అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ ప్రసంగిస్తూ.. ‘‘మహిళా రిపోర్టర్లకు ఇప్పటికీ అవే అసైన్మెంట్లు’’ అంటూ తన అనుభవాలు పంచుకున్నప్పుడు ఆమెలోనూ ఒక సమంత కనిపించారు! జర్నలిజంలో మహిళలకు కేటాయించే అసైన్మెంట్ల విషయంలో తన తల్లి ప్రభాదత్ తరానికి, తన తరానికి, ఇప్పటి కొత్త తరానికి పెద్ద తేడా లేదంటారు బర్ఖాదత్. ‘‘మా అమ్మ అరవైలలోనే జర్నలిజంలోకి వచ్చింది. అప్పటికి ఈ రంగంలో ఆడవాళ్లు అసలు లేరనే చెప్పాలి. సమాజంలో ఉన్న అవినీతిని ఎండగట్టాలని, మహిళల సమస్యల మీద కథనాలు రాయాలని, రాజకీయ విశ్లేషణలు చేయాలని ఎంతో ఉత్సాహంగా ఈ రంగంలోకి వచ్చిన మా అమ్మకు ఫ్లవర్ షో అసైన్మెంట్ ఇచ్చారట! ‘ఇది కాదు, నేను చేయాలనుకుంటున్నది’ అన్నప్పుడు మా అమ్మకు వచ్చిన సమాధానం ‘అమ్మాయివి కదా’ అని. ఇండో పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు తనకు వార్ ఫీల్డ్ నుంచి రిపోర్ట్ చేసే అవకాశం ఇమ్మని అమ్మ అడిగిందట. అప్పుడూ అదే సమాధానం. ఇరవై ఏళ్ల ఆడపిల్లను యుద్ధక్షేత్రానికి పంపించడానికి ఎడిటర్ సిద్ధంగా లేరు. కానీ సరిహద్దులో యుద్ధం జరుగుతుంటే ఢిల్లీలో ఉండడం ఆమె వల్ల కాలేదు. ఐదు రోజులు సెలవు పెట్టి మరీ పంజాబ్ సరిహద్దుకు వెళ్లింది. ఢిల్లీకి వచ్చి యుద్ధ సమయంలో తాను చూసిన విషయాలను రాసింది. నాకు పదమూడేళ్లున్నప్పుడే అమ్మ బ్రెయిన్ హెమరేజ్‌తో మాకు దూరమైంది. ఆమె జీవించింది నలభై ఏళ్లే. కానీ నాలో వందేళ్ల స్ఫూర్తిని నింపింది. అదే స్ఫూర్తితో జర్నలిజంలో కొనసాగాను. నాకూ అదే ఎదురైంది కార్గిల్ యుద్ధ సమయంలో అసైన్మెంట్ వేయమని అడిగినప్పుడు నాకు కూడా మా అమ్మకు ఎదురైనట్లే ‘యుద్ధం క్షేత్రంలోకి అమ్మాయిలెందుకు? అనే ప్రశ్న ఎదురైంది. తరం మారినా ఏమీ మారలేదని తెలిసింది. ఆ రిపోర్టింగ్‌కి అవకాశం వచ్చిందనడం కంటే తెచ్చుకున్నానని చెప్పడమే కరెక్ట్. తీరా అక్కడికి వెళ్లిన తరవాత సైనికాధికారులు కూడా ‘ఇది అమ్మాయిలు పని చేసే ప్రదేశం కాదు’ అన్నారు. నాకు భయం లేదన్నాను. వాళ్లు చెప్పిన కారణం ఏమిటంటే... అక్కడ సమయానికి ఆహారం ఉండదు, బస వసతి ఉండదు, కనీసం బాత్రూమ్లు కూడా ఉండవు. అందుకే వద్దంటున్నాం అని. అన్నింటికీ సిద్ధపడి, బాత్రూమ్ అవసరాలకు చెట్ల మాటును, రాళ్ల గుట్టలను ఆశ్రయిస్తూ పని చేశాను. కార్గిల్ యుద్ధంలో హీరో.. కెప్టెన్ విక్రమ్ బత్రాను ఇంటర్వూ్య చేయగలిగాను. 1999లో ఇప్పటిలాగా స్మార్ట్ఫోన్లు లేవు. ఇంటర్నెట్ సౌకర్యం విస్తృతంగా లేదు. రిపోర్ట్ చేసిన కథనాలను, ఫొటోలను ఢిల్లీకి చేర్చాలంటే దగ్గరలోని పట్టణాలకు వెళ్లాలి. మిలటరీ వాళ్లను బతిమలాడి వాళ్లతోపాటు వాళ్ల వాహనంలో ప్రయాణించాను. నేను చెప్పేదేమిటంటే.. ఎవరైనా తాము ఒకటి చేయాలనుకుంటే చేసి తీరాలి. ఇప్పటి రిపోర్టర్‌కు తాను చూసిన, విశ్వసించిన విషయాన్ని యథాతథంగా రిపోర్ట్ చేసే అవకాశం తగ్గిపోయింది. అయితే పని చేయాలనుకుంటే సంకెళ్లు మాత్రం ఎప్పుడూ ఉండవు. గ్రామాలకు వెళ్లండి. అక్కడి సమస్యలను కెమెరాలో చిత్రీకరించండి. వాటిని యథాతథంగా రిపోర్ట్ చేయండి. వార్తలు మన దగ్గరకు రావు. వార్తల దగ్గరకు మనమే వెళ్లాలి. మీడియాలో వచ్చిన మార్పుల్లో టెక్నాలజీ విప్లవం కూడా ఒకటి. ఇప్పుడు సాంకేతికత విస్తృతమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్, మొబైల్లో డాటా ఉంటే చాలు. చూసింది చూసినట్లు చెప్పడం వస్తే చాలు.. జర్నలిస్టు అయిపోవచ్చు. సంఘటనను మీదైన కోణంలో విశ్లేషిస్తూ ప్రజెంట్ చేయవచ్చు’’ అన్నారు బర్ఖాదత్. పెళ్లే కాలేదు.. ముగ్గురు భర్తలా! వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో సగానికి సగం తప్పుడు కథనాలు చెలామణిలోకి రావడం మీద బదులిస్తూ వికీపీడియా కూడా ఇందుకు పెద్దగా మినహాయింపు కాదన్నారు బర్ఖాదత్. పెళ్లి చేసుకోని తనకు ముగ్గురు భర్తలున్నట్లు వికీపీడియా రాసిన విషయాన్ని గుర్తు చేశారామె. టీవీలు రేటింగ్ పరుగులో కొట్టుకుపోవడాన్ని కూడా ఆక్షేపించారు. ఏదైనా ఒక మీడియా సంస్థ తాను ప్రచురించే లేదా ప్రసారం చేసే కథనాల విషయంలో... నిజం మీద కట్టుబడితేనే ఆ సంస్థకు విశ్వసనీయత ఉంటుంది అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ‘‘అవాస్తవాలతో కథనాలను వండి వారుస్తుంటే వచ్చే చెడ్డపేరు ఆ మీడియా సంస్థకు మాత్రమే కాదు. జర్నలిజం వృత్తి మీదనే గౌరవం తగ్గిపోతుంది’’ అన్నారు బర్ఖాదత్. – వాకా మంజులారెడ్డి -
హోదాతోనే ప్రగతి..
‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఎలాంటి ప్రయోజనం కలగదు. హోదా ఇస్తేనే ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు అందించగలం. దాంతోనే పరిశ్రమల స్థాపన, ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. హెచ్టీఎన్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ బర్ఖాదత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై స్పందించారు. బర్ఖాదత్: కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకుంటారా? వైఎస్ జగన్: ప్రత్యేక ప్యాకేజీతో ప్రయోజనం లేదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో వంద శాతం ఆదాయ పన్ను, జీఎస్టీ మినహాయింపులున్నాయి. అలాంటి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు లభించకపోతే.. ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌లో ఓ హోటల్ ఎందుకు కడతారు? పరిశ్రమ ఎందుకు పెడతారు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి టైర్ –1 నగరాలతో పోటీపడాలంటే.. టైర్ –2 నగరాలు మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యం కాదు కాబట్టి మాకు ప్రత్యేక హోదా అవసరం. బర్ఖాదత్: ఫలితాలు వెలువడేంత వరకూ కూడా చంద్రబాబు ఢిల్లీలో పలువురు రాజకీయ నేతలతో సమావేశాలు జరిపారు. రాష్ట్రంలోనే కాదు. కేంద్రంలోనూ కీలకపాత్ర పోషించగల స్థాయిలో విజయం సాధిస్తామని ఆయన భావించారు. అయనకు అంత విశ్వాసం ఎలా ఏర్పడిందంటారు? వైఎస్ జగన్: ఆ సమావేశాలన్నీ గెలుస్తామన్న విశ్వాసంతో చేసినవని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అదో డ్రామా. తాను ఓడిపోతున్నానని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఉందన్న విషయాన్ని ఆయన ముందుగానే గుర్తించారు. అందుకే రాజకీయంగా జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించుకునే ఉద్ధేశంతో తనను తాను ఓ సంధానకర్తగా, అన్ని పార్టీల వారికి ఇష్టుడిగా చూపించుకునేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే కలిసి ఉన్న వారిని చంద్రబాబు కొత్తగా కలిపేదేముంటుంది? శరద్ పవార్, రాహుల్‌గాంధీ మాట్లాడుకోకుండా ఉన్నారా? కుమారస్వామికి, రాహుల్ గాంధీకి మధ్య సంబంధాలు లేవా? యూపీఏ కూటమిలో భాగంగా ఉన్న వారిని మళ్లీ కలుపుతానని బాబు వెళ్లడం ఏమిటి? బర్ఖాదత్: ఏపీలో కాంగ్రెస్ ఓట్లు రెండు శాతం కంటే తక్కువకు పడిపోయాయి. మీ తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని అన్నారు. మీకు చేసిన అన్యాయానికి శిక్షపడిందని అనుకుంటున్నారా? వైఎస్ జగన్: ఈ విషయాలకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఆ విషయాలను అలా వదిలేద్దాం. ఇప్పుడు వాటి గురించి మరిన్ని వ్యాఖ్యలు చేయడంలో అర్థం కూడా లేదు. ఓటర్లు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. వ్యక్తిగా నేను చేసిందేమీ లేదు. నన్ను విమర్శించిన వారికి ఓటర్లు సమాధానం చెప్పారు. బర్ఖాదత్: విజయం సాధించిన తరువాత ఉదాత్తంగా ఉండాలని అనుకుంటున్నారా? వైఎస్ జగన్: వాస్తవం ఏమిటంటే.. నాకు కక్షలు, కార్పణ్యాలపై నమ్మకం లేదు. మనుషులుగా మనకు ఏ అంశంపై కూడా అధికారం లేదన్నది నా నమ్మకం. అవన్నీ దేవుడి నుంచి వచ్చేవి. ఏ చర్య తీసుకోవాలన్నా అది దేవుడి వల్లే సాధ్యం. బర్ఖాదత్: ఓట్లకు కోట్లు కేసు ఏమవుతుంది? వైఎస్ జగన్: చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకేమీ కక్ష, పగ లేదు. అయితే కొన్ని స్కాములు చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ వాటిని ఎలా విస్మరించగలం. వాటన్నింటినీ వెలికితీసి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధిగా నామీద ఉంది. ఇందుకోసం ఓ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తాం. భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని కాంట్రాక్టులు కట్టబెట్టారు. రాజధాని భూ సేకరణ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ డబ్బు అంతా ప్రజలది. ఈ అక్రమాలను వెలికితీయాలి. ఆయా పనులకు వాస్తవంగా ఖర్చయ్యేది. ఎంత అన్నది ప్రజలకు చెప్పాలి. ఇందుకోసం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపడతాం. ఆరు నెలల్లో ఈ దేశానికి, ప్రపంచానికి ఈ ప్రభుత్వం అవినీతి రహితమన్నది చూపుతాం. బర్ఖాదత్: తెలుగుదేశం, కాంగ్రెస్ కుట్ర పన్ని మీమీద పెట్టాయని చెబుతున్న కేసుల పరిస్థితి ఏమిటి? వైఎస్ జగన్: ప్రజాక్షేత్రంలో 50 శాతం ఓట్లతో ఇచ్చిన విజయం.. నాపై కుట్రలు ఇకనైనా ఆపండి అనేందుకు నిదర్శనం. కక్ష సాధింపు ధోరణితో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పెట్టిన కేసుల్లో డొల్లతనం ఏమిటో ఈ తీర్పుతోనే అర్థమవుతుంది. ఏపీలో నేను ఎలాంటివాడినో, నా తల్లిదండ్రులు ఎలాంటివారో అందరికీ తెలుసు. నా తండ్రి మరణించేంత వరకూ నాపై కేసుల్లేవని, కాంగ్రెస్‌ను వదిలిన తరువాతే ఈ కేసులు వచ్చిపడ్డాయనీ అందరికీ తెలుసు. -
ప్రముఖ జర్నలిస్టుకు ట్విటర్ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్ పలురకాల బెదిరింపులకు తోడు లైంగిక వేధింపులకు గురయ్యారు. అసభ్య సందేశాలు, తీవ్ర అభ్యంతరకరమైన ఫొటోను ఫార్వర్డ్ చేయడంతో పాటు ఆమె ఫోన్ నంబర్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ.. చంపేస్తామంటూ తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులపై విసుగెత్తి, సహనం నశించి వివరాలను బహిర్గతం చేయడం తప్పడం లేదంటూ ఆయా వ్యక్తుల ఫోన్ నెంబర్లను ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. అలాగే వేధింపులపై సంబంధిత పోలీసు అధికారులతోపాటు, ట్విటర్‌కు కూడా బర్ఖా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ట్విటర్ ప్రతికూలంగా స్పందించింది. వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలకు బదులుగా.. ఫోన్ నెంబర్లు షేర్ చేయడాన్ని తప్పుబడుతూ.. ఇకపై ఇలా చేస్తే.. మీ ట్విటర్ ఖాతాను తొలగిస్తామంటూ ఈ మెయిల్ సమాచారాన్ని పంపింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బర్ఖాదత్ ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేశారు. నిందితులపై చర్యలకు బదులుగా వారికి వత్తాసు పలకడం అవమానకరమైన చర్యగా పేర్కొన్నారు. దీనిపై ట్విటర్‌పై న్యాయపోరాటానికి తాను సిద్ధపడుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు వేధింపులపై ఫిర్యాదు చేస్తే.. హెచ్చరికలా అంటూ ట్విటర్ వ్యవహారశైలిపై దుమారం రేగింది. ట్విటర్ వేదికగా వేధింపులు, హింస పెరిగిపోతోందని, దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానించారు. బర్ఖాదత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వాట్సాప్ బర్ఖాదత్ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వాట్సాప్ కమ్యూనికేషన్ హెడ్ కార్ల్ వూగ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా పుల్వామా దాడి జరిగినప్పటినుంచీ దేశంలోని జర్నలిస్టులు,ఇతర ప్రముఖులు వేధింపులెదుర్కొన్నారు. రావిశ్ కుమార్, స్వాతి చతుర్వేది, అభిసార్ శర్మతోపాటు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ కోవలో ఉన్నారు. వీరంతా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తనకు వందలాది కాల్స్, సందేశాలతోపాటు బెదరింపు లెదురయ్యాయంటూ మరో సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. పుల్వామా దాడి నేపథ్యంలో కశ్మీరీ యువకులను తీవ్రవాదులుగా ముద్రవేయడంపై నిరసన తెలిపినందుకుగాను చాలామంది జర్నలిస్టులు, విద్యార్థినులు, ఇతర మీడియా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ సోషల్‌మీడియా వేదికగా వేధింపులు, బెదిరింపులు తీవ్రమయ్యాయి. I had close to 1000 abusive messages and calls in a Cordinated and violent mob attack. These included a message to shoot me, a nude photo, many sexually abusive messages. I outed the men who did this. Twitter locked me till many of the details were taken down. I wroe this to them pic.twitter.com/XRyx9xbjcV — barkha dutt (@BDUTT) February 19, 2019 It’s disgusting and unacceptable to see the vile and hatred @BDUTT being subjected to. With you in your fight. Shocked to see some women jump to suggest this isn’t sexual harassment, then what is? These sick men must be punished — Supriya Shrinate (@SupriyaShrinate) February 19, 2019 Such abusive threats are criminal n @Twitter should realise that it is potentially complicit in such acts of illegal social media activities n must prevent such abuse immediately Police must also be notified. https://t.co/3fcUiIkcpn — Kiran Mazumdar Shaw (@kiranshaw) February 19, 2019 -
బార్ఖాదత్‌కు బెదిరింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు పూర్తి రక్షణ ఉంటుందని భావించాను. ఓ వ్యక్తిగా నా హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదనే నమ్మకంతో కూడా ఉన్నాను. కాని నేడు నన్ను నీడలా వెంటాడుతున్నారు. నా కదలికలపై నిఘా కొనసాగుతోంది. నా ఇంటి గోడల్లో కూడా ఎన్నో నిఘా నేత్రాలు ఉండే ఉంటాయి. నేను ఓ టెలివిజన్ జర్నలిస్టుగా నా విధులను నిర్వర్తించుకుండా నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని, భారతీయ జనతా పార్టీలోని కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. టీవీ జర్నలిస్ట్ ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమంటూ లేదా మరే పనైనా చూసుకోమంటూ గతేడాది కాలంగా నన్ను వేధిస్తూనే ఉన్నారు. ఆ బెదిరింపులు, వేధింపులు స్పష్టంగాను, కఠినంగా లేకపోవడం వల్ల ఇంతకాలం నేను వారికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేకపోయాను. వారి బెదిరింపులు చాలా సున్నితంగా, అస్పష్టంగా, కొన్నిసార్లు పరోక్షంగా ఉంటున్నాయి. నేను ఎన్డీటీవీలో పనిచేస్తున్నప్పుడు ప్రమోటర్లు వచ్చి నన్ను సున్నితంగా హెచ్చరించారు. నా కారణంగా వారిపై ఒత్తిళ్లు వస్తున్నాయట. నన్ను మరో ఉద్యోగం చేసుకోమని చెప్పారు. (2017, జనవరిలో బార్ఖాదత్ ఎన్డీటీవిని వదిలిపెట్టారు. ప్రస్తుతం మరో న్యూస్ ఛానల్ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు) నేను కొత్త ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న విషయం కూడా వారికి తెల్సింది. అన్ని ప్రాజెక్టులను వదిలేయాలంటూ, 2019 వరకు జర్నలిజానికే దూరంగా ఉండాలంటూ నాకు బెదిరింపులు వస్తున్నాయి. నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు. నాపై ఐటీ దాడులు, ఈడి దాడులు చేయించేందుకు కాచుకుకూర్చున్నారట’ అంటూ సీనియర్ టెలివిజన్ జర్నలిస్ట్ బార్ఖాదత్ గురువారం మధ్యాహ్నం ట్విట్టర్లో క్లుప్తంగా తాను ఎదుర్కొంటున్న బెదిరింపుల గురించి మొదటిసారి బయటపెట్టారు. శుక్రవారం ‘న్యూస్‌క్లిక్’ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాలను మరింత వివరింగా చెప్పారు. ఉన్నతస్థాయి సమావేశం ‘ఇటీవల బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న ఓ మిత్రుడి నా ఇంటికి వచ్చారు. జర్నలిస్ట్‌గా బార్ఖాదత్ నోరుమూహించడం ఎలా ? అన్న అంశంపై ప్రభుత్వం పెద్దలు, పార్టీ పెద్దలు దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమై చర్చలు జరిపినట్లు ఆ మిత్రుడు చెప్పారు. ఆమె ఎవరితో ఉంటున్నారు? ఆమె ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరితో తిరుగుతున్నారు? ఆమె బ్యాంక్ వివరాలు ఏమిటీ? లాంటి ప్రశ్నలు ఆ సమావేశంలో వచ్చాయట. ఈ నేపథ్యంలో నా మిత్రులు నా రక్షణకు ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోమని సలహా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి భారత్‌లో వస్తుందని ఊహించలేదు. ప్రభుత్వంలోగానీ, బీజేపీలోగానీ అందరు చెడ్డవాళ్లేమి ఉండరు. బీజేపీలో కూడా మంచి వాళ్లున్నారు. వారిలో అనేక మందిని నేను ఇంటర్వ్యూ చేశాను. అయినా గత ఏడాది కాలంగా ప్రభుత్వానికి మీడియా భయపడి పోతోందని, తాను ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని ఆమె అన్నారు. న్యూస్ ఛానళ్లను అనుమతించడంలో కూడా ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు.‘రిపబ్లిక్ టీవీ’కి మూడు నెలల్లో అన్ని అనుమతులు ఇచ్చారు. ఏడాదిన్నర నుంచి తిరుగుతున్నా రాఘవ్ బెల్కు అనుమతి రాలేదు’ అని ఆమె విమర్శించారు. బార్ఖాదత్ తనకు ఎదురవుతున్న బెదిరింపుల గురించి మళ్లీ ప్రస్థావిస్తూ 2002లో జరిగిన అల్లర్ల గురించి మళ్లీ గుర్తుచేశారు. రాజ్‌దీప్ సర్దేశాయ్, కరన్ థాపర్లతోని కలిసి తాను అల్లర్లను కవర్ చేసిన విషయాన్ని వారింకా మరచిపోయినట్లు లేదంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇంగ్లీష్ లిటరేచర్ డిగ్రీ చేసి, మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్ డిగ్రీ చేసిన బార్ఖాదత్ న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీలో జర్నలిజంలో పట్టాపుచ్చుకున్నారు. 1999లో కార్గిల్ యుద్ధాన్ని ప్రత్యక్షంగా కవర్ చేయడం ద్వారా విశేష ప్రశంసలు పొందిన ఆమెకు పద్మశ్రీ, బెస్ట్ యాంకర్‌తో పాటు పలు అవార్డులు వచ్చాయి. -
నా కదలికలపై నిఘా కొనసాగుతోంది
-
ఆర్నబ్ బాటలో మరో సీనియర్ జర్నలిస్ట్
న్యూఢిల్లీ: ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానల్ 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న ఆర్నబ్ గోస్వామి బాటలో మరో సీనియర్ జర్నలిస్ట్ నడిచారు. ఎన్డీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్కా దత్ రాజీనామా చేశారు. ప్రైమ్‌టైమ్ షో 'ద న్యూస్ అవర్' ద్వారా పాపులరైన ఆర్నబ్ గోస్వామి సొంతంగా వార్తా చానల్ పెడతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బర్కా దత్ కూడా సొంతంగా వెంచర్ ప్రారంభిస్తారని సమాచారం. బర్కా దత్ సుదీర్ఘకాలం సంస్థలో పనిచేశారని, ఆమె భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షిస్తున్నామని ఎన్డీటీవీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1995లో ఎన్డీటీవీలో చేరిన బర్కా దత్ పలు హోదాల్లో పనిచేశారు. 21 ఏళ్ల పాటు ఆమె నిబద్ధతతో పనిచేశారని, సంస్థ అభివృద్ధికి కృషి చేశారని ఎన్డీటీవీ ప్రశంసించింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా దత్ విస్తృతంగా కవరేజీ ఇచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందజేసి ఆమెను గౌరవించింది. కాగా రాడియా టేప్స్ వ్యవహారంలో ఆమెపై విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. -
రాహుల్, మాల్యా, బర్కాలకు షాక్ ఇచ్చింది వీరే
దేశంలో ప్రముఖులు, సంపన్నుల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిల్ సర్వర్లను హ్యాక్ చేస్తున్న హ్యాకింగ్ బృందాన్ని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, విజయ్ మాల్యా, ప్రముఖ జర్నలిస్టు బర్కా దత్ ల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిళ్ల సర్వర్లు హ్యాక్ చేసింది ఈ బృందమేనని వెల్లడించారు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నేతల అంతర్గత ఈ-మెయిళ్లను బహిర్గతం చేస్తామని లెజియన్ హ్యాకర్లు బృందం పేర్కొంది. బ్యాంకులకు రూ.7వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు బుద్ధి చెప్తామని కూడా హ్యాకర్లు పేర్కొన్నారు. ఈ ఘటనలపై దృష్టి సారించిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు హ్యాకర్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 'లెజియన్' అంటే? ఐదు దేశాల్లో ఉన్న పలువురు వ్యక్తులతో(హ్యాకర్లు) ఏర్పడిన బృందమే లెజియన్. అమెరికా, స్వీడన్, కెనడా, థాయ్ లాండ్, రొమెనియా దేశాల నుంచి వీరందరూ హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. తమ బృందాన్ని మరింత విస్తృత పరచుకునేందుకు ఆసక్తి గల హ్యాకర్లు legion_group@sigaint.orgకు మెయిల్ చేయాలనే ఒక సందేశాన్ని వారు వదిలినట్లు చెప్పారు. అయితే, ఈ హ్యాకర్లకు 'లెజియన్ ఆఫ్ డూమ్ ఆఫ్ ది 1980' బృందానికి ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించారు. 2000వ దశకంలో ప్రముఖుల ఈ-మెయిల్ అకౌంట్ లను హ్యాక్ చేస్తూ బెంబేలెత్తించారు. కానీ, ఇరు బృందాలు హ్యాకింగ్ కు పాల్పడటానికి గల బలమైన కారణం ప్రముఖ ధనికుల అవినీతిని బయటపెట్టడం. లెజియన్ ఎందుకు హ్యాకింగ్ చేస్తోంది? ప్రపంచంలో అవినీతిని బయటపెట్టడం కోసమే లెజియన్ ఏర్పడింది. కానీ, ఈ బృందం అవినీతికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యకలాపాలు ఏవీ ఇప్పటివరకూ బయటకు రాలేదు. లెజియన్ ఎలా పని చేస్తుంది? సాధారణ సర్వర్ల ద్వారా కాకుండా ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారో కనుగొనలేని సర్వర్లు, బ్రౌజర్ల ద్వారా లెజియన్ పని చేస్తోంది. అంటే సాధారణ బ్రౌజర్లైన గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ల ద్వారా కాకుండా 'ది ఆనియన్ రౌటర్(టీఓఆర్)' అనే బ్రౌజర్ ద్వారా వీరు నెట్ ను వినియోగిస్తారు. దీన్నే డార్క్ నెట్ అని కూడా అంటారు. దీన్ని కొంతమంది యాక్టివిస్టులు, జర్నలిస్టులు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి హ్యాకింగ్ సంస్ధలు ఇంకా ఉన్నాయా? అవును. ఇలాంటి సంస్ధలు ఇంకా ఉన్నాయి. 2003లో వివిధ దేశాలకు చెందిన యాక్టివిస్టులు, హ్యాక్టివిస్టులు కలిసి అసోసియేటెడ్ ఇంటర్నేషనల్ నెట్ వర్క్ పేరిట ఓ సంస్ధను ప్రారంభించారు. ఇలాంటి సంస్ధల్లో ఒకరు ఈ పని చేయాలని ఎవరూ సూచించరు. కేవలం తమ వద్ద ఉన్న ఆలోచనలను పంచుకుని వాటిని కార్యరూపం దాల్చేలా చేయడానికి యత్నిస్తారు. ఈ గ్రూపు పెద్ద ఎత్తున ప్రభుత్వ వెబ్ సైట్లు, కార్పొరేట్, మత గ్రూపులకు చెందిన సైట్లను పలుమార్లు క్రాష్ చేశాయి. -
'క్వీన్' ఆత్మకథ
వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా సవాల్ చేసిన హాట్ బ్యూటీ కంగనా రనౌత్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ ఫ్యాషన్ గాళ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా నిరూపించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాతో కూడా 100 కోట్ల వసూళ్లు సాధ్యమే అని నిరూపించిన కంగనా మరో సంచలనానికి రెడీ అవుతోంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కంగనా, తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావటానికి ప్రయత్నిస్తుందట. బర్తాదత్ రాసిన 'ద అన్క్వయిట్ ఇండియా' బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్, ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు కెరీర్ స్టార్టింగ్‌లో తనను ఇబ్బంది పెట్టిన కొన్ని విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.