
కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్
కెరీర్ పరంగానే కాదు. యాక్టింగ్‌వైజ్‌గా కూడా కంగనా రనౌత్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన సినిమా ‘క్వీన్’. వికాశ్ బాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు విమర్శకుల ప్రసంశలూ దక్కాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో రాజ్‌కుమార్ రావ్ నటించారు. ఇప్పుడు ఈ ఇద్దరు నాలుగేళ్ల తర్వాత నటించనున్నారు.
సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందనుందని బాలీవుడ్ టాక్. బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో చిత్రాలను తెరకెక్కించారాయన. ఈ సినిమా షూటింగ్ మార్చిలో స్టార్ట్ కానుందని బీటౌన్ టాక్.