
అందరిలా మనమూ లేమే? అని మానసికంగా ఇబ్బంది పడేవారు బాధపడకుండా ఎవరి ఇండివిడ్యువాలిటీని వారు ఎంజాయ్ చేయాలి. ఎవరి జీవితాన్ని వాళ్లు సెలబ్రేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘మెంటల్ హై క్యా’. కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ కోవెలముడి దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించారు. జూలై 26న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అయింది. ‘మెంటల్ హై క్యా’ టైటిల్‌ను ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (ఐఎస్‌ఎస్) సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఈ చిత్రం టైటిల్ మానసిక సమస్యలతో బాధపడేవారిని కించపరిచే విధంగా ఉందని ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ సినిమా టైటిల్‌లో స్వల్ప మార్పులు చేసి ‘జడ్జిమెంటల్ హై క్యా’ అని పేరు మార్చారు చిత్రబృందం. ఈ విషయాన్ని ఏక్తా కపూర్ స్పష్టం చేస్తూ – ‘‘ఈ చిత్రం మానసికంగా ఇబ్బంది పడుతున్నవారిని తక్కువ చేసేలా ఉండదు. అలాగే టైటిల్‌తో ఎవరి సెంటిమెంట్స్‌నీ హర్ట్ చేయాలనే ఉద్దేశం మాకు లేనే లేదు. ఈ సినిమాలో మానసిక సమస్యలను సెన్సిటివ్‌గా డీల్ చేశాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment