అసలు సంగతి దాచేసి... | Kajal Aggarwal's new Hindi film will begin in August. | Sakshi
Sakshi News home page

అసలు సంగతి దాచేసి...

Published Thu, Jun 22 2017 12:38 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అసలు సంగతి దాచేసి... - Sakshi

అసలు సంగతి దాచేసి...

కథేంటి? అందులో ఆమె పాత్ర ఏంటి? హీరో ఎవరు? వంటి విషయాలేవీ కాజల్‌ అగర్వాల్‌ చెప్పడం లేదు. అసలు సంగతులన్నీ దాచేసి ‘ఓ బడా బాలీవుడ్‌ సినిమాకి నేను సంతకం చేశానోచ్‌’ అని చెబుతున్నారామె. ఎవరి పక్కన ఏ సినిమాలో ఛాన్సొచ్చింది? అని కాజల్‌ను ప్రశ్నిస్తే... ‘‘సరైన సమయం, సందర్భంలో మీ ప్రశ్నలకు సమాధానం చెబుతా’’ అంటున్నారు.

‘‘నేను నటించబోయే కొత్త హిందీ సినిమా ఆగస్టులో ప్రారంభం అవుతుంది. చాలా పెద్ద సినిమా. అందులో ఓ ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నా’’ అన్నారు కాజల్‌. ఈ హిందీ సినిమాతో పాటు ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌లోనూ కాజల్‌ నటించడం దాదాపు ఖాయమే. ఆ సినిమా చిత్రీకరణ సైతం ఆగస్టులోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారీ చందమామ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement