క్వీన్‌గా కాజల్‌ | Kajal Aggarwal in Hindi Queen remake | Sakshi
Sakshi News home page

క్వీన్‌గా కాజల్‌

Published Sun, Aug 27 2017 2:52 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

క్వీన్‌గా కాజల్‌

క్వీన్‌గా కాజల్‌

తమిళసినిమా: నటి కాజల్‌ అగర్వాల్‌ టైమ్‌ ఇప్పుడు వెలిగిపోతోందనవచ్చు. ఆ మధ్య తెలుగులో చిరంజీవితో ఖైధీనంబర్‌ 150 చిత్రంలో రొమాన్స్‌ చేసి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత రానాతో నటించిన నేనేరాజు నేనేమంత్రి చిత్రం కూడా మంచి సక్సెస్‌నే అందుకుంది. తాజాగా కోలీవుడ్‌లో అజిత్‌తో తొలిసారిగా జత కట్టిన వివేకం చిత్రం విడుదలై మిశ్రమ స్పందనను పొందుతున్నా, వసూళ్ల పరంగా కుమ్మేస్తోంది. ఇక ఇందులో కాజల్‌అగర్వాల్‌ పాత్రకు, ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. వివేకం చిత్రంలో కాజల్‌ది చాలా కీలకపాత్రగా నిలిచింది.

ఈ చిత్రానికి అందుతున్న ప్రశంసలలో మునిగి తేలుతున్న కాజల్‌అగర్వాల్‌ ఇకపై ఇలాంటి బలమైన పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు అంటున్నారు. తదుపరి విజయ్‌తో నటిస్తున్న మెర్శల్‌ చిత్రం దీపావళికి సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే హిందీ సంచలన చిత్రం క్వీన్‌ రీమేక్‌ గురించి చాలానే ప్రచారం జరిగింది. ఈ చిత్ర దక్షిణాది రీమేక్‌లో కంగణారావత్‌ పాత్రల్లో నటించే నటి ఎవరన్న విషయం గురించి సమంత నుంచి మిల్కీబ్యూటీ తమన్నా వరకూ చాలా మంది నటీమణులు పేరు ప్రచారం జరిగింది. కాగా చివరికి తమిళ, తెలుగు భాషల్లో క్వీన్‌గా నటి కాజల్‌అగర్వాల్‌ నటించనున్నట్లు తాజా సమాచారం. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు కోలీవుడ్‌లో సక్సెస్‌ కోసం పాకులాడిన కాజల్‌అగర్వాల్‌ ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement