
హైదరాబాద్: టాలీవుడ్ చందమామ, నటి కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. జూన్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న కాజల్‌కు సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లారుకు వనక్కం అంటూ కాజల్ నమస్కారం పెట్టారు. కాజల్ లీడ్ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్యారిస్ ప్యారిస్’.. సీనియర్ నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హిందీ ‘క్వీన్’కు తమిళ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాజల్ బర్త్‌డే కానుకగా మూవీ మేకింగ్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. హిందీలో కంగనా రనౌత్ నటనకు విమర్శల ప్రశంసలు అందుకున్న ‘క్వీన్’ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్యారిస్ ప్యారిస్ తప్పక చూడాలంటూ ప్రేక్షకులను నటి కాజల్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment