తమిళ రాణి తమన్నా! మరి తెలుగులో...? | Tamanna Tamil queen and who is the telugu queen | Sakshi
Sakshi News home page

తమిళ రాణి తమన్నా! మరి తెలుగులో...?

Published Fri, Nov 25 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

తమిళ రాణి తమన్నా! మరి తెలుగులో...?

తమిళ రాణి తమన్నా! మరి తెలుగులో...?

‘‘తమిళంలో తమన్నా.. మలయాళంలో అమలాపాల్.. కన్నడంలో పరుల్ యాదవ్... ‘క్వీన్’గా సందడి చేయనున్నారు. తెలుగు ‘క్వీన్’ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు’’ అన్నారు త్యాగరాజన్. హిందీలో కంగనా రనౌత్  నటించిన ‘క్వీన్’ సౌతిండియా రీమేక్ హక్కులను తమిళ నటుడు-దర్శక-నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి జంటగా జి. రవికుమార్ దర్శకత్వంలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ సంస్థ నిర్మిస్తున్న ‘రోజ్ గార్డెన్’లో ఓ కాశ్మీర్ టీవీ ఛానల్ అధినేతగా త్యాగరాజన్ కీలక పాత్ర చేస్తున్నారు. గతంలో ‘అంతిమ తీర్పు’, ‘మగాడు’, ‘స్టేట్ రౌడీ’ల్లో నటించిన ఆయన మూడు దశాబ్దాల తర్వాత నటిస్తున్న తెలుగు చిత్రమిది. ప్రస్తుతం శంషాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది.

మీడియాతో త్యాగరాజన్ మాట్లాడుతూ - ‘‘తెలుగు ‘క్వీన్’ రీమేక్‌కి అనీశ్ కురువిల్లా... తమిళ, మలయాళ చిత్రాలకు రేవతి, కన్నడ చిత్రానికి ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహిస్తారు. నాలుగు భాషల్లోనూ నేనే నిర్మిస్తా. నాలుగు భాషల్లోనూ రెండో హీరోయిన్ అమీ జాక్సన్. ఇక, మా అబ్బాయి ప్రశాంత్ హీరోగా నా స్వీయ దర్శకత్వంలో ఓ హిందీ సినిమా నిర్మిస్తున్నా. త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా చేస్తాడు’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement