తెలుగు రాణీ తమన్నాయే
ప్రతి మెతుకుపై తినేవాళ్ల పేరు రాసుంటుందని ఓ సామెత. ఏయే పాత్రల్లో ఎవరెవరు నటించాలనేది కూడా దేవుడు రాసుంటాడనుకోవాలేమో! ఎందుకంటే... హిందీ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్‌లో మెయిన్ లీడ్‌గా ముందు తమన్నా పేరే వినిపించింది. కొన్నాళ్లకు తెలుగులోనూ ఆమె నటిస్తారన్నారు. ఏమైందో ఏమో... తమిళ రీమేక్‌లో ‘క్వీన్’గా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారు. కానీ, తెలుగులో రాణీగా తమన్నానే కన్ఫర్మ్ చేశారు దర్శక–నిర్మాతలు.
తెలుగు వెర్షన్‌కి ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కార గ్రహీత, ‘షో, మిస్సమ్మ’ సినిమాల ఫేమ్ నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. ముంబై వ్యాపారవేత్త మను కుమారన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘క్వీన్’ సౌత్ రీమేక్స్ అన్నిటికీ ఆయనే నిర్మాత. ‘‘ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తమన్నా మెయిన్ లీడ్‌గా నీలకంఠ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తాం. త్వరలో చిత్రీకరణ మొదలవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయాలనేది మా ప్లాన్’’ అని మను కుమారన్ తెలిపారు. బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ ఇందులో సెకండ్ లీడ్‌గా నటించనున్నారు.