
టిప్స్ ప్లీజ్!
‘‘హిందీ ‘క్వీన్’ కంగనా రనౌత్‌ను కాపీ చేయడం ఇష్టం లేదు. కానీ, ఆమెను టిప్స్ అడుగుతా’’ అంటున్నారు తమన్నా. ‘క్వీన్’ తమిళ రీమేక్‌లో తమన్నా హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. అందులో ఎలా నటిస్తే బాగుంటుందనే విషయమై కంగనాను టిప్స్ అడుగుతారట! ‘‘ఇప్పటివరకూ కంగనాను కలవలేదు, మాట్లాడనూ లేదు. కానీ, ‘క్వీన్’లో ఆమె నటనంటే నాకు ఇష్టం. కంగనా కెరీర్‌లో ‘క్వీన్’ ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. ఆమెతో ఆ పాత్ర గురించి మాట్లాడితే నాకు హెల్ప్ అవుతుంది’’ అన్నారు తమన్నా. నటి రేవతి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి మరో నటి సుహాసిని మాటలు రాస్తున్నారు.