తమన్నాకే ఆ ఛాన్స్ దక్కింది..
బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్కు స్టార్ స్టేటస్ అందించిన సినిమా క్వీన్. ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి సౌత్ ఇండస్ట్రీలో ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే క్వీన్ పాత్రకు సరైన నటిని ఎంపిక చేసే విషయంలో దర్శక నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోయారు. ఫైనల్గా క్వీన్ రీమేక్కు తమన్నాను ఫైనల్ చేశారు కోలీవుడ్ నిర్మాతలు.
అలనాటి స్టార్ హీరోయిన్ రేవతి దర్శకత్వంలో క్వీన్ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం క్వీన్ తెలుగు రీమేక్లోనూ తమన్నానే హీరోయిన్గా నటించనుందట. ఉత్తమ విలన్ ఫేం రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి క్వీన్ సినిమాను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత త్యాగరాజన్ అన్ని భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.