డెన్మార్క్ రాణి పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో కానున్న డెన్మార్క్ రాణి మేరీ డొనాల్డ్‌సన్ ఎవరు, ఏంటి అనేదానిపై ఆసక్తి నెలకొంది. అసలు ఎవరీ మేరీ. ఒక సాధారణ యువతి యువరాణిగా , రాచకుటుంబంలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా, ఎలా మారింది. ఈ వివరాలు చూద్దాం.
మాజీ ఆస్ట్రేలియన్ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ , రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్న టాస్మానియాకు చెందిన 28 ఏళ్ల యువతితో, డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ (ఫ్రెడ్) తో పరిచయం ప్రేమ పరిచయం ఒక అద్భుత కథ.
2000, సెప్టెంబరులో ఒక పబ్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. తొలిసారి ఆయనను కలిసినపుడు, షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు డెన్మార్క్ యువరాజు అని తనకు తెలియదని మేరీ 2003లో ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు తాను యువరాణి అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. అలాగే ఫ్రెడ్‌తో మాట కలిసింది మొదలు మాట్లాడుకుంటూనే ఉన్నామంటూ తమ ప్రేమ కథను గుర్తుచేసుకున్నారు. తన ఫోన్ నెంబరు తీసుకోవడం, కలిసిన మరునాడే కాల్ చేయడం లాంటి సంగతులను ముచ్చటించారు. అలాగే ఆమెను చూసిన తొలిచూపులోనే ప్రేమ, తన సోల్‌మేట్‌ను కలిసిన అనుభూతి కలిగిందని ఫ్రెడరిక్ చెప్పడం విశేషం.
ఇదీ చదవండి:
హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా! |
ప్రేమ, వివాహం తరువాత రాచరికపు మర్యాదలకు, గౌరవాలకు భంగం కలగకుండా ప్రవర్తించిందామె. డానిష్ అనర్గళంగా మాట్లాడటంతోపాటు, తన సొంత ఊరిని, భాషను, యాసను మర్చిపోలేదు.అంతేకాదు ప్రిన్సెస్ మేరీ టాస్మానియాకు అద్భుతమైన రాయబారి అని టాస్మానియా ప్రీమియర్ జెరెమీ రాక్‌లిఫ్ ఇటీవల ప్రకటించడం ఇందుకు నిదర్శనం. కోపెన్‌హాగన్‌లోని ఆస్ట్రేలియన్ ప్రవాసులు తమ దేశ బిడ్డ మేరీ డెన్మార్క్ క్వీన్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే తనదైన వ్యక్తిత్వంతో, ప్రగతి శీలంగా ఉంటూ మహిళలు, పిల్లల హక్కులు, గృహహింసకు వ్యతిరేకంగా తన భావాలను పంచుకుంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్నారు. 23 ఏళ్ల తరువాత 51 ఏళ్ల వయసులో డెన్మార్క్ తదుపరి రాణిగా అవతరించబోతున్నారు. ఈ (జనవరి 14,2024) ఆదివారం భర్త ఫ్రెడరిక్ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఆమె రాణి హోదాను దక్కించుకోనున్నారు.
ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?
రాణి మార్గరెట్ -2పదవీ విరమణ
వయసు, అనారోగ్య కారణాలు, 2023 ఫిబ్రవరిలో తన వెన్నెముకకు జరిగిన ఆపరేషన్ తదితర కారణాల రీత్యా దేశ సింహాసనం నుంచి తప్పుకుంటూ డెన్మార్క్ రాణి మార్గరెట్ -2 (83) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 14తో రాణిగా 52 ఏళ్లు పూర్తి కాబోతున్నాయని, అదే రోజున సింహాసనాన్ని వీడనున్నట్టు ప్రకటించారు. కొత్త ఏడాది రోజు తన నిర్ణయాన్ని ప్రకటించగానే దేశ ప్రజలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే తన వారసుడిగా కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడెరిక్ కిరీటాన్ని ధరిస్తాడని కూడా అదే రోజు వెల్లడించారు.
"నేను ఎక్కువ వెలుగులో ఉంటాను కాబట్టి, కొంతమంది నా భర్త నా ప్రభావంలో ఉన్నారని అనుకుంటారు కానీ మేము అలా కాదు. ఒకరి నీడలో మరొకరం ఉండం, నిజానికి ఆయనే నా వెలుగు’’ - ప్రిన్స్ ఫ్రెడరిక్ ( 2017) బయోగ్రఫీలో మేరీ రాశారు.
ఫిబ్రవరి 5, 1972న టాస్మానియా రాజధాని హోబర్ట్‌లో జన్మించారు మేరీ. ఆమె తండ్రి గణితశాస్త్ర ప్రొఫెసర్ , ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. గుర్రపు స్వారీ, ఆటల్లో మంచి ప్రవేశం ఉంది. లా అండ్ కామర్స్ చదివి మెల్బోర్న్, సిడ్నీలో ప్రకటన రంగంలో కరియర్‌ను స్టార్ట్ చేసింది.అలా ఆస్ట్రేలియాలో అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నప్పుడు, 2000లో వేసవి ఒలింపిక్స్‌లో సిడ్నీలోని స్లిప్ ఇన్ బార్‌లో స్నేహితులతో కలిసి బయటికి వెళ్లినప్పుడు అప్పటి 34 ఏళ్ల ఫ్రెడరిక్‌ను కలుసుకుంది.ఈ జంట అధికారికంగా 2003 అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్నారు . అలాగే మే 14, 2004న కోపెన్‌హాగన్ కేథడ్రల్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ప్రిన్స్ క్రిస్టియన్( 18) ప్రిన్సెస్ ఇసాబెల్లా(16), కవల పిల్లలు ప్రిన్స్ విన్సెంట్ ప్రిన్సెస్ జోసెఫిన్ (13) ఉన్నారు.
ఇదీ చదవండి: ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్
Comments
Please login to add a commentAdd a comment