Margrethe 2
-
డెన్మార్క్ రాజుగా పదో ఫ్రెడరిక్
కోపెన్‌హేగెన్: డెన్మార్క్ రాజ సింహాసనాన్ని పదో ఫ్రెడరిక్ ఆదివారం అధిష్టించారు. రాణి రెండో మార్గరెట్ (83) అనారోగ్య కారణాలతో సింహాసనం వీడుతున్నట్లు కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి. రాజధాని కోపెన్‌హేగెన్‌లోని జరిగిన కేబినెట్ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేశారు. తర్వాత ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్ రాజభవనం బాల్కనీ నుంచి పదో ఫ్రెడరిక్‌ను రాజుగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడారు. ‘గాడ్ సేవ్ ది కింగ్’అని చెబుతూ రాణి అక్కడి నుంచి ని్రష్కమించారు. రెండో మార్గరెట్‌తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ఫ్రెడరిక్ భార్య క్వీన్ మేరీ రూపంలో డెన్మార్క్‌కు ఇద్దరు రాణులుంటారు. ఫ్రెడరిక్, మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్ (18) యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు. డెన్మార్క్ రాజరికం యూరప్‌లోనే అత్యంత పురాతనమైంది. 10వ శతాబ్దంలో వైకింగ్ రాజు గోర్డ్ ది ఓల్డ్ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. 1146లో అప్పటి డెన్మార్క్ రాజు మూడో ఎరిక్ లామ్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి, సన్యాసం తీసుకున్నారు. డెన్మార్క్ రాజుగా తొమ్మిదో ఫ్రెడరిక్ 1947 నుంచి 1972వరకు కొనసాగారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్ సింహాసనం అధిíÙ్ఠంచారు. దాదాపు 52 ఏళ్లపాటు రాణిగా కొనసాగారు. -
పబ్‌లో తొలి ప్రేమ ఇపుడు డెన్మార్క్ రాణిగా..అద్భుత లవ్ స్టోరీ
డెన్మార్క్ రాణి పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో కానున్న డెన్మార్క్ రాణి మేరీ డొనాల్డ్సన్ ఎవరు, ఏంటి అనేదానిపై ఆసక్తి నెలకొంది. అసలు ఎవరీ మేరీ. ఒక సాధారణ యువతి యువరాణిగా , రాచకుటుంబంలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా, ఎలా మారింది. ఈ వివరాలు చూద్దాం. మాజీ ఆస్ట్రేలియన్ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ , రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్న టాస్మానియాకు చెందిన 28 ఏళ్ల యువతితో, డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ (ఫ్రెడ్) తో పరిచయం ప్రేమ పరిచయం ఒక అద్భుత కథ. 2000, సెప్టెంబరులో ఒక పబ్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. తొలిసారి ఆయనను కలిసినపుడు, షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు డెన్మార్క్ యువరాజు అని తనకు తెలియదని మేరీ 2003లో ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు తాను యువరాణి అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. అలాగే ఫ్రెడ్‌తో మాట కలిసింది మొదలు మాట్లాడుకుంటూనే ఉన్నామంటూ తమ ప్రేమ కథను గుర్తుచేసుకున్నారు. తన ఫోన్ నెంబరు తీసుకోవడం, కలిసిన మరునాడే కాల్ చేయడం లాంటి సంగతులను ముచ్చటించారు. అలాగే ఆమెను చూసిన తొలిచూపులోనే ప్రేమ, తన సోల్‌మేట్‌ను కలిసిన అనుభూతి కలిగిందని ఫ్రెడరిక్ చెప్పడం విశేషం. ఇదీ చదవండి: హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా! ప్రేమ, వివాహం తరువాత రాచరికపు మర్యాదలకు, గౌరవాలకు భంగం కలగకుండా ప్రవర్తించిందామె. డానిష్ అనర్గళంగా మాట్లాడటంతోపాటు, తన సొంత ఊరిని, భాషను, యాసను మర్చిపోలేదు.అంతేకాదు ప్రిన్సెస్ మేరీ టాస్మానియాకు అద్భుతమైన రాయబారి అని టాస్మానియా ప్రీమియర్ జెరెమీ రాక్లిఫ్ ఇటీవల ప్రకటించడం ఇందుకు నిదర్శనం. కోపెన్‌హాగన్‌లోని ఆస్ట్రేలియన్ ప్రవాసులు తమ దేశ బిడ్డ మేరీ డెన్మార్క్ క్వీన్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే తనదైన వ్యక్తిత్వంతో, ప్రగతి శీలంగా ఉంటూ మహిళలు, పిల్లల హక్కులు, గృహహింసకు వ్యతిరేకంగా తన భావాలను పంచుకుంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్నారు. 23 ఏళ్ల తరువాత 51 ఏళ్ల వయసులో డెన్మార్క్ తదుపరి రాణిగా అవతరించబోతున్నారు. ఈ (జనవరి 14,2024) ఆదివారం భర్త ఫ్రెడరిక్ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఆమె రాణి హోదాను దక్కించుకోనున్నారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి? రాణి మార్గరెట్ -2పదవీ విరమణ వయసు, అనారోగ్య కారణాలు, 2023 ఫిబ్రవరిలో తన వెన్నెముకకు జరిగిన ఆపరేషన్ తదితర కారణాల రీత్యా దేశ సింహాసనం నుంచి తప్పుకుంటూ డెన్మార్క్ రాణి మార్గరెట్ -2 (83) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 14తో రాణిగా 52 ఏళ్లు పూర్తి కాబోతున్నాయని, అదే రోజున సింహాసనాన్ని వీడనున్నట్టు ప్రకటించారు. కొత్త ఏడాది రోజు తన నిర్ణయాన్ని ప్రకటించగానే దేశ ప్రజలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే తన వారసుడిగా కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడెరిక్ కిరీటాన్ని ధరిస్తాడని కూడా అదే రోజు వెల్లడించారు. "నేను ఎక్కువ వెలుగులో ఉంటాను కాబట్టి, కొంతమంది నా భర్త నా ప్రభావంలో ఉన్నారని అనుకుంటారు కానీ మేము అలా కాదు. ఒకరి నీడలో మరొకరం ఉండం, నిజానికి ఆయనే నా వెలుగు’’ - ప్రిన్స్ ఫ్రెడరిక్ ( 2017) బయోగ్రఫీలో మేరీ రాశారు. ఫిబ్రవరి 5, 1972న టాస్మానియా రాజధాని హోబర్ట్‌లో జన్మించారు మేరీ. ఆమె తండ్రి గణితశాస్త్ర ప్రొఫెసర్ , ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. గుర్రపు స్వారీ, ఆటల్లో మంచి ప్రవేశం ఉంది. లా అండ్ కామర్స్ చదివి మెల్బోర్న్, సిడ్నీలో ప్రకటన రంగంలో కరియర్‌ను స్టార్ట్ చేసింది.అలా ఆస్ట్రేలియాలో అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నప్పుడు, 2000లో వేసవి ఒలింపిక్స్‌లో సిడ్నీలోని స్లిప్ ఇన్ బార్లో స్నేహితులతో కలిసి బయటికి వెళ్లినప్పుడు అప్పటి 34 ఏళ్ల ఫ్రెడరిక్‌ను కలుసుకుంది.ఈ జంట అధికారికంగా 2003 అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్నారు . అలాగే మే 14, 2004న కోపెన్హాగన్ కేథడ్రల్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ప్రిన్స్ క్రిస్టియన్( 18) ప్రిన్సెస్ ఇసాబెల్లా(16), కవల పిల్లలు ప్రిన్స్ విన్సెంట్ ప్రిన్సెస్ జోసెఫిన్ (13) ఉన్నారు. ఇదీ చదవండి: ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్ -
డెన్మార్క్ రాణి మార్గరేట్-II పదవీ విరమణపై కీలక ప్రకటన
కోపెన్హాగన్: న్యూఇయర్ రోజున డెన్మార్క్ రాణి మార్గరేట్-II(83) కీలక ప్రకటన చేశారు. జనవరి 14న తాను పదవీ విరమణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తన కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్కు తన బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. యూరప్‌లోనే అత్యధికంగా 52 ఏళ్లుగా పదవిలో ఉన్న చక్రవర్తిగా మార్గరేట్-II నిలిచారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణం తర్వాత యూరప్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాణి మార్గరేట్. డెన్మార్క్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే సాంప్రదాయ నూతన సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆమె తన వయస్సు, ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ ఆశ్చర్యకరంగా పదవీ విరమణ ప్రకటన చేశారు. డెన్మార్క్‌లో 1972లో సింహాసనం అధిరోహించిన రాణి మార్గరేట్.. చక్రవర్తిగానే గాక వివిధ కళల్లో ఉన్న ప్రతిభతో సాధారణ ప్రజల్లో ప్రజాధరణ పొందారు. ఆమె హయాంలోనే డెన్మార్క్ సహా ప్రపంచంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచీకరణ, 1970, 1980నాటి ఆర్థిక సంక్షోభాలు, 2008 నుంచి 2015 మధ్య తీవ్ర కరువు, కరోనా మాహమ్మారి వంటి పరిస్థితులను డెన్మార్క్ ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ డెన్మార్ను ఐక్యంగా ఉంచడంలో ఆమె సఫలం అయ్యారు. మెరిసే నీలి కళ్లతో నిత్యం ఉత్సాహంగా ఉండే మార్గరేట్.. అనేక కళల్లో నిష్ణాతురాలు. పేయింటింగ్, కాస్ట్యూమ్, సెట్ డిజైనర్‌గా రాయల్ డానిష్ బ్యాలెట్, రాయల్ డానిష్ థియేటర్‌తో కలిసి పనిచేశారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్వీడిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. "ఆల్ మెన్ ఆర్ మోర్టల్"తో సహా అనేక నాటకాలను కూడా ఆమె అనువదించారు. ఇదీ చదవండి: మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్ -
డెన్మార్క్ యువరాజు అస్తమయం
కోపెన్హాగన్, డెన్మార్క్ : డెన్మార్క్ యువరాజు హెన్రిక్(83) దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు రాజ నివాసమైన ఫ్రెండెన్స్బర్గ్ క్యాసిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. 2017 సెప్టెంబర్‌లో ఆయనకు డెమన్షియా వ్యాధి సోకింది. గత నెల 26న ఊపిరితిత్తుల ఇనెఫెక్షన్తో హెన్నిక్ ఆసుపత్రిలో చేరారు. దీనిపై స్పందించిన రాజప్రసాదం.. యువరాజు హెన్రిక్ తన ఆఖరి రోజులు గడిపేందుకు త్వరలో ప్యాలెస్‌కు రానున్నట్లు పేర్కొంది. 1934లో జన్మించిన హెన్రిక్.. డానిష్ రాజ కుటుంబానికి చెందిన యువరాణి మార్గరెట్ 2ను 1967లో వివాహం చేసుకున్నారు. 1972లో మార్గెరెట్ రాణి అయ్యారు. అయితే, హెన్రిక్‌ను రాజుగా ఆమె ప్రకటించలేదు. దీనిపై ఆయన పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. 2016లో పబ్లిక్ సర్వీసు నుంచి తప్పుకుంటూ యువరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తాను మరణించిన తర్వాత భార్య పక్కనే పూడ్చిపెట్టొద్దని కోరారు. రాణితో సమానంగా తనను ఎప్పుడూ చూడలేదని, మరణించిన తర్వాత కూడా అలాంటి హోదా తనకు వద్దని తెగేసి చెప్పారు. రాజ సంప్రదాయాల ప్రకారం.. రాజు, రాణి మరణించిన అనంతరం పక్కపక్కనే పూడ్చిపెడతారు. యువరాజును అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై ప్యాలెస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.