అమీర్ తో నటించడమే లక్ష్యం కాదు: కంగనా | Working with Aamir Khan not my goal: Kangana Ranuat | Sakshi
Sakshi News home page

అమీర్ తో నటించడమే లక్ష్యం కాదు: కంగనా

Published Mon, Apr 7 2014 6:24 PM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

అమీర్ తో నటించడమే లక్ష్యం కాదు: కంగనా - Sakshi

అమీర్ తో నటించడమే లక్ష్యం కాదు: కంగనా

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో నటించడమే లక్ష్యం కాదని 'క్వీన్' కంగనా రనౌత్ అన్నారు

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో నటించడమే లక్ష్యం కాదని 'క్వీన్' కంగనా రనౌత్ అన్నారు. క్వీన్ చిత్రంతో అభిమానులు, సహ నటుల్నే కాకుండా విమర్శకుల్ని సైతం కంగనా మెప్పించారు. క్వీన్ లో నటన చూసిన తర్వాత కంగనతో నటించాలని అమీర్ ఖాన్ మనసులో మాట బయటపెట్టారు.
 
అమీర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇప్పటికిప్పుడే ఓ చిత్రంలో నటించడం కుదరని పని అన్నారు. అందర్ని ఆకట్టుకునే కథ దొరికితే, ఇద్దరం కలిసి నటించే అవకాశం కోసం వేచి చూస్తానని కంగనా తెలిపారు. క్వీన్ చిత్రం తర్వాత కంగనా రివాల్వర్ రాణి చిత్రంలో నటించింది. రివాల్వర్ రాణి ఏప్రిల్ 25 తేదిన విడుదల కానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement