క్వీన్ లో మిల్కీబ్యూటీతో ఎమీజాక్సన్ | Amy Jackson Tamannaah to play Tamil Queen! | Sakshi

క్వీన్ లో మిల్కీబ్యూటీతో ఎమీజాక్సన్

Dec 1 2016 1:25 AM | Updated on Sep 4 2017 9:32 PM

క్వీన్ లో మిల్కీబ్యూటీతో ఎమీజాక్సన్

క్వీన్ లో మిల్కీబ్యూటీతో ఎమీజాక్సన్

క్వీన్ లో మిల్కీబ్యూటీతో ఇంగ్లీష్ భామ ఎమీజాక్సన్ నటించనున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

క్వీన్ లో మిల్కీబ్యూటీతో ఇంగ్లీష్ భామ ఎమీజాక్సన్ నటించనున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. హిందీ చిత్రం క్వీన్ గురించి తెలియని సినీ ప్రియులుండరనే చెప్పవచ్చు. 2014లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం. అంతే కాదు ఆమెకు జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డులను అందించిన చిత్రం. ఈ చిత్ర దక్షిణాది భాషల రీమేక్ హక్కులను సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు త్యాగరాజన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర రీమేక్‌లో కంగనారనౌత్ పాత్రలో నటించే నటి ఎవరన్నది ఆసక్తిగా మారింది.
 
  చెన్నై చిన్నది త్రిష, సమంత ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్ల పేర్లు మీడియాలో హల్‌చల్ చేశారుు. మరి కొందరైతే ఆ పాత్రలో నటించడానికి వెనుకాడినట్లు సమాచారం. దక్షిణాది క్వీన్‌గా నటి తమన్న ఎంపికై నట్లు తాజా సమాచారం. అంతే కాదు ఆమెతో పాటు నటి ఎమీజాక్సన్ నటించనున్నారన్న టాక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. క్వీన్ చిత్రంలో విదేశాల్లో నటి కంగనా రనౌత్‌కు సాయం చేసే నటి లిసా హెడెన్ పోషించారు. ఈ పాత్రను దక్షిణాదిలో ఇంగ్లీష్ భామ ఎమీజాక్సన్ పోషించనున్నారనే టాక్ వినిపిస్తోంది. తమన్న ప్రస్తుతం శింబుకు జంటగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు.
 
  విశాల్‌తో నటించిన కత్తిసండై సంక్రాంతికి విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా క్వీన్ చిత్రం వరించింది. ఇక ఎమీజాక్సన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత క్వీన్ చిత్రంలో మిల్కీబ్యూటీతో కలిసి నటించడానికి సిద్ధం అవుతోందని సమాచారం. ఇక పోతే ఈ చిత్రానికి ప్రముఖ నటి రేవతి దర్శకత్వం వహించనుండగా, మరో ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం సంభాషణలను అందించనున్నారు. ఒకే చిత్రంలో నలుగురు హీరోTamannaahన్లు పనిచేయనుండడం అరుదైన విషయంగా భావించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement