ఓ పాతిక వదిలేశా! | I rejected on 25movies : Kangna Ranaut | Sakshi
Sakshi News home page

ఓ పాతిక వదిలేశా!

Published Sat, Apr 26 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

ఓ పాతిక వదిలేశా!

ఓ పాతిక వదిలేశా!

‘క్వీన్’, రివాల్వర్ రాణి’లాంటి నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి, తనలో హాట్ గాళ్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా ఉందని కంగనా రనౌత్ నిరూపించుకున్నారు. సినిమా మొత్తాన్ని సునాయాసంగా తన భుజాల మీద నడిపించేస్తారనే నమ్మకాన్ని దర్శక, నిర్మాతలకు కలగజేశారు ఈ హాట్ బ్యూటీ. దీని గురించి కంగనా మాట్లాడుతూ -‘‘ఎవరికైనా సరే బలమైన పాత్రలు చేయాలని ఉంటుంది. కానీ, దర్శక, నిర్మాతలు నమ్మాలి. నమ్మి అవకాశం ఇస్తే, ఎవరైనా నిరూపించుకుంటారు. నన్ను నమ్మి క్వీన్, రివాల్వర్ రాణి చిత్రాలకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి, నా ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. ఏదేమైనా ఈ చిత్రాలిచ్చిన ఉత్సాహంతో నాకిప్పుడు టైటిల్ రోల్స్‌తో రూపొందే చిత్రాలే ఎక్కువగా చేయాలని ఉంది.
 
  ఆ తరహా చిత్రాలు ఈ మధ్య కుప్పలు తెప్పలుగా వచ్చాయి. కానీ, ఏది పడితే అది చేస్తే ఇమేజ్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, దాదాపు 25 సినిమాలు తిరస్కరించా’’ అని చెప్పారు. మీరు అదృష్టాన్ని నమ్ముతారా అనే ప్రశ్నకు సమాధానంగా -‘‘అస్సలు నమ్మను. నా కష్టాన్ని మాత్రమే నమ్ముతాను. ఒకవేళ అదృష్టం కనుక నావైపు ఉండి ఉంటే నా మొదటి సినిమానే విజయం సాధించి ఉండేది. కానీ, అలా జరగలేదు కదా. విజయం తాలూకు రుచి ఎలా ఉంటుందో చూడటానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది. అది కూడా నేను క్లిష్టమైన పాత్రలను కష్టపడి చేయడంవల్లే’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement