
కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకూ సమ స్యలు లేనివాళ్లు ఉండరు. అయితే ఆ సమస్యను ఎవరు ఎలా తీసుకుంటున్నారు? అనేది ముఖ్యం. కొందరు లైట్ తీసుకుంటారు. కొంతమంది టెన్షన్ పడతారు. తమన్నా అయితే ఏం చేస్తారో తెలుసా... జస్ట్ మూడు సూత్రాలు పాటిస్తారు. ‘‘ప్రతి సమస్యను పరిష్కరింటానికి మూడు సూత్రాలు ఉంటాయి.
మొదటిది ఆ సమస్యను అంగీకరించటం, రెండోది దాన్ని మార్చగలగటం, మూడోది వదిలిపెట్టేయడం. ‘ఒకవేళ నువ్వు ఆ సమస్యను అంగీకరించలేకపొతే మార్చేయ్, దాన్ని మార్చలేకపోతే వదిలేయ్’’ అన్నారు తమన్నా. చాలా బాగా చెప్పారు కదండీ. మనమూ ఇవే సూత్రాలను పాటించడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతం హిందీ హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘క్వీన్ వన్స్‌ఎగైన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు తమన్నా.