క్వీన్ మనసు గెలుచుకున్న తమన్నా!
‘ఐయామ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తమన్నా...’ ఈ మాట అన్నది ఎవరో తెలుసా? క్వీన్ ఆఫ్ బాలీవుడ్ కంగనా రనౌత్. ‘ఫ్యాషన్’, ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’ తదితర చిత్రాలతో పలువురు హీరోయిన్లకు కంగనా ఫేవరెట్ హీరోయిన్ అయ్యారు. స్టోరీ సెలక్షన్‌లో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. ఇంతకీ కంగనా ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? తమన్నా. ఈ మిల్క్ బ్యూటీ తాజా సినిమా ‘అభినేత్రి’ హిందీ వెర్షన్ సాంగ్ లాంచ్‌కి అతిథిగా హాజరైన కంగనా రనౌత్.. ‘‘నేను తమన్నా సినిమాలు చూశాను.
ఆమె నటనంటే ఇష్టం. దెయ్యం ఆవహించినట్టుగా ఎక్కడా ఆమెను నేను చూడలేదు. అందుకే ‘అభినేత్రి’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. మరో సినిమా షూటింగ్‌లో ఉండడంతో ఈ సాంగ్ లాంచ్‌కి తమన్నా హాజరు కాలేదు. అయితే కంగనా తనకు ఫేవరెట్ అని చెప్పిన విషయం ఆ నోటా ఈ నోటా తమన్నాకి చేరింది. అది విని ఈ బ్యూటీ ఫుల్ ఖుష్ అయ్యారట.