ఆ సినిమా చూస్తే... నన్నెవరు చేసుకుంటారు? | who marry me | Sakshi
Sakshi News home page

ఆ సినిమా చూస్తే... నన్నెవరు చేసుకుంటారు?

Published Sat, Apr 12 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

ఆ సినిమా చూస్తే...  నన్నెవరు చేసుకుంటారు?

ఆ సినిమా చూస్తే... నన్నెవరు చేసుకుంటారు?

పెళ్లీడుకొచ్చిన ఏ అమ్మాయి, అబ్బాయి అయినా తమలో ఉన్న ప్లస్ పాయింట్స్‌ను బయటికి చెప్పుకుంటారు. మైనస్సులను మనసులోనే దాచేసుకుంటారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనివాళ్లు ఈ రెండింటిలో  ఏ కోణాన్నయినా నిర్భయంగా బయటపెట్టేస్తారు. ఆ సంగతి అలా ఉంచితే, పెళ్లీడులో ఉన్న కంగనా రనౌత్ మాత్రం తాను నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రాణి’ చూస్తే, తననెవరూ పెళ్లి చేసుకోరని ఓ ప్రకటన ఇచ్చేశారు.
 
ఎందుకలా అంటున్నారు? అనడిగితే.. సినిమా చూడాల్సిందే అని పేర్కొన్నారు. సినిమా ప్రచారం కోసమే కంగనా ఇలా అంటున్నారేమో అనుకుంటే, తన వ్యక్తిగత జీవితానికి మైనస్ అయ్యేలా ఎందుకు మాట్లాడతారు? సో.. ఈ సినిమాలో కంగనా రొటీన్‌కి భిన్నంగా, చెయ్యకూడని పాత్ర ఏదో చేసి ఉంటారని ఊహించవచ్చు. బాలీవుడ్ టాక్ ప్రకారం.. ఇందులో ఆమె ఓ రాజకీయ నాయకురాలి పాత్ర చేశారని, ఓ సినిమా హీరో మీద మనసు పడతారని తెలిసింది.
 
 కంగనాపై పగ తీర్చుకోవడానికి ప్రత్యర్థులు ఆ సినిమా హీరోని కిడ్నాప్ చేస్తే, అతణ్ణి కాపాడుకోవడానికి ఆమె రంగంలోకి దిగుతారట. కాబట్టి, ఆమెది చాలా బోల్డ్ కేరక్టర్ అని అర్థమవుతుంది. ఈ పాత్రలో కంగన గ్లామరస్‌గా కనిపించడం మాత్రమే కాదు... వీరోచిత పోరాటాలు కూడా చేశారట. బహుశా కరడు గట్టిన వనితలా కనిపిస్తారేమో. అందుకే, ఈ సినిమా చూశాక తననెవరూ పెళ్లి చేసుకోవడా నికి ముందుకు రారని చెప్పి ఉంటారు.
 
 ఇటీవల కంగన నటించిన ‘క్వీన్’ విజయపథంలో దూసుకెళుతోంది. నటిగా ఆమెకు మంచి మార్కులు తెచ్చిపెట్టిందీ సినిమా. ‘రివాల్వర్ రాణి’ రెట్టింపు పేరు తెస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు కంగనా రనౌత్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement