దక్షిణాది చిత్రాలకు నో
టీనగర్: జాతీయ అవార్డు తర్వాత తమిళ చిత్రావకాశాలు అధికంగా వస్తున్నాయని నటి కంగనా రణావత్ తెలిపారు. ఫ్యాషన్, క్వీన్ అనే రెండు చిత్రాలకు వరుసగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ప్రముఖ నటి కంగనా రణావత్. ‘దామ్‌ధూం’ చిత్రం లో జయంరవికి జంటగా నటించారు. ఆ తర్వాత ఆమెకు చిత్రావకాశాలు లభించలేదు. ‘క్వీన్’ చిత్రం జాతీయ అవార్డు పొందిన తర్వాత అనేక తమిళ చిత్ర అవకాశాలు వస్తున్నట్లు కంగ నా రణావత్ తెలిపారు. తెలుగు చిత్రరంగం నుంచి కూడా అనేక అవకాశాలు వ స్తున్నట్లు తెలిపారు. అన్నీ కథానాయకి ప్రాముఖ్యత కలిగిన చిత్రాలయినప్పటికీ కంగనా రణావత్ ఇంతవరకు దక్షిణ భారత చిత్రాలను ఒప్పుకోనట్లు సమాచారం.