ఇండియన్ సినిమా తెర మీద పీరియాడిక్ సినిమాల హవా కొనసాగుతుంది. హీరోలు మాత్రమే కాదు మంచి కలెక్షన్ స్టామినా ఉన్న హీరోయిన్లు కూడా పీరియాడిక్ డ్రామాల వైపే మొగ్గు చూపుతున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగాన కూడా ఈ జాబితా లో చేరిపోయింది. 1940 లలో జరిగే ఓ రొమాంటిక్ డ్రామాలో నటించనుంది కంగనా. రంగూన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి కంగనా అయితేనే సరైన న్యాయం చేయగలదని భావిస్తున్నాడట దర్శకుడు విశాల్ భరద్వాజ్.
ఈ సినిమా కథ రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పరిస్థితులపై తెరకెక్కనుంది. ఆ సమయంలో ఓ ప్రఖ్యాత నటి, ఆమె గురువు కు మధ్య ఉన్న సంబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే సినిమా కథ అంతా ఓ నటి, ఆమె గురువు, అలాగే ఓ సైనికుడి మధ్య జరుగుతుంది. అంటే ఇప్పటికే ప్రకటించిన కంగనా, సైఫ్, షాహిద్ లు ఈ మూడు పాత్రలోనే కనిపించనున్నారు.
ప్రస్తుతం 'కట్టి బట్టి' సినిమా ప్రచారం లో బిజీగా ఉన్న క్వీన్ ఆ మూవీ విడుదల తరువాత రంగూన్ చిత్రీకరణకు రెడీ అవుతోంది. ఈ లోగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా రంగూన్ టీం పూర్తి చేయనుంది.
40ల నాటి ప్రేమ కథలో కంగనా
Published Wed, Sep 2 2015 8:33 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM
Advertisement
Advertisement