చిక్కుల్లో క్వీన్‌ | The First Big Step towards South Indian Remakes of 'Queen' | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో క్వీన్‌

Published Sat, Jun 10 2017 1:43 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

చిక్కుల్లో క్వీన్‌ - Sakshi

చిక్కుల్లో క్వీన్‌

ప్రారంభానికి ముందే క్వీన్‌ చిత్రం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్‌.

ప్రారంభానికి ముందే క్వీన్‌ చిత్రం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్‌. కంగనారావత్‌ నటించిన ఈ చిత్రం ఆమె స్థాయి పెంచడంతో పాటు అవార్డులను తెచ్చిపెట్టింది. అలాంటి చిత్రాన్ని దక్షిణాధి భాషల్లో నిర్మించే హక్కులను సీనియర్‌ దర్శక నటుడు త్యాగరాజన్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.


ఇందులో క్వీన్‌ పాత్రలో నటించే నటి ఎవరన్న విషయం ఆసక్తిగా మారింది.చివరకు మిల్కీబ్యూటీ తమన్నాను క్వీన్‌ను చేయాలని నిర్మాత వర్గం భావించింది. అయితే ఈ అమ్మడు అధిక పారితోషికం డిమాండ్‌ చేయడంతో వేరే హీరోయిన్‌ కోసం అన్వేషణ జరుగుతున్నట్లు సమాచారం. మరో పక్క కాజల్‌అగర్వాల్‌ను క్వీన్‌గా ఎంపిక చేసినట్లు సోషల్‌మీడియాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర తమిళం, కన్నడం భాషల్లో నటుడు రమేశ్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్నారనే ప్రకటన వెలువడింది.

అంతే కాదు ఈ చిత్రానికి వానిల్‌ తేడి నిండ్రేన్‌ అనే టైటిల్‌ నిర్ణయించి హీరోయిన్‌ ఎంపిక జరగకుండానే చిత్రీకరణ ప్రారంభించారు. నాజర్‌ పాల్గొన్న కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా గోల్డెన్‌ క్లబ్‌ ఫిలింస్‌ అనే లండన్‌కు చెందిన ప్రొడక్షన్‌ సంస్థ యూనిట్‌కు షాక్‌ ఇచ్చే ప్రకటన విడుదల చేసింది. క్వీన్‌ చిత్ర దక్షిణాది హక్కులు తమకు చెందినవని, తాను స్టార్‌ మూవీస్‌ సంస్థ అధినేత త్యాగరాజన్‌ను భాగస్వామిగా చేర్చుకున్నామని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో నటించే తారల ఎంపిక జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో క్వీన్‌ చిత్రం తమిళం, కన్నడం భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోందన్న విషయం తెలిసి తాము షాక్‌కు గురయ్యామని పేర్కొన్నారు.క్వీన్‌ చిత్ర దక్షిణాది రీమేక్‌ హక్కులను తాము బ్రిటీష్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌(బీఎఫ్‌ఐ)లో రిజిస్టర్‌ చేసినట్లు తెలిపారు. ఇందులో నటీనటులను తాము ఎంపిక చేసే పనిలోనే ఉన్నామని, అలాంటిది తమను సంప్రదించకుండా చిత్రీకరణ జరపడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి తదుపరి ప్రకటనను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో క్వీన్‌ చిత్రం చిక్కుల్లో పడినట్లైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement