రాజభవనాల నుంచి బయటకు వచ్చి, రాజకీయాల్లో కాలుమోపిన మహరాజుల ట్రెండ్ 1951-52లో మొదలైంది. అప్పటి రాజు దివంగత హన్వంత్ సింగ్ రాథోడ్(జోధ్‌పూర్) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఫలితాలు వెలువడకముందే విమాన ప్రమాదంలో మరణించారు. దీని తరువాత, అతని కుమారుడు గజ్ సింగ్, కుమార్తె రాజకుమారి చంద్రేష్ కుమారి కటోచ్ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇద్దరూ అదృష్టాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న రాణులు, యువరాణుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విజయరాజే సింధియా: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1957లో రాణి రాజమాత విజయరాజే సింధియా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. 1957లో గుణ(మధ్యప్రదేశ్) లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన విజయరాజే సింధియా తొలిసారిగా పార్లమెంటుకు చేరుకున్నారు.
వసుంధర రాజే: గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన వసుంధర రాజే 1984లో బీజేపీ జాతీయ కార్యవర్గంలో చేరారు. 1985-87 మధ్య కాలంలో ఆమె భారతీయ జనతా యువమోర్చా రాజస్థాన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 1998-1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో వసుంధర రాజే విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. భైరోన్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత, రాజస్థాన్‌లో ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. రాజస్థాన్‌లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఝల్రాపటన్ నుండి పోటీచేస్తున్నారు.
దియా కుమారి: జైపూర్ మహారాణి, కూచ్ బెహార్ యువరాణి గాయత్రీ దేవి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, స్వతంత్ర పార్టీ ఎన్నికల గుర్తుపై 1962లో వరుసగా మూడుసార్లు గెలిచారు. ఆమె 2013లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2019లో బీజేపీ ఆమెకు లోక్‌సభ టికెట్ ఇచ్చింది. గెలిచిన తరువాత ఆమె పార్లమెంటులో స్థానం దక్కించుకున్నారు.
యశోధర రాజే సింధియా: యశోధర రాజే సింధియా, జీవాజీరావు సింధియా, దివంగత రాజమాత విజయరాజే సింధియాల కుమార్తె. 1998 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీచేసి గెలుపొందారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె ప్రకటించారు.
గాయత్రీ రాజే పన్వార్: మధ్యప్రదేశ్‌లోని దేవాస్ రాజ కుటుంబానికి చెందిన గాయత్రీ రాజే పన్వార్‌కు దేవాస్ అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్ లభించింది. గాయత్రి ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తుకోజీ రావు పవార్ ఈ స్థానం నుండి వరుసగా ఆరు సార్లు ఎన్నికయ్యారు. ఆయన 2015లో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. అతని భార్య గాయత్రి రాజే పవార్ ఆ స్థానం నుంచి గెలిచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
పక్షాలికా సింగ్: రాణి పక్షాలికా సింగ్ యూపీలోని బాహ్ అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే. ఆమె 2017లో బీజేపీలో చేరారు. యూపీలోని అత్యంత ధనిక మహిళా ఎమ్మెల్యే రాణి పక్షాలికా సింగ్. 2017లో ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో తనకు సుమారు రూ.58 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: బాబాల మాయలో మధ్యప్రదేశ్ సర్కార్? ‘ఓట్ల ఆశీర్వాదం’ కోసం పడిగాపులు?
Comments
Please login to add a commentAdd a comment