భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని బాణాపురంలో మంగళవారం రాత్రి
జనగామ : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని బాణాపురంలో మంగళవారం రాత్రి జరిగింది. మృతుడి తండ్రి నర్సయ్య, ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. 21వ వార్డు బాణాపురం కాలనీకి చెందిన దేవరాయ రామకృష్ణ(24)కు మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన రాణితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. 15 రోజుల క్రితం భార్య,భర్తలు గొడవ పడడంతో రాణి పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్యను తీసుకొచ్చేందుకు భర్త వెళ్లగా నిరాకరించడంతో తల్లిని పంపించినా ఫలితం లేకపోయింది. దీంతో మానసిక వేదనకు గురైన రామకృష్ణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఫ్యాన్‌కు వేలాడుతున్న కొడుకున చూసి బోరున విలపించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తలరించారు.