క్వీన్ రీమేక్లో కాజల్..? | Kajal Aggarwal is on board remake of Queen | Sakshi

క్వీన్ రీమేక్లో కాజల్..?

Jun 7 2017 3:16 PM | Updated on Oct 30 2018 5:58 PM

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను స్టార్ చేయాలని భావించిన త్యాగరాజన్, రేవతి దర్శకత్వంలో తమన్నా లీడ్ రోల్లో క్వీన్ను రీమేక్కు ప్లాన్ చేశాడు.

అయితే తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంలో ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. కానీ త్యాగరాజన్ మాత్రం క్వీన్ రీమేక్ను ఎలాగైన ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే ముందుగా కన్నడ లో రమేష్ అరవింద్ దర్వకత్వంలో పరుల్ యాదవ్ లీడ్ రోల్ లో సినిమాను స్టార్ట్ చేశాడు. తరువాత తమన్నా ప్లేస్లో మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు.

తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ రీమేక్లో నటించేందుకు అంగీకరించింది. రేవతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కాజల్తో చర్చలు జరుపుతున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement