క్వీన్ ఎవరో? | nayanatara demanding her remmunaration three crore | Sakshi
Sakshi News home page

క్వీన్ ఎవరో?

Published Sun, Mar 20 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

క్వీన్ ఎవరో?

క్వీన్ ఎవరో?

 నయన క్వీనా? ఈ విషయం గురించి సినీ పరిశ్రమలో రకరకాల ప్రచారం జరుగుతోంది. నటిగా ప్రస్తుతం దక్షిణాదిలో నయనతారనే రాణిగా వెలుగొందుతున్నారన్నది వాస్తవం. ఆమె చిత్రానికి మూడు కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్. తాజాగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించనున్న చిత్రానికి నయనతార మూడు కోట్లు పుచ్చుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇది కాదు. నయనతార హిందీ చిత్రం క్వీన్‌లో నటించనున్నారా? అన్నది. హిందిలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం క్వీన్. ఈ సంచలన విజయం సాధించి ఆమెను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన చిత్రం ఇది. దీని దక్షిణాది పునర్ నిర్మాణ హక్కుల్ని సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ ఫ్యాన్సీ ఆఫర్‌తో సొంతం చేసుకున్నారు. అయితే ఈ చిత్రంలో కంగనా రనౌత్ పాత్రలో నటించాలన్న ఆ కాంక్షను దక్షిణాదికి చెందిన చాలా మంది ప్రముఖ నాయికలు వ్యక్తం చేశారు. అదే విధంగా చాలా మంది ప్రముఖ నటీమణుల పేర్లను నిర్మాత వర్గం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

నయనకు ఆఫర్?
ఈ నేపథ్యంలో ప్రస్తుత టాప్ హీరోయిన్ నయనతారకు క్వీన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు, ఆమె కూడా క్వీన్‌గా మారడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు,అయితే చిత్ర వర్గం అడిగిన కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో అంగీకరించలేక పోయినట్లు రకరకాల ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

 

నాయకి ఎంపిక జరగలేదు
క్వీన్ చిత్రాన్ని నిర్మించనున్న త్యాగరాజన్ అవాస్తవ ప్రచారాలకు పుల్‌స్టాప్ పెట్టే విధంగా తామింకా చిత్ర కథానాయకిని ఎంపిక చేయలేదని స్పష్టం చేశారు. క్వీన్ చిత్రం భారీ నిర్మాణంతో కూడిందన్నారు. చిత్ర షూటింగ్ పూర్తిగా ఐరోపా దేశాల్లో చిత్రీకరించాల్సి ఉందన్నారు. అందుకు లొకేషన్స్ ఎంపిక చేయడానికి ఆ దేశాల అనుమతి పొందాల్సి ఉందని తెలిపారు.ఈ చిత్రంలో నటించనున్న హీరోయిన్ గురించి రకరకాల ప్రచారం జరుగుతుండడంతో తాను స్పందిచాల్సి వచ్చిందని, క్వీన్ చిత్రంలో నటించే హీరోయిన్‌ను ఎంపిక ఇంకా జరగలేదనీ స్పష్టం చేశారు. ఈ చిత్రం హీరోయిన్ చుట్టూ తిరిగే కథ కావడంతో ఇందులో నటించే నాయకి కాల్‌షీట్స్ 120 వరకూ అవసరం అవుతుందన్నారు.ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ ఎంపిక ఉంటుందనీ ఈ చిత్రంలో ప్రశాత్ నటించడం లేదని తెలిపారు. దీనికి సీనియర్ నటి రేవతి దర్శకత్వం బాధ్యతల్ని, నటి సుహాసిని సంభాషణలు అందిస్తున్నారని, చిత్ర షూటింగ్‌ను మేలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement