Dry skin
-
పొడి చర్మానికి తక్షణ నిగారింపు కోసం ఇలా చేయండి..
టేబుల్ స్పూను తేనెలో, టీస్పూను పెరుగు, అరటీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం ఇన్స్టంట్ నిగారింపుని సంతరించుకుంటుంది. ఈ ప్యాక్ పొడిచర్మానికి బాగా పనిచేస్తుంది జిడ్డు చర్మతత్వం గలవారు ఈ ప్యాక్‌లో తేనెను తక్కువగా వేయాలి తేనె, పెరుగు ముఖచర్మానికి చల్లదనం ఇవ్వడంతోపాటు తేమను అందిస్తాయి. రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా ఉంచి, తాజాదనంతో కూడిన వర్ఛస్సునిస్తుంది. -
కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి.
కొందరిలో కాళ్లమీద పగుళ్లు చాలా లోతుగా ఏర్పడి నొప్పిని కలిగిస్తుంటాయి. మరీ ముఖ్యంగా మడమల మీద ఈ పగుళ్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సాధారణంగా చాలామందిలో కాళ్ల పగుళ్లు చలికాలంలో వస్తుంటాయి. కానీ కొందరిలో మాత్రం వేసవిలోనూ కనిపిస్తుంటాయి. ►కాళ్ల పగుళ్లకు చాలా కారణాలు ఉండవచ్చు. ఎండాకాలంలో దేహానికి తగినంత నీరు అందని సందర్భాల్లో కూడా కాళ్లలో పగుళ్లు రావచ్చు. మరికొందరిలో... వారు వాడే సబ్బు సరిపడకపోవడం, తరచూ సబ్బునీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది. (బట్టలు ఉతికే మహిళల్లో డిటర్జెంట్ కలిసిన నీళ్లవల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది). ఇక ఆహారంలో పోషకాలు తగినన్ని అందని వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. ►ఇక మరికొందరిలో డయాబెటిస్, థైరాయిడ్ లేదా ఒబేసిటీ లాంటి ఆరోగ్యసమస్యలు ఉన్న సందర్భాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే ఆ సమస్యలతో బాధపడుతున్నవారు తమకు ఏ కారణంగా కాళ్లపగుళ్లు వచ్చాయో నిర్ధారణ చేసుకోవడం కోసం వైద్యపరీక్షలు చేయించి, ముందుగా అసలు (అండర్లైయింగ్) సమస్యకు చికిత్స తీసుకోవాలి. చదవండి: ముందే గుర్తిస్తే... డయాబెటిస్‌ను నివారించవచ్చు ►ఇంకొందరిలో బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు కాళ్ల పగుళ్ల సమస్యకు కారణం కావచ్చు. అలాంటివారిలో కాళ్ల పగుళ్లు బాగా లోతుగా ఉండి, వాటినుంచి రక్తస్రావం జరుగుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే ఆ దశకు చేరాక కూడా వాటికి తగిన చికిత్స తీసుకోకపోతే అవి పగుళ్ల స్థాయి నుంచి పుండ్లుగా మారే అవకాశం ఉంది. ఇదేగానీ డయాబెటిస్ ఉన్నవారిలో జరిగితే సమస్య లు మరింత జటిలంగా మారే అవకాశం ఉంది. ►కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా చాలామందిలో కనిపించే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటివారు వీలైనంతగా మంచి నీటిని ఎక్కువగా తాగుతుండాలి. అలాగే ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం పొడిబట్టతో తడి లేకుండా తుడవాలి. ►మాయిశ్చరైజర్ ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని రాత్రంతా సాక్సులను ధరించి నిద్రించడం లాంటి చిన్న చిన్న ఉపశమన చికిత్సలతోనే చాలామందిలో ఇవి తగ్గిపోతాయి. అలా తగ్గకపోతే అవి ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా వచ్చినవిగా పరిగణించి, అసలు సమస్య నిర్ధారణ, చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి. చదవండి: Health Tips: విటమిన్ బి 12 లోపమా.. ఇవి తిన్నారంటే.. -
Skin Care Tips: డ్రైఫ్రూట్స్, గుడ్లు, చేపలు తిన్నారంటే..
సీజన్ మారితే మన శరీరంలో కూడా మార్పులు వెంటనే చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో పొడి చర్మం మరింతగా వేదిస్తుంది. వాతావరణంలో తేమ స్థాయిలు తక్కువైనా, చలి లేదా వేడిగా ఉన్నా, వేడి నీళ్లతో స్నానం చేస్తున్నా.. చర్మం పొడిబారిపోతుంది. ఐతే మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా సహజమైన పద్ధతుల్లో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మీకు తెసుసా! జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ కాస్మొటాలజీ ప్రకారం ప్రొటీన్లు, తాజా పండ్లు, కూరగాయలు వంటి నీటి శాతం పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా సహాయపడతాయని పేర్కొంది. లోపల్నుంచి తగిన పోషకాలను అందిస్తే చర్మానికి మరింత మేలు చేకూరుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వులు డ్రైఫ్రూట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రేస్ కలిగించే హానికారకాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి ఒక స్పూన్ లేదా గుప్పెడు డ్రైఫ్రూట్స్ ప్రతిరోజూ తినడం వల్ల అధిక క్యాలరీలు అందడమే కాకుండా మీ శరీర కాంతిని మెరుగుపరుస్తుంది. సోయ సోయలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలోని ఐసోఫ్లేవోన్స్ కొల్జాజెన్ను కాపాడి చర్మ ముడతలను నివారించడంలో సహాయపడుతుంది. సోయ పాలు లేదా టోఫు ఏ విధంగా తీసుకున్న చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టమాట టమాటాల్లో విటమిన్ ‘సి’, లైకొపీన్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. టమాటాలను ఉడికించి క్రీమీ పేస్ట్‌లా లేదా తక్కువ నూనెలో వేయించి అయినా తినొచ్చు. చేప చేపలో ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఐతే ఇవి సహజంగా శరీరంలో ఉత్పత్తి కావు. కణత్వచం (పై పొర) ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ చర్మాన్ని ఎల్లప్పుడూ తడిగా ఉంచుతుంది. గుడ్డు సల్ఫర్, లూటీన్ గుడ్డులో అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృధువుగా, చెమ్మగా ఉంచుతుంది. అల్పాహారంలో లేదా ఇతర ఏ పద్దతుల్లో తిన్నా మంచిదే. సిట్రస్ ఫ్రూట్స్ విటమిన్ ‘సి’ ఈ పండ్లలో నిండుగా ఉంటుంది. ఆరెంజ్, కిన్నో, స్వీట్ లెమన్.. వంటి పండ్లలో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా హైడ్రేషన్‌ను అందిస్తుంది. క్యారెట్ బేటా కెరోటిన్, విటమిన్ ‘సి’లకు క్యారెట్ బెస్ట్. ఈ రెండు విటమిన్లు చర్మకాంతిని మెరుగుపరచడంలో, వృద్ధాప్యాన్ని నివారించడంలో తోడ్పడతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. ఈ ఆహారపు అలవాట్లు మీ శరీరసోయగాన్ని మరింత పదిలంగా కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Zinc Rich Diet: వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే! -
ముఖ తేజస్సుకు...
పదే పదే ముఖం శుభ్రం చేస్తే పదింతల మేలు అనేది మీ ఆలోచనా?! అయితే వెంటనే ఆ అలవాటుకు స్వస్తి పలకండి. ఎందుకంటే... అతిగా కడగడం: ముఖాన్ని రోజులో ఎక్కువ సార్లు శుభ్రం చేయడం వల్ల చర్మంపై సహజమైన నూనెలు తగ్గిపోయి, పొడిబారుతుంది. పొడిబారిన చర్మం త్వరగా ముడతలు పడుతుంది. రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి పడుకునేముందు ముఖాన్ని ‘మైల్డ్ సోప్ లేదా ఫేస్‌వాష్’తో శుభ్రం చేసుకోవాలి. పొడిచర్మం: ముఖాన్ని శుభ్రపరుచుకున్న వెంటనే చాలాసార్లు దురదగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు మీది పొడి చర్మం అని గమనించాలి. సబ్బు లేదా ఫేసియల్ ఫోమ్ మీ చర్మతత్వానికి సరిపడటం లేదని తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు ముఖం కడిగిన తర్వాత లోషన్ లేదా నూనె రాసుకోవాలి. పొడి చర్మం గలవారు క్లెన్సర్స్ ఉపయోగించకపోవడమే మేలు. వేడినీళ్లు: చర్మం తన సహజసిద్ధమైన నూనెలను కోల్పోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వేడినీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోకూడదు. బయటి ఉష్ణోగ్రతలను బట్టి చర్మం తట్టుకోగలిగేటంత గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు. మాయిశ్చరైజింగ్ వాడకపోవడం: జిడ్డు చర్మం గలవారు ఈ టిప్‌ను అనుసరించాల్సిన పనిలేదు. సాధారణ, పొడి చర్మం గలవారు ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే మంచి మాయిశ్చరైజర్‌ని రాసుకుంటే రోజంతా చర్మం మృదువుగా ఉంటుంది. -
ముప్ఫై దాటాక...
ముప్ఫై దాటిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు... డబుల్ చిన్, కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారడంతోపాటు మెడ, చేతులు వార్థక్య చిహ్నాలను ప్రతిబింబించడం మొదలవుతుంది. వాటిని నివారించడానికి... డ్రైస్కిన్ అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల పాలు తీసుకుని గోరువెచ్చగా చేసి అందులో చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్‌ను ముంచి ముఖం, మెడకు అప్లయ్ చేసి తుడిచేయాలి. ఇది క్లెన్సర్‌గా మురికిని తొలగించడంతో పాటు మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. జిడ్డు చర్మం అయితే ఒక టేబుల్ స్పూన్ స్కిమ్డ్ మిల్క్‌లో నీటిని కలిపి పలుచగా చేయాలి. ఇందులో కాటన్ ముంచి ముఖానికి, మెడకు అప్లయ్ చేసి టిష్యూ పేపర్‌తో తుడిచేయాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడుసార్లు చేయాలి. ఇది చక్కని క్లెన్సర్‌గానే కాకుండా చర్మాన్ని మృదువుగా మార్చి ముడతలు పడకుండా కాపాడుతుంది. రోజూ రాత్రి నెయ్యి లేదా బేబీ ఆయిల్ రాస్తుంటే కళ్ల చుట్టూ ఉన్న చర్మం కాంతిమంతంగా ఉండి వార్ధక్య లక్షణాలను సంతరించుకోదు. -
బ్యూటిప్
ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను పెరుగు, అర స్పూను తేనె కలిపి... ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది. దీనిని అన్ని రకాల చర్మతత్వాల వాళ్లూ పాటించవచ్చు. అయితే డ్రైస్కిన్కి మీగడ పెరుగు, ఆయిలీ స్కిన్ వాళ్లు మీగడ లేని పెరుగు వాడాలి. -
పొడి చర్మానికి... ఓట్మీల్ ప్యాక్...
ఓట్‌మీల్‌ను మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో తగినంత నీటిని కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చటినీటిలో ముంచిన క్లాత్‌తో తుడవాలి లేదా గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది పొడిబారి పగుళ్లు బారుతున్న చర్మానికి మంచి పోషణ. చర్మం నెర్రలు బారి మంటపెడుతున్నప్పుడు కూడా ఈ ట్రీట్మెంట్ చేస్తే సత్వర ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ పురుగుకాట్లు వంటి గాయాలకు కూడా రాయవచ్చు. ఓట్మీల్ రెండు కప్పులు పొడి చేసుకుని రోజూ కావలసిన మేరకు నీటితో కలుపుకుని వాడుకోవచ్చు. -
ఈసీవాగు వెలవెల
⇒ వానాకాలంలో ఇప్పటి వరకు వాగులో చేరని వరద ⇒ హిమాయత్‌సాగర్ సైతం ఎండుముఖం ⇒ పెరగని భూగర్భజలాలు శంషాబాద్ రూరల్ : వర్షాకాలంలో వరదతో కళకళలాడాల్సిన ఈసీవాగు నీరు లేక వెలవెలబోతోంది. జంట నగరాలకు తాగునీటిని అందించే జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌లోకి వరదను చేర్చే ఈ ప్రధాన వాగులో ఇప్పటి వరకు చుక్కనీరు పారలేదు. వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన వానలు కురవలేదు. జిల్లాలోని వికారాబాద్ ప్రాంతంలో మొదలై ఈ వాగు చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంషాబాద్ మండలాల పరిసరాల నుంచి హిమాయత్‌సాగర్‌కు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిస్తే వాగులో వరద పారుతుంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు లేక వాగులో వరద రాలేదు. గత ఏడాది సైతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత రెండేళ్ల నుంచి వాగులోకి పెద్దగా నీరు పారలేదు. వాగులో వరద పారితే భూగర్భజలాలు పెరిగి సమీప గ్రామాల్లోని బోర్లలో నీరు పుష్కలంగా వస్తాయి. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగు పరిసర ప్రాంతాల్లో రైతులు బోర్ల కింద ఎక్కువగా వరి, కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితులతో గతేడాది డిసెంబరు నుంచి బోర్లు ఎండిపోతూ వచ్చాయి. సరైన వర్షాలు లేక భూగర్భజలాలు పెరగక నేటికీ బోర్లు రీచార్జ్ కాలేదు. దీంతో వరిసాగుకు తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు హిమాయత్‌సాగర్‌లో నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకోవడమే కాకుండా నగరానికి నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షాకాలంలో నీటితో కళకళలాడి పర్యాటకులను ఆకర్షించే హిమాయత్‌సాగర్ నేడు నీరు లేక వట్టిపోతోంది. -
బ్యూటిప్స్
పొడిచర్మం గలవారు వేసవిలో ఎదుర్కొనే సమస్యకు పెరుగు మంచి పరిష్కారం. దోస లేదా కీరా ముక్క. కప్పెడు ఓట్స్. పెద్ద చెంచాడు పెరుగు తీసుకోండి. దోస గుజ్జు, ఓట్స్ పెరుగులో కలిపి నానబెట్టి, చిక్కటి మిశ్రమం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు పట్టించి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరుచుకోవాలి. పెరుగు, ఓట్స్‌లోని సుగుణాలు తేమ లేకుండా నిస్తేజంగా ఉన్న ముఖ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. దోసలోని గుణాలు మలినాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. దీని వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. అంతేకాదు, ఎండ వల్ల చర్మం మండటం వంటి సమస్యా తగ్గుతుంది. రోజూ ఈ ప్యాక్ వేసుకోవచ్చు. -
చేతుల చర్మం పొడిబారిందా?
గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం వల్ల సబ్బుల్లోని రసాయనాలు చేతుల చర్మం పై ప్రభావాన్ని చూపుతాయి. వీటి వల్ల చర్మం త్వరగా పొడిబారుతుంటుంటుంది. నిర్లక్ష్యం చేస్తే త్వరగా ముడతలు కనిపిస్తాయి. ఈ సమస్య దరిచేరకూడదు అంటే.. పని పూర్తయిన తర్వాత లిక్విడ్ సోప్‌తో చేతులను శుభ్రపరుచుకుని, కొబ్బరి నూనెతో చేతులను మర్దనా చేసుకోవాలి. కొబ్బరి నూనెలోని మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల చర్మం పొడిబారడం, ముడతలు పడటం జరగదు. -
వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది?
వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత దుస్తులు ఉతకడం చాలా సులువైపోయింది. కొంచెం అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ వాషింగ్ మిషన్లు ఉంటున్నాయి. ఇంతకీ వాషింగ్ మిషన్ ఎలా పని చేస్తుందో తెలుసా? వాషింగ్ మిషన్ అనేది విద్యుచ్ఛక్తి సాయంతో నడిచే ఒక గృహోపకరణం. దాదాపు అన్ని రకాల వాషింగ్ మిషన్లలోనూ గుండ్రటి డ్రమ్ము వంటిది ఉంటుంది. ఉతికిన దుస్తులను తీసి, ఇందులో వేస్తే, ఇది గిరగిరా తిరుగుతూ దుస్తులను నీళ్లు లేకుండా పిండుతుంది. ఇప్పుడు వస్తున్న అధునాతన వాషింగ్ మిషన్లలో అంటే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లలో ముందుగా రూపొందించబడిన మెకానిజం ప్రకారం, మనం కొన్ని మీటలను నొక్కితే చాలు... దుస్తులను ఉతకడం, జాడించడం, పిండటం వంటివన్నీ అదే చేస్తుంది. విద్యుత్తుతో పని చేసే కవాటం లోపలి ద్వారంలో నీటిని పోయాలి. ఫుల్లీ ఆటోమేటెడ్ అయితే నీటి కుళాయికి అనుసంధానిస్తే చాలు, అదే కావలసినంత నీటిని తీసుకుంటుంది. నీరు కావలసినంత మట్టానికి చేరగానే, దానిని కనిపెట్టి, దానంతట అదే నీటి ధార ఆగిపోయేలా సెన్సర్లు ఉంటాయి. కవాటం లోపలి ద్వారంలో ఉండే నీటి పీడనం మూలంగా కవాటం దానంతట అదే మూసుకుపోతుంది. నీటిని వేడి చేయవలసిన అవసరం ఉంటే, అందులో ఉండే వేడి చేసే పరికరం (హీటర్) ద్వారా నీరు వేడెక్కుతాయి. ముందుగానే సెట్ చేసి ఉంచిన సెన్సర్ ద్వారా దానికి కావలసిన వేడిని చేరగానే నీరు వేడెక్కటం ఆగిపోతుంది. నీటిలో కలిపిన డిటర్జెంట్ పొడి సాయంతో మురికి పోయేలా డ్రమ్లోని దుస్తులను పరికరం అటూ ఇటూ వేగంగా తప్పుతుంది. శుభ్రపడిన దుస్తులు స్పిన్నింగ్ డ్రమ్ములోకి వెళతాయి. సెమీ ఆటో మేటిక్ అయితే మనమే వాటిని స్పిన్నింగ్ డ్రమ్ములోకి పంపించాలి. ఉతికిన దుస్తులలోని సర్ఫు నురగ పోయేలా బట్టలను ఆ పరికరం శుభ్రంగా జాడించి, అక్కడినుంచి బట్టలను ఎండబెట్టే డ్రయ్యర్‌లోకి పంపుతుంది. దుస్తులలోని నీరంతా పోయే వరకూ డ్రయ్యర్ వాటిని గట్టిగా పిండుతుంది. దుస్తులను పిండటం అయిపోయాక మనం వాటిని తీసి, గాలి లేదా ఎండ తగిలేలా ఆరవేయాలి. వాషింగ్ మిషన్ల వాడకం ద్వారా గృహిణులకు చాలా శ్రమ తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది.