చలికాలం చర్మం పొడిబారే సమస్య అధికంగా ఉంటుంది. పొడిచర్మం గలవారికి ఇది మరింత సమస్య. నూనె శాతం ఎక్కువ ఉండే క్రీములు, లోషన్లు ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అందుకు... ఇంట్లో చేసుకోదగిన సౌందర్యసాధనాలు..
ఆలివ్ ఆయిల్‌తో...
కోకోబటర్‌లో చర్మాన్ని మృదువుగా మార్చే మాయిశ్చరైజర్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. టేబుల్ స్పూన్ కోకోబటర్– ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది ముఖానికి, మెడకు రాసి 15–20 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పాల మీగడ
మీగడలో ఉండే నూనె చర్మాన్ని పొడిబారనీయదు. తేనెలో చర్మసంరక్షణకు సహాయపడే ఔషధాలు ఉన్నాయి. మీగడ–తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. రోజూ పాల మీగడ–తేనె కలిపిన మిశ్రమాన్ని ఉపయోగిస్తే చర్మకాంతి పెరుగుతుంది.
బొప్పాయి
విటమిన్–ఇ అందితే చర్మం త్వరగా మృదుత్వాన్ని కోల్పోదు. బాగా పండిన బొప్పాయి ముక్కను గుజ్జు చేసి, దాంట్లో పచ్చిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి.
బాదం నూనె
కోకో బటర్, బాదం నరి సమపాళ్లలో తీసుకొని కలిపి, మిశ్రమం తయారు చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. చర్మం పొడిబారే సమస్య దరిచేరదు.
(చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది)
Comments
Please login to add a commentAdd a comment